iPhone 17 Price
iPhone 17 Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? గత సెప్టెంబర్‌లో లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్ భారీ అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం 128GB ఆప్షన్ తొలగించి 256GB కొత్త ప్రారంభ కాన్ఫిగరేషన్ అందిస్తోంది. ఐఫోన్ 16తో పోలిస్తే బేస్ ధర దాదాపు రూ. 3వేలు పెంచింది. ఇప్పుడు, లేటెస్ట్ లీక్‌లను పరిశీలిస్తే.. భారతీయ కొనుగోలుదారులకు మరింత ధర పెరగొచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి.
బేస్ ఐఫోన్ మోడల్స్ రూ. 7వేల పెంపు? :
టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం.. ఈసారి స్టాండర్డ్ ఐఫోన్ 17 (iPhone 17 Price) ధర బాగా పెరిగే అవకాశం ఉంది. 256GB 512GB మోడల్స్ ధర ఒక్కొక్కటి రూ.7వేలు పెరగవచ్చని లీక్ పేర్కొంది. ఇదే జరిగితే ఆపిల్ ఎంట్రీ లెవల్ ఐఫోన్ వేరియంట్ ధర దాదాపు రూ.89,900 వద్ద ఉంటుంది.
అయితే, 512GB ఆప్షన్ రూ.1,09,900కి చేరుకుంటుంది. ఈ అడ్జెస్ట్ రెగ్యులర్ మోడల్ ఐఫోన్ ఎయిర్ మధ్య అంతరాన్ని తగ్గిస్తుందని బ్రార్ సూచించారు. ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే ఆఫర్ల సమయంలో దాదాపు రూ.1,12,900కి ఐఫోన్ ఎయిర్ అందుబాటులో ఉంది. ఆపిల్ ఇంకా ఎలాంటి మార్పులను రివీల్ చేయలేదు.
వైడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను పరిశీలిస్తే.. హార్డ్‌వేర్ పార్ట్స్ ధర పెంపుపై అనేక ఇతర బ్రాండ్లు ఈ ఏడాదిలో ఇప్పటికే ధరలను భారీగా పెంచేశాయి. ఉదాహరణకు.. ఐక్యూ 15 మోడల్ కన్నా కంటే రూ. 18వేలు భారీగా పెరిగింది. రియల్‌మి, ఒప్పో, వన్‌ప్లస్ అన్నీ కూడా ధరలను సర్దుబాటు చేశాయి. మోడల్‌ను బట్టి రూ. 3వేల నుంచి రూ. 13వేల వరకు పెంచేశాయి.
బేస్ ఐఫోన్ 17 మోడల్ ఎంట్రీ వేరియంట్ ఐఫోన్ 16 కన్నా అద్భుతమైన అప్‌గ్రేడ్‌లను పొందింది. ఊహించిన దానికన్నా హై డిమాండ్ కలిగి ఉంటుంది. డిమాండ్ ఆధారంగా ఆపిల్ ఐఫోన్ల ధరలను సర్దుబాటు చేస్తుంది. కొన్ని నివేదికలను పరిశీలిస్తే.. ఆపిల్ ప్రభావాన్ని తగ్గించేందుకు లిమిటెడ్ బ్యాంక్ డిస్కౌంట్లను అందించవచ్చునని సూచిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ 6.3 అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్ 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. 3nm ప్రాసెస్‌పై ఆపిల్ A19 చిప్‌పై రన్ అవుతుంది. 8GB ర్యామ్, 512GB వరకు NVMe స్టోరేజీతో వస్తుంది.
కెమెరా సెటప్‌లో బ్యాక్ సైడ్ రెండు 48MP లెన్స్‌లు, డాల్బీ విజన్ HDR వీడియో సామర్థ్యంతో 18MP ఫ్రంట్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఐఫోన్ 17 మోడల్ iOS26తో వస్తుంది. IP68 ప్రొటెక్షన్, ఫేస్ ఐడీ, UWB Gen2, శాటిలైట్ ఫీచర్లు, వైర్డు మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్‌తో 3692mAh బ్యాటరీతో వస్తుంది.