Apple iPhone 15 Deal : రూ.62వేల లోపు ధరలో ఆపిల్ ఐఫోన్ 15 సొంతం చేసుకోండి.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 15 Deal : ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం సరికొత్త ఐఫోన్ 15ను తగ్గింపు ధరతో అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధరపై దాదాపు రూ. 18వేలు ఆదా చేసుకోవచ్చు. ధర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Apple iPhone 15 available on Flipkart under Rs 62,000, here is how to grab the deal

Apple iPhone 15 Deal : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఐఫోన్ 15 సిరీస్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 2023 సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ సరికొత్త ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు రూ.18వేల తగ్గింపుతో అందుబాటులో ఉంది. లేటెస్ట్ డిజైన్, అప్‌గ్రేడ్‌లు, ఐదు అద్భుతమైన కలర్ ఆప్షన్‌లతో, పాత ఐఫోన్ నుంచి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఆపిల్ ఐఫోన్ 15 డీల్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : iOS 18 Update : రాబోయే ఏఐ ఆధారిత iOS 18 ఆపిల్ చరిత్రలోనే అతిపెద్ద అప్‌డేట్ కావచ్చు.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 డిస్కౌంట్ :
ఐఫోన్ 15 మోడల్ ఐఫోన్ 14 ధరలోనే లాంచ్ అయింది. ఐఫోన్ 15 128జీబీ వేరియంట్ ధర రూ. 79,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ. 89,900కు పొందవచ్చు. 512జీబీవేరియంట్ రూ.1,09,900కి అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై బ్యాంక్ ఆఫర్‌లతో కేవలం రూ.62,224కే 128జీబీ మోడల్‌ని పొందవచ్చు. రంగు ఆప్షన్లను బట్టి ధరలో హెచ్చుతగ్గుదల ఉంటుంది. ఈ ఆఫర్ అన్ని కలర్ వేరియంట్‌లకు అందుబాటులో ఉంటుంది. అయితే చాలా వరకు, బ్లూ కలర్ సహా హై డిమాండ్ కారణంగా స్టాక్ లేదు. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ కార్డ్‌తో చెల్లిస్తే రూ. 3,825 తగ్గింపును అందిస్తోంది. మీ పాత ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ. 54,990 వరకు డిస్కంట్ అందిస్తోంది. అదనపు సౌలభ్యం కోసం నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌లు, యూపీఐ డిస్కౌంట్‌లను కూడా ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, మీరు ఐఫోన్ 15 కోసం మీ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 54,900 డిస్కౌంట్ పొందవచ్చు. మీ వద్ద ఐఫోన్ 12 పాత ఐఫోన్ ఉన్నప్పటికీ, ట్రేడింగ్ ద్వారా రూ. 20,850 డిస్కౌంట్ పొందవచ్చు.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్స్ :
6.1 అంగుళాల డిస్‌ప్లే, పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ అనే 5 పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. ఐఫోన్ 15 అద్భుతమైన స్టైలిష్ డిజైన్‌ను అందిస్తుంది. డైనమిక్ ఐలాండ్ నాచ్‌ని కూడా కలిగి ఉంది. ఐఫోన్ 14 ప్రో యూజర్లలో సాధారణ నాచ్‌కు బదులుగా అందిస్తుంది. ఐఫోన్ 15 సిరీస్ ఐఫోన్ 14 వంటి గత వెర్షన్ల మాదిరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉంది. 12ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగిన ఐఫోన్ 14 కన్నా ఐఫోన్ 15 కెమెరా సిస్టమ్ పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు.

Apple iPhone 15 available on Flipkart  

ఐఫోన్ 15 48ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. పోర్ట్రెయిట్ మోడ్‌లో అద్భుతమైన ఫోటోలు, వీడియోలను అందిస్తుంది. ఐఫోన్ 15 మోడల్ మీకు ఇష్టమైన వీడియోలు, మ్యూజిక్ ఎక్కువసేపు ఆస్వాదించడానికి అనుమతిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 గంటల వరకు వీడియోలను ప్లే చేయగలదు. 16 గంటల వరకు వీడియోలను స్ట్రీమింగ్ చేయగలదు. 80 గంటల వరకు ఆడియోను ప్లే చేయగలదని ఆపిల్ తెలిపింది. ఐఫోన్ 15 కూడా శక్తివంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఏ16 బయోనిక్ చిప్, గతంలో ఐఫోన్ 14 సిరీస్ ప్రో మోడల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఐఫోన్ 15 టాప్ 3 ఫీచర్లు ఇవే :
డైనమిక్ నాచ్ : ఐఫోన్ 15 ఇన్‌కమింగ్ నోటిఫికేషన్‌ల ఆధారంగా డైనమిక్ నాచ్‌ను కలిగి ఉంది. ఈ వినూత్న ఫీచర్ అవసరమైన ఫేస్ ఐడీ, ఇతర సెన్సార్‌లను విస్తరిస్తుంది. కొన్ని నిఫ్టీ ఫంక్షన్‌లను కూడా అందిస్తుంది. మీ పిజ్జా డెలివరీని ట్రాక్ చేయడానికి, మీ క్యాబ్ రైడ్‌ని మానిటరింగ్ చేయడానికి మరిన్నింటిని అనుమతిస్తుంది. గతంలో ఐఫోన్ 14 ప్రో మోడల్స్ కోసం రిజర్వ్ చేసిన ఈ ఫీచర్ ఇప్పుడు అన్ని ఐఫోన్ 15 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

యూఎస్‌బీ-సి పోర్ట్ : ఆపిల్ ఐఫోన్ 15 కూడా లైటనింగ్ పోర్ట్‌ను తొలగించి ఆ స్థానంలో యూఎస్‌బీ-సి పోర్ట్‌తో వస్తుంది. ఇతర డివైజ్‌లకు కూడా సపోర్టు చేస్తుంది. ఇకపై మీ ఐఫోన్ కోసం ప్రత్యేక కేబుల్‌ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ ల్యాప్‌టాప్, టాబ్లెట్ లేదా ఇతర గాడ్జెట్‌ల కోసం ఇదే ఉపయోగించవచ్చు.

అడ్వాన్సడ్ కెమెరా : ఐఫోన్ 15 మల్టీఫేస్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ఎలాంటి లైటింగ్ స్థితిలోనైనా అద్భుతమైన ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయగలదు. స్మార్ట్ హెచ్‌డీఆర్ ఫీచర్‌ను కలిగి ఉంది. మంచి నైట్ మోడ్‌ను కలిగి ఉంది. మీరు సెకనుకు 60 ఫ్రేమ్‌ల వద్ద 4కె వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. అది సరిపోకపోతే.. మీ పోర్ట్రెయిట్‌లను తీసిన తర్వాత ఫొటోల ఫోకస్, డెప్త్ జూమ్‌ని మార్చడం ద్వారా ఎడిట్ చేయొచ్చు.

Read Also : Realme 12 Pro Plus 5G Launch : ట్రిపుల్ రియర్ కెమెరాలతో రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు