ఆపిల్ నుంచి ఈ ఏడాది ఐఫోన్ 17 సిరీస్ విడుదల కానుంది. గత ఐఫోన్‌లతో పోల్చితే అనేక మార్పులతో ఐఫోన్ 17 సిరీస్ వస్తుంది. ఈ కొత్త ఐఫోన్ లాంచింగ్‌కు మరికొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ లీకుల ద్వారా ఇప్పటికే పలు వివరాలు తెలిశాయి. తాజాగా, ఐఫోన్ 17 సిరీస్‌కు సంబంధించిన మరిన్ని ఫీచర్ల గురించి లీకులు వచ్చాయి.
ఆపిల్ ఈ ఏడాది ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 అల్ట్రా మోడళ్లను విడుదల చేయవచ్చు. ఐఫోన్ 17 ఎయిర్ (ప్లస్ మోడల్ స్థానంలో)ను ఈ సారి కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఐఫోన్ 17 ఎయిర్ అత్యంత సన్నగా ఉండే ఐఫోన్ కానుంది.
ప్రో మినహా ఇతర మోడళ్లలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఆయా మోడళ్లలో 60Hz రిఫ్రెష్ రేట్ ఉండేది. తాజాగా, ఐఫోన్ 17 వనిల్లా ట్రిమ్ (స్టాండర్డ్ వెర్షన్) గురించి మరిన్ని వివరాలు తెలిశాయి.
Also Read: అఫీషియల్ ఫస్ట్‌లుక్ విడుదల.. కేక పెట్టించే ఫీచర్లతో IQOO నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తుందహో..
ఐఫోన్ 17 లాంచ్ టైమ్‌లైన్, ధర
iPhone 17 ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ కావచ్చని అంచనా. ఆపిల్ సాంప్రదాయకంగా దాని ఫాల్ ఈవెంట్‌ను సెప్టెంబర్‌లో నిర్వహిస్తుంది. ఐఫోన్ 17 స్టాండర్డ్ వెర్షన్ ధర ఇండియాలో రూ.79,900గా ఉంది.
ఇతర ఫీచర్లు
ఫ్రంట్ కెమెరా: 24MP
బ్యాక్ కెమెరా: డ్యూయల్ 48MP సెన్సార్లు
పర్ఫార్మన్స్: కొత్త A19 చిప్‌తో నడుస్తుంది. AI ఫీచర్లు మరిన్ని అప్‌గ్రేడ్లతో ఉంటాయి. ఫేస్ ID ప్రైమరీ బయోమెట్రిక్ పద్ధతిలో ఉంటుందని అంచనా, USB-C (iPhone 15 సిరీస్‌లో ప్రవేశపెట్టినట్లు)తో కొనసాగుతుండొచ్చు
కనెక్టివిటీ: Wi-Fi 6E లేదా Wi-Fi 7, 5G (మెరుగైన మోడెమ్ సామర్థ్యంతో), అల్ట్రా వైడ్‌బ్యాండ్ (UWB), స్పేషియల్ ఫీచర్‌లు