iPhone 16 Discount : విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 మోడల్‌పై అదిరే డిస్కౌంట్.. రూ. 75వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు!

Apple iPhone 16 Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా?. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో చెల్లించడం ద్వారామీరు ఆటోమేటిక్‌గా రూ. 5వేల క్యాష్‌బ్యాక్‌ని అందుకుంటారు.

Apple iPhone 16 available under Rs 75k at Vijay Sales with bank offers

Apple iPhone 16 Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. మీరు ఆపిల్ ఐఫోన్ 16ని అత్యంత సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ ఐఫోన్ 16 మోడల్‌పై విజయ్ సేల్స్ ప్రత్యేక ఆఫర్‌ని అందిస్తోంది. ఐఫోన్ 16 మోడల్ లాంచ్ ధర ధర రూ. 79,900 ఉండగా.. సేల్ ఆఫర్ కింద కేవలం రూ.75వేల లోపు ధరలో అందుబాటులో ఉంది. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. రూ. 74,900కి కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ నుంచి ఏకంగా రూ. 5వేల క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

Read Also : iPhone Data Transfer : పాత ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్ డేటాను ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలుసా? ఇదిగో టిప్స్ మీకోసం..

ఆఫర్ ఎలా పొందాలంటే? :
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ విజయ్ సేల్స్, కస్టమర్లకు ఈ డిస్కౌంట్ అందించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో చెల్లించడం ద్వారామీరు ఆటోమేటిక్‌గా రూ. 5వేల క్యాష్‌బ్యాక్‌ని అందుకుంటారు. ఐఫోన్ 16 ధరను రూ.74,900కి తగ్గించవచ్చు. తక్కువ ధరలో సరికొత్త మోడల్‌ను పొందాలనుకునే కొనుగోలుదారులు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను సరసమైన ధరలో పొందవచ్చు.

అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు :
క్యాష్‌బ్యాక్‌తో పాటు విజయ్ సేల్స్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్‌ను కూడా నిర్వహిస్తోంది. మీరు పాత ఫోన్‌ కలిగి ఉంటే.. ఐఫోన్ 16పై మరింత భారీ తగ్గింపుతో ట్రేడింగ్ చేయొచ్చు. మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కొత్త ఫోన్ కొనుగోలుపై ఎక్కువ ఆదా చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఈ డీల్ ఎందుకు బెటర్ అంటే? :
ఆపిల్ లేటెస్ట్ మోడళ్లలో ఐఫోన్ 16 ఒకటి. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, మరిన్ని అప్‌గ్రేడ్లతో వస్తుంది. సాధారణ ధర కొందరికి ఎక్కువగా అనిపించినప్పటికీ, విజయ్ సేల్స్‌లో క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు సరసమైన ఆప్ష‌గా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా మరిన్ని డిస్కౌంట్లను పొందవచ్చు కొనుగోలుదారులు ఐఫోన్ 16 ధరను మరింత తగ్గించవచ్చు.

ఆఫర్ ఎలా పొందాలంటే? :
ఈ ఆఫర్ పొందాలంటే.. మీరు ఏదైనా విజయ్ సేల్స్ స్టోర్‌ని విజిట్ చేయొచ్చు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయవచ్చు. క్యాష్‌బ్యాక్ పొందడానికి చెక్అవుట్ సమయంలో మీ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌ని తప్పకుండా ఉపయోగించుకోండి. మీ పాత ఫోన్‌పై ట్రేడింగ్ ఆసక్తి ఉంటే.. స్టోర్‌కు తీసుకురండి. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే.. విజయ్ సేల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి ఈ లిమిటెడ్ ఆఫర్ ద్వారా ఐఫోన్ 16ని తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు.

Read Also : WhatsApp Tips : వాట్సాప్‌లో ఇతరుల మెసేజ్ వారికి తెలియకుండానే ఇలా సీక్రెట్‌గా చూడొచ్చు తెలుసా? ఇదిగో ట్రిక్!