Apple iOS 26.1 Beta 3
Apple iOS 26.1 Beta 3 : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆపిల్ డివైజ్‌ల కోసం iOS 26.1 బీటా 3 అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూడో బీటా వెర్షన్ డెవలపర్‌ల కోసం ఆపిల్ రిలీజ్ చేసింది. ఇందులో iOS 26.1, iPadOS 26.1, macOS Tahoe 26.1, tvOS 26.1, watchOS 26.1, visionOS 26.1 ఉన్నాయి.
ఆపిల్ సెకండ్ బీటా అప్‌డేట్‌లను రిలీజ్ (Apple iOS 26.1 Beta 3) చేసిన వారం తర్వాత కొత్త బీటా అందుబాటులోకి వచ్చింది. మీరు డెవలపర్ అయితే లేదా ఆపిల్ బీటా ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీరు లేటెస్ట్ బీటాను నేరుగా మీ ఐఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇందుకోసం (Settings) ఆప్షన్ ఓపెన్ చేసి General ఆప్షన్ ట్యాప్ చేయండి. ఆపై సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఎంచుకోండి. మీ సపోర్టెడ్ డివైజ్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
ఈ అప్‌డేట్‌లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు డానిష్, డచ్, నార్వేజియన్, పోర్చుగీస్ (పోర్చుగల్), స్వీడిష్, టర్కిష్, సాంప్రదాయ చైనీస్, వియత్నామీస్‌తో సహా మరిన్ని భాషలలో అందుబాటులో ఉంది. ఎయిర్‌పాడ్స్ లైవ్ ట్రాన్స్‌లేషన్ అప్‌గ్రేడ్ అయింది.
ఇప్పుడు iOS 26.1లో జపనీస్, కొరియన్, ఇటాలియన్, చైనీస్ (మాండరిన్)కు సపోర్టు ఇస్తుంది. iOS 26.1 అప్‌డేట్ లిక్విడ్ గ్లాస్ ఎఫెక్ట్ ఇప్పుడు ఫోన్ యాప్ కీప్యాడ్‌కు చేర్చింది. ట్రాక్‌ల మధ్య ఈజీగా మారవచ్చు. ఆపిల్ మ్యూజిక్ కొత్త స్వైప్ గెచర్ కలిగి ఉంది. క్యాలెండర్, సఫారీ, ఫొటోల విజువల్ లుక్‌కు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
ఆపిల్ iOS 26.1 సపోర్టు చేసే ఐఫోన్లు :
iOS 26.1 అప్‌డేట్ iOS26కి సపోర్టు ఇచ్చే అన్ని ఐఫోన్లకు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ X కొత్త మోడళ్లతో పాటు ఐఫోన్ SE (2వ జనరేషన్ ఆపై) మోడళ్లకు కూడా అందుబాటులో ఉంటుంది.