apple iphone 17
Apple iPhone 17 : ఆపిల్ లవర్స్ మీకోసమే. ఆపిల్ ఐఫోన్ 17 ధర తగ్గిందోచ్. పర్ఫార్మెన్స్, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల పరంగా ఐఫోన్ 16 కన్నా అద్భుతమైన ఐఫోన్. ఇప్పుడు, మీరు ఈ ఐఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 బేస్ వేరియంట్ మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై ఓసారి వివరంగా చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 17 ధర తగ్గింపు :
256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ 8GB ర్యామ్ వేరియంట్‌తో వస్తుంది. ఈ ఐఫోన్ అసలు ధర రూ. 82,900 ఉండగా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 79,900కు కొనుగోలు చేయవచ్చు.
ఇంకా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనేసుకోవచ్చు. అలాగే రూ. 5,895 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దాంతో అసలు ధర నుంచి ధర రూ. 74వేలకు తగ్గుతుంది. ఈ ఫోన్ లావెండర్, మిస్ట్ బ్లూ, సేజ్, వైట్ సహా 4 కలర్ ఆప్షన్లతో వస్తుంది.
ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐఫోన్ 17 మోడల్ 6.3-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా XDR ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. iOS26పై రన్ అవుతుంది. 3nm ప్రాసెస్ ఆధారంగా ఆపిల్ A19 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 5 కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU) కూడా లభిస్తుంది.
ఆపిల్ ఐఫోన్ 17 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP ప్రైమరీ షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP ఫ్రంట్ సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫోన్ 3692mAh బ్యాటరీతో పాటు 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.