Apple, Google have removed these 2 e-SIM apps in India
Remove e-sim apps : కొత్త ఇ-సిమ్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి యాప్స్ ఆఫర్లను నమ్మి అనేక మంది సైబర్ మోసగాళ్ల చేతుల్లో మోసపోయారు. అందుకే ఈ తరహా యాప్స్ పట్ల డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కఠినంగా చర్యలు చేపట్టింది. ప్రత్యేకించి సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, ఆపిల్ ప్లాట్ ఫారంల్లో ఇ-సిమ్ ఆఫర్ యాప్స్ ఉంటే వెంటనే తొలగించాలని డాట్ గత వారమే ఆదేశాలు జారీ చేసింది.
గూగుల్, ఆపిల్ తమ ప్లే స్టోర్, యాప్ స్టోర్ భారతీయ వెర్షన్ నుంచి వరుసగా Airalo, Holafly అనే రెండు eSIM ఆఫర్ యాప్‌లను తొలగించాయి. ముఖ్యంగా, భారత మార్కెట్లోని ఈ యాప్‌ల వెబ్‌సైట్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేయమని ఐసీపీలను కూడా (DoT) కోరింది.
ఇసిమ్ విక్రయం.. అధీకృత విక్రేతలకు మాత్రమే :
నివేదిక ప్రకారం.. భారత్‌లో (eSIM)లను విక్రయించాలంటే.. కంపెనీలు DoT నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందాలి. సింగపూర్‌కు చెందిన ఎయిర్‌లో, స్పెయిన్‌కు చెందిన హోలాఫ్లై రెండు కంపెనీలకు ఎలాంటి అధికారం లేదు. దాంతో ఈ రెండు ఇ-సిమ్ యాప్స్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి తొలగించారు.
అదనంగా, ఇ-సిమ్ అధీకృత డీలర్ల ద్వారా మాత్రమే విక్రయించవచ్చు. ఈ సిమ్ కార్డ్‌ని అందించే ముందు పాస్‌పోర్ట్ కాపీ లేదా వీసా వంటి ఐడెంటిటీ ప్రూఫ్‌ను కస్టమర్‌ల నుంచి తప్పక అడిగి తీసుకోవాలి. అధీకృత విక్రేతలు తప్పనిసరిగా ఈ గ్లోబల్ సిమ్‌ల వివరాలను భద్రతా ఏజెన్సీలకు అందించాలి.
Apple, Google removed e-SIM apps
ఇ-సిమ్‌లు అంటే ఏమిటి? :
ఆపిల్ ప్రకారం.. ఇసిమ్ అనేది ఇండస్ట్రీ స్టాండర్డ్ డిజిటల్ సిమ్.. ఇది ఫిజికల్ సిమ్ మాదిరిగా ఉండదు. కానీ, మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ నుంచి మొబైల్ ప్లాన్‌ను యాక్టివేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఐఫోన్ యూజర్లు 8 eSIMలను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఒకేసారి రెండు ఫోన్ నంబర్‌లను ఉపయోగించవచ్చు.
భారత్‌లో 2 యాప్‌లను ఎందుకు నిషేధించారు? :
భారత్‌లో సైబర్ నేరాలకు పాల్పడేందుకు మోసగాళ్లు అంతర్జాతీయ ఫోన్ నంబర్లతో కూడిన ఇసిమ్‌లను ఉపయోగిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. Airalo, Holafly అనే కంపెనీల ఇ-సిమ్ యాప్స్ నిషేధించినప్పటికీ.. (Nomad eSIM, aloSIM) వంటి ఇతర ఇసిమ్ ప్రొవైడర్లు ఇప్పటికీ భారతదేశంలో అందుబాటులో ఉన్నాయని నివేదిక పేర్కొంది.
Read Also : Samsung Galaxy A14 5G : శాంసంగ్ గెలాక్సీ ఎ14 5జీ ఫోన్ ఇదిగో.. భారత్‌లో ఈ సరికొత్త వేరియంట్ పొందాలంటే?