Apple iPhone 16e Price : ఆపిల్ ఐఫోన్ 16eపై అదిరిపోయే డిస్కౌంట్.. ఈ క్రేజీ ఆఫర్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్..!
Apple iPhone 16e Price : ఐఫోన్ 16పై అద్భుతమైన ఆఫర్.. ఈ స్టోర్‌లో అతి సరసమైన ధరకే ఐఫోన్ కొనేసుకోవచ్చు. ఫీచర్లు, స్పెషిఫికేషన్ల పరంగా ఈ డీల్ ఎలా ఉందో ఓసారి చెక్ చేయండి.

Apple iPhone 16e Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? చౌకైన ధరకే కొత్త ఐఫోన్ తీసుకోవాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన ఆపిల్ కొత్త సరసమైన మోడల్ ఐఫోన్ 16e భారీ తగ్గింపుతో లభిస్తోంది. రిలయన్స్ డిజిటల్ స్టోర్ ఈ ఐఫోన్ 16e కొనుగోలుపై ఖతర్నాక్ డిస్కౌంట్ అందిస్తోంది.

ఆసక్తిగల కొనుగోలుదారులు ఇప్పుడు రూ. 18వేల కన్నా ఎక్కువ సేవ్ చేయవచ్చు. తద్వారా ఐఫోన్ 16e మరింత తగ్గింపు ధరకే పొందవచ్చు. పాత ఐఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అవుతున్నా లేదా మొదటిసారి ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నా ఈ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు. ఇంతకీ ఆపిల్ ఐఫోన్ 16e డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐఫోన్ 16e డీల్ కొత్త ధర, సేవింగ్స్ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ రూ.59,900 ధరకు లాంచ్ అయింది. ఐఫోన్ 16 లైనప్‌లో ఇతర మోడళ్లతో పోలిస్తే సరసమైన ఆప్షన్. రిలయన్స్ డిజిటల్ అధికారిక సైట్‌లో ఈ ఐఫోన్ ఇప్పుడు రూ.10,910 ఫ్లాట్ డిస్కౌంట్‌తో వస్తుంది. ఐఫోన్ ధర రూ.48,990కి తగ్గింది. మీకు ఈఎంఐ లావాదేవీల కోసం HSBC క్రెడిట్ కార్డ్ ఉంటే అదనంగా రూ. 7,500 తగ్గింపు పొందే అవకాశం ఉంది. ప్రస్తుత ధర రూ. 41,490కి తగ్గుతుంది. మొత్తం కలిపితే రూ. 18,410 సేవింగ్ చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ధర మరింత తగ్గుతుంది. పాత ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ మోడల్స్ నుంచి అప్‌గ్రేడ్ చేసుకునే యూజర్లకు కూడా ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది

ఆపిల్ ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు : ఐఫోన్ 16e మోడల్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంది. కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఐఫోన్ 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP మెయిన్ కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ ఐఫోన్ అల్యూమినియం బిల్డ్ కలిగి ఉంది. ఫేస్ ఐడికి సపోర్టు ఇస్తుంది. ఆపిల్ A18 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. గత ఏడాదిలో ఫ్లాగ్‌షిప్ మోడళ్లకు పవర్ అందించే అదే చిప్ కలిగి ఉంది. ఈ ఐఫోన్ ఇమేజ్ క్లీనప్, ఇమేజ్ ప్లేగ్రౌండ్, చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్, ఏఐ పవర్డ్ రైటింగ్ టూల్స్ వంటి అనేక ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు కూడా సపోర్టు ఇస్తుంది. ఇతర ముఖ్య ఫీచర్లలో USB-C పోర్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసంIP68 రేటింగ్ సర్టిఫికేట్, బ్లాక్ అండ్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

ఆపిల్ ఐఫోన్ 16e కొనాలా? : మీరు ఐఫోన్ 16e కొనేసుకోవచ్చు. ఈ ఐఫోన్ రూ. 41,490 ధర వద్ద లభిస్తోంది. A18 చిప్, అదిరిపోయే బ్యాటరీ పర్ఫార్మెన్స్, ఆపిల్ లేటెస్ట్ ఏఐ ఫీచర్లతో ఈ ఐఫోన్ అద్భుతమైన లాంగ్ వాల్యూను అందిస్తుంది. ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11, లేదా ఐఫోన్ 12 వంటి పాత ఐఫోన్ నుంచి అప్‌గ్రేడ్ చేసుకునే లేదా ఆండ్రాయిడ్ నుంచి మారే ఎవరికైనా ఈ డీల్ బెస్ట్ అని చెప్పొచ్చు.
