Amazon Flipkart Summer Sale : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్ సేల్.. ఆపిల్ ఐఫోన్‌ 14పై రూ.12వేలు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి!

Amazon Flipkart Summer Sale : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ద్వారా ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు.

iPhone 14 gets huge Rs 12,000 discount during Amazon, Flipkart summer sale

Amazon Flipkart Summer Sale on Apple iphone 14 : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అదిరే న్యూస్.. ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon Sale), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart Summer Sale) సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపు అందిస్తున్నాయి. ఐఫోన్ 14 మోడల్ 128GB స్టోరేజ్ ఆప్షన్ కలర్ వేరియంట్‌ రూ. 67,999కి అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ కలర్ వేరియంట్లు ధర రూ. 79,900 నుంచి రూ.69,999కి తగ్గాయి.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్, ఈఎంఐ ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ నుంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు అదనంగా10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ 14 256GB ఎంపిక చేసిన కలర్ ఆప్షన్లలో రూ. 77,999కి అందుబాటులో ఉన్నాయి.

Read Also : iPhone 13 Discount Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే కొనేసుకోండి.. డోంట్ మిస్..!

వాస్తవానికి ఈ ఐఫోన్ 14 ధర రూ. 89,990 నుంచి తగ్గింది. ఇతర వేరియంట్లలో ఐఫోన్ 14 మోడల్ రూ.78,999కి విక్రయిస్తున్నాయి. ఇందులో 512GB స్టోరేజ్ ఆప్షన్ రూ.1,09,900కి బదులుగా రూ.97,999కి అందుబాటులో ఉంది. హై స్టోరేజీ వేరియంట్‌లు అనేక బ్యాంక్ ఆఫర్‌లతో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14 మల్టీ స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది.

ఐఫోన్ 14 యూజర్లు రెడ్, బ్లాక్, వైట్, ఎల్లో, బ్లూ, పర్పల్ కలర్ ఆప్షన్ల మధ్య ఎంచుకోవచ్చు. ఐఫోన్ బాక్స్‌లో ఆపిల్ ఎలాంటి ఛార్జర్ అందించడం లేదు. ఫ్లిప్‌కార్ట్‌లో 20W ఆపిల్ ఛార్జర్ రూ. 1,579 అందిస్తుంది. ఆపిల్ యూజర్లు టైప్-C పోర్ట్‌తో థర్డ్-పార్టీ ఆప్షన్‌లను కూడా చూడవచ్చు. మీ బడ్జెట్ బట్టి ఐఫోన్ 13 కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. డిజైన్ పరంగా, iPhone 13, iPhone 14 రెండూ ఒకేలా ఉంటాయి.

iPhone 14 gets huge Rs 12,000 discount during Amazon, Flipkart summer sale

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఐఫోన్ 13 128GB ధర రూ. 69,900 నుంచి రూ. 58,499కి విక్రయిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో 256GB స్టోరేజీ ధర రూ. 68,499కి రిటైల్ అవుతుంది. ఈ ఐఫోన్ కలర్ ఆప్షన్లలో ఐఫోన్ 14 మాదిరిగానే ఉంటాయి. అయితే, ఎల్లో ఆప్షన్ బదులుగా వినియోగదారులు గ్రీన్ మోడల్‌ను ఎంచుకోవచ్చు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 అత్యల్ప ధర రూ.47,990కి పడిపోయింది. AirPods వంటి ఆపిల్ పెరిఫెరల్స్ (Flipkart)లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.

కస్టమర్లు ఈ ధరను మరింత తగ్గాలంటే బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో AirPods Pro 2nd-gen ధర రూ. 26,900కి బదులుగా రూ. 23,990కి విక్రయిస్తోంది. AirPods 3వ జనరేషన్ ఇయర్‌బడ్‌లు రూ. 19,900కి బదులుగా రూ. 16,990కి అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, ఎయిర్‌పాడ్స్ మాక్స్ హెడ్‌ఫోన్‌లు ధర రూ. 59,900 నుంచి రూ. 39,999కి అమ్ముడవుతున్నాయి. ఆన్‌లైన్ సేల్ సమయంలో ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.

Read Also : Amazon Summer Sale : అమెజాన్ సమ్మర్ సేల్ ఈరోజే లాస్ట్.. సరసమైన ధరలో 5 బెస్ట్ ఫోన్ డీల్స్.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..