iPhone 16 Pro Price : కొత్త ఐఫోన్ 16 ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే కొనడం బెటర్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

iPhone 16 Pro Price : ఆపిల్ ఐఫోన్ కొనేవారికి అదిరిపోయే న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో ఏకంగా రూ. 19వేలు తగ్గింది.

iPhone 16 Pro Price

iPhone 16 Pro Price : మీరు కొత్త ఆపిల్ ఐఫోన్ 16 ప్రో కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం. ప్రస్తుతం ఆపిల్ హై-ఎండ్ ఐఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ. 19వేల కన్నా (iPhone 16 Pro Price) భారీ డిస్కౌంట్ అందిస్తోంది. పాత ఐఫోన్ అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా మరొక బ్రాండ్ నుంచి మారుతున్నా ఈ ఆఫర్ అసలు వదులుకోవద్దు.

ఐఫోన్ 16 ప్రో గతంలో కన్నా సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఐఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోవడం బెటర్.. ఆపిల్ ఐఫోన్ 16 కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ అందించే డీల్స్ ఏంటో ఓసారి లుక్కేయండి..

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో డీల్ రూ.1,19,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రస్తుతం రూ.1,07,900కు లిస్ట్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఐఫోన్ 16 ప్రోపై రూ.12వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ.7వేలు తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ ఆదా కోసం మీ పాత హ్యాండ్‌సెట్‌ను ట్రేడ్ చేయవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. HDR10, డాల్బీ విజన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. హుడ్ కింద, ఐఫోన్ 16 ప్రో ఆపిల్ పవర్‌ఫుల్ A18 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 8GB ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. కెమెరా ఫ్రంట్ సైడ్ 48MP మెయిన్ సెన్సార్, 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రావైడ్ లెన్స్‌తో సహా ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఐఫోన్ 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఇంకా, ఐఫోన్ 16 ప్రో 3582mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 25W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 4.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.