Apple Days sale goes live on Vijay Sales
Apple Days Sale : భారత మార్కెట్లోని టాప్ రేంజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్ అయిన విజయ్ సేల్స్ మళ్లీ భారీ ఆపిల్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఆపిల్ అభిమానుల కోసం మార్చి 16 నుంచి ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ల నుంచి మ్యాక్స్‌బుక్స్, ఐప్యాడ్స్, ఆపిల్ వాచ్, ఎయిర్ ప్యాడ్, ఆపిల్ కేర్ ప్లస్ వంటి అనేక ఆపిల్ ప్రొడక్టులపై భారీ డీల్‌లను అందిస్తుంది.
ఈ డీల్‌లను విజయ్ సేల్స్ స్టోర్‌లు, అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ సేల్ మార్చి 24న ముగియనుంది. మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ ఉంటే.. మీ కొనుగోళ్లపై 5వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. విజయ్ సేల్స్‌లో స్టోర్‌లో షాపింగ్ చేస్తే.. రూ.10వేల వరకు విలువైన ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు.
ఐఫోన్ 15 ప్రో :
ఆపిల్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్ మోడల్స్ ధరలు తగ్గాయి. 1టీబీ స్టోరేజ్‌తో కూడిన ఐఫోన్ 15 ప్రో ధర రూ. 184,900 ఉంటే.. ఇప్పుడు రూ. 162,990కు కొనుగోలు చేయొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. అదనంగా రూ. 3వేల తగ్గింపు పొందవచ్చు. తద్వారా రూ. 159,990 కొనుగోలు చేయొచ్చు. 512జీబీ స్టోరేజీ ఉన్న ఐఫోన్ 15 ప్రో వంటి ఇతర మోడళ్లకు తగ్గింపులు వర్తిస్తాయి. లాయల్టీ పాయింట్లు కూడా పొందవచ్చు. ఈ సేల్‌లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్‌లపై డిస్కౌంట్లను పొందవచ్చు.
ఐఫోన్ 15 :
ఆపిల్ ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 70,490, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 79,820 ఉంటుంది. ఈ ఐఫోన్ కొనుగోలుపై హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఉదాహరణకు.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 4వేలకు తగ్గింపు అందిస్తుంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ధర రూ. 3వేల వరకు తగ్గింపు అందిస్తుంది. ప్రతి కొనుగోలుపై లాయల్టీ పాయింట్లను పొందవచ్చు. అది మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ లాయల్టీ పాయింట్లు కాలక్రమేణా యాడ్ అవుతాయి. భవిష్యత్తులో కొనుగోళ్లపై మీకు మరిన్ని బెనిఫిట్స్ అందిస్తాయి.
ఐప్యాడ్ :
ఐప్యాడ్ 9వ జనరేషన్ ప్రారంభ ధర రూ. 27,900 ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ & డెబిట్ కార్డ్ హోల్డర్‌లకు రూ. 2వేల తగ్గింపుతో రూ. 25,900కు కొనుగోలు చేయొయ్చు. 194 లాయల్టీ పాయింట్‌లను కూడా పొందవచ్చు. ఐప్యాడ్ 10వ జనరేషన్ ప్రారంభ ధర రూ. 36,430 ఉండగా.. రూ. 3వేల తగ్గింపుతో రూ. 33,430కి అందుబాటులో ఉంటుంది.
దాంతో 251 లాయల్టీ పాయింట్లను పొందవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్ ప్రారంభ ధర రూ. 54,680 ఉండగా.. రూ. 4వేల తగ్గింపుతో రూ. 50,680కి పొందవచ్చు. తద్వారా 380 లాయల్టీ పాయింట్లను పొందవచ్చు. రూ. 83,900 ధర ఉన్న ఐప్యాడ్ ప్రో రూ. 4వేల తగ్గింపును పొందింది. దాంతో రూ. 79,300కి కొనుగోలు చేయొచ్చు. ఈ ఐప్యాడ్ కొనుగోలుతో 535 లాయల్టీ పాయింట్లను పొందవచ్చు.
మ్యాక్‌బుక్ :
ఆపిల్ మ్యాక్‌బుక్ M3 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్ వాస్తవానికి ధర రూ. 1,14,900 ఉంటుంది. కానీ, రూ. 5,000 తగ్గింపుతో రూ. 1,09,900కి అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్‌ను కొనుగోలు ద్వారా మీకు 824 లాయల్టీ పాయింట్లు లభిస్తాయి. ఎమ్1 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్ ధర రూ. 79,900 ఉండగా.. దీని ధర రూ. 5వేలు తగ్గింపుతో రూ. 74,900కి పొందవచ్చు. ఈ కొనుగోలుతో 562 లాయల్టీ పాయింట్‌లను పొందుతారు. M2 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్ ధర రూ. 89,900 ఉండగా.. దీని ధర రూ. 5వేల నుంచి రూ. 84,900 వరకు తగ్గింది. తద్వారా 637 లాయల్టీ పాయింట్లను పొందవచ్చు.
ఆపిల్ వాచ్ :
ఆపిల్ వాచ్ సిరీస్ 9 రూ. 38,810 నుంచి ప్రారంభమవుతుంది. అయితే రూ. 2,500 తగ్గింపుతో రూ. 36,310కి అందుబాటులో ఉంది. ఈ వాచ్ మోడల్‌ను కొనుగోలు ద్వారా 272 లాయల్టీ పాయింట్లు లభిస్తాయి. ఆపిల్ వాచ్ సిరీస్ ఎస్ఈ (2వ జనరేషన్) ధర రూ. 27,690, అయితే రూ. 2వేల తగ్గింపుతో రూ. 25,690కి పొందవచ్చు. ఈ కొనుగోలుతో 193 లాయల్టీ పాయింట్లను పొందవచ్చు.
ఆపిల్ వాచ్ సిరీస్ అల్ట్రా ధర రూ. 83,260 కాగా.. రూ. 4వేల తగ్గింపుతో రూ. 79,260కి కొనుగోలు చేయొచ్చు. తద్వారా 594 లాయల్టీ పాయింట్లను పొందవచ్చు. యూఎస్‌బీ-సితో ఎయిర్‌ప్యాడ్స్ ప్రో (2వ జనరేషన్) ధర రూ. 22,980 ఉండగా.. రూ. 2వేలు తగ్గింపుతో రూ. 20,980కు కొనుగోలు చేయొచ్చు. దాంతో 157 లాయల్టీ పాయింట్లను పొందవచ్చు.