Iphone
Apple iPhone 13: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ నుంచి మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడల్ ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 13 ప్రో. ఈ సిరీస్ ఫోన్‌లను ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ వర్చువల్ లాంచ్ ఈవెంట్‌లో లాంచ్ చేసింది. అనేక లీక్‌లు మరియు పుకార్ల తరువాత గత సంవత్సరం ఐఫోన్ 12 లైనప్‌కు సంబంధించి ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో మరియు ఐఫోన్ 13 ప్రో మాక్స్ వంటి నాలుగు కొత్త ఐఫోన్ 13 మోడళ్లు ఒకే స్క్రీన్ పరిమాణంతో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది సంస్థ.
అయితే, ఆసక్తికర విషయం ఏమిటంటే, ఐఫోన్ 13ను భారతదేశంలో ఫస్ట్ టైమ్ అమెరికా, చైనా, యుకే, యూఏఈ, జర్మనీ, ఆస్ట్రేలియా మరియు ఇతర అగ్ర మార్కెట్‌లతో కలిపి ఒకేసారి విడుదల చేస్తోంది యాపిల్ సంస్థ. అంతకుముందు సంవత్సరాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఫోన్ మార్కెట్లోకి వచ్చిన మూడు నుంచి నాలుగు వారాల తర్వాత భారతదేశంలో ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేవి.
ఆపిల్ మొత్తం అమ్మకాల్లో 1 శాతం కంటే తక్కువ వాటా కలిగిన భారత్‌లో ఈ ఫోన్‌లు ఇప్పుడు అందుబాటులోకి రావడంతో.. భారత్‌లో పెరుగుతున్న మార్కెట్‌ను, ఇస్తోన్న ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలో భారత్ ఇప్పటికే తయారీ మరియు ఎగుమతులకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు చైనా ఆధిపత్యం చెలాయించినా.. రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్ దిగ్గజాలు ఆసియా మార్కెట్‌లో భారత్ వైపు చూసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రీ బుకింగ్ అవకాశం ఇస్తుండగా.. 24వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఇండియాలో ఐఫోన్ 13 సిరీస్ ధరలు:
ఐఫోన్ 13ప్రో మ్యాక్స్
128జీబీ: రూ.1,29,900
256జీబీ: రూ. 1,39.900
512జీబీ: రూ.1,59,900
1టెరాబైట్ : రూ. 1,79,900
ఐఫోన్ 13 ప్రో
128జీబీ: రూ. 1,19,900
256జీబీ: రూ. 1,29,900
512జీబీ:రూ. 1,49,900
1టెరాబైట్ : రూ. 1,69,900
ఐఫోన్ 13
128జీబీ: రూ.79,900
256జీబీ: రూ. 89,900
512జీబీ: రూ. 1,09,900
ఐఫోన్ 13 మినీ
128జీబీ: రూ. 69,900
256జీబీ: రూ. 79,900
512జీబీ: రూ. 99,900