Apple iPhone 15 selling with massive discount
Apple iPhone 15 Discount : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 గణనీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ ధర రూ. 70వేల కన్నా తక్కువకు సొంతం చేసుకోవచ్చు. తగ్గిన ధరతో పాటు, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తోంది. అయినప్పటికీ ట్రేడ్ చేసే మోడల్‌ను బట్టి ఫోన్ వాల్యూ మారుతుంది.
Read Also : Apple iPhone 13 Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. రూ.50వేల లోపు ధరకే ఆపిల్ ఐఫోన్ 13 సొంతం చేసుకోండి
మీరు ఐఫోన్ 15 కొనుగోలు చేయాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. గత సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 15 ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.70వేల కన్నా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా, ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 79,900 వద్ద లాంచ్ అయింది. గత ఏడాది ఐఫోన్ 14 మాదిరిగానే ఉన్నప్పటికీ కొత్త ఐఫోన్ 15 ముందున్న వెర్షన్ల కన్నా భారీ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 మోడల్ 128జీబీ వేరియంట్‌లో రూ. 66,999కి విక్రయిస్తోంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌గా రూ. 54,990 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఎక్స్ఛేంజ్ కోసం ఎంచుకున్నప్పుడు మాత్రమే గరిష్ట ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 మోడల్ రూ. 30వేల ధరలో పొందవచ్చు. ఐఫోన్ 15, ఐఫోన్ 14 లేదా ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లపై ట్రేడింగ్ చేస్తే ఈ వాల్యూ సరైన ఆప్షన్ కాకపోవచ్చు. అయినప్పటికీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్ లేకుండా కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ఆకర్షణీయమైన డీల్ అందిస్తోంది.
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్‌లు :
ఆపిల్ ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొన్ని ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. ప్రోమోషన్ టెక్నాలజీతో కూడిన 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఆకర్షణీయంగా ఉంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో హై రిజల్యూషన్, సున్నితమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఐఫోన్ 15 అనేది సరికొత్త ఏ16 బయోనిక్ చిప్‌తో రన్ అవుతుంది.
Apple iPhone 15 massive discount
శక్తివంతమైన చిప్ అధునాతన డిస్‌ప్లే టాప్ రేంజ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఐఫోన్ 15 ప్లస్‌లోని కెమెరా సిస్టమ్ ముందున్న వెర్షన్లతో పోలిస్తే.. గణనీయమైన అప్‌గ్రేడ్ అందిస్తోంది. కొత్త 48ఎంపీ ప్రధాన సెన్సార్‌తో లో-లైటింగ్ పరిస్థితుల్లో కూడా అద్భుతమైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయొచ్చు. అల్ట్రా వైడ్ టెలిఫోటో కెమెరాలకు విస్తరించి యూజర్లకు వైడ్ రేంజ్ ఫోటోగ్రఫీ ఆప్షన్లను అందిస్తాయి.
కెమెరా, డిస్‌ప్లే అప్‌గ్రేడ్‌లతో పాటు ఐఫోన్ 15 ప్లస్ లాంగ్ బ్యాటరీని కలిగి ఉంది. మీరు రోజంతా కనెక్ట్ అయి ఉండేలా చేస్తుంది. అదనపు భద్రత కోసం కొత్త అండర్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తుంది. కనెక్టివిటీకి యూఎస్‌బీ-సి పోర్ట్‌ను అందిస్తుంది. ఐఫోన్ 15 ప్లస్ మోడల్ గత వెర్షన కన్నా వినియోగదారులకు ఒకే విధంగా అందిస్తుంది. అత్యాధునికమైన డిస్‌ప్లే, శక్తివంతమైన చిప్, మెరుగైన కెమెరా సిస్టమ్, అదనపు ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించేలా ఉంది.