Apple iPhone 15 : వారెవ్వా.. ఖతర్నాక్ డిస్కౌంట్.. ఐఫోన్ 15పై ఏకంగా రూ. 25 వేలకు పైగా తగ్గింపు.. ఇలా కొన్నారంటే?
Apple iPhone 15 : మీరు లేటెస్ట్ ఐఫోన్ 17 కొనడం కన్నా తక్కువ బడ్జెట్‌లో ఐఫోన్ కోసం చూస్తుంటే ఐఫోన్ 15 అద్భుతమైన ఆప్షన్. ఈ అదిరే డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?
- Sreehari A
- Published on- May 26, 2026 / 08:22 PM IST
Apple iPhone 15 ( Image Credit : Gemini AI )
- ఐఫోన్ 15లో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే
- 48MP వైడ్-యాంగిల్ కెమెరా, ఆపిల్ A16 బయోనిక్ ప్రాసెసర్
- బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 3,500 ఫ్లాట్ డిస్కౌంట్
Apple iPhone 15 : ఆపిల్ కొత్త ఐఫోన్ కొంటున్నారా? సరికొత్త ఐఫోన్ 17 కన్నా మంచి బడ్జెట్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం ఐఫోన్ 15 అద్భుతమైన డీల్ లభిస్తోంది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15పై ధర డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో సహా భారీ తగ్గింపులు పొందవచ్చు. ఈ ఐఫోన్‌లో 48MP వైడ్-యాంగిల్ కెమెరా, ఆపిల్ A16 బయోనిక్ ప్రాసెసర్ ఉన్నాయి. ఐఫోన్ 15పై డీల్స్, ధర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఐఫోన్ 15 ధర, ఆఫర్లు :
ఐఫోన్ 15 మోడల్ 128GB స్టోరేజ్ వేరియంట్ విజయ్ సేల్స్‌లో రూ. 57,900 ధరకు లిస్ట్ (Apple iPhone 15) అయింది. ఈ ఐఫోన్ సెప్టెంబర్ 2023లో రూ. 79,900 ధరకు లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 3,500 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో అసలు ధర నుంచి రూ. 54,400 అవుతుంది. ఈ ఐఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారుగా రూ. 25,500 తక్కువకు లభిస్తుంది.
ఐఫోన్ 15 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 15లో 1179×2556 పిక్సెల్స్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ ఐఫోన్ ఆపిల్ A16 బయోనిక్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
కొలతల పరంగా.. ఈ ఫోన్ 147.60 మిమీ పొడవు, 71.60 మిమీ వెడల్పు, 7.80 మిమీ మందం, 171.00 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఐఫోన్ దుమ్ము, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
ఐఫోన్ 15 బ్యాక్ సైడ్ ఎఫ్/1.6 అపర్చర్‌తో 48MP వైడ్-యాంగిల్ కెమెరా ఎఫ్/1.6 అపర్చర్‌తో 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, GPS, NFC, బ్లూటూత్, Wi-Fi సింగిల్ కనెక్టివిటీ పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, బారోమీటర్ కంపాస్/మాగ్నెటోమీటర్ సెన్సార్ ఉన్నాయి.
