Telugu » Technology » Apple Iphone 17 Price Drops To Under Rs 75000 On Flipkart During Republic Day Sale Sh
Apple iPhone 17 : అద్భుతమైన డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 17 మీ బడ్జెట్ ధరలోనే.. ఎంత తగ్గిందంటే?
Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 ధర తగ్గింది. ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 17 రూ. 75వేల లోపు ధరలో కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Apple iPhone 17 : ఆపిల్ కొత్త ఐఫోన్ కొనేవారికి అద్భుతమైన డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 17 ధర భారీగా తగ్గింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో ఐఫోన్ 17 రూ. 9వేల తగ్గింపుతో లభ్యమవుతోంది. మీ పాత్ ఫోన్ నుంచి ఐఫోన్ 17కి అప్‌గ్రేడ్ చేసుకోవాలని చూస్తుంటే ఇది మీకోసమే.. ఐఫోన్ 17 అతి చౌకైన ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
2/6
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 ధర ఎంతంటే? : ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 17 రూ.82,900 ధరకు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ కార్డ్‌తో కస్టమర్‌లు రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. తద్వారా ధర రూ.78,900కి తగ్గుతుంది.
3/6
మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తే.. ఫోన్ వాల్యూతో పాటు రూ.5వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. తద్వారా ధర రూ.75వేల కన్నా తక్కువగా ఉంటుంది. మీ పాత ఫోన్, వర్కింగ్ కండిషన్, వేరియంట్, బ్రాండ్ మరిన్నింటితో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
4/6
ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ ఐఫోన్ ఈజీ ఈఎంఐ ద్వారా పొందవచ్చు. ఈఎంఐ రూ. 6,909 నుంచి ప్రారంభమవుతుంది. ఈఎంఐ అనేది బ్యాంక్ బట్టి మారుతాయి. ఒకవేళ ఎక్స్‌టెండెడ్ వారంటీ తీసుకుంటే మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.
5/6
ఆపిల్ ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు : ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందిస్తుంది. ఆపిల్ A19 చిప్ ద్వారా పవర్ పొందుతుంది 8GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది. ఈ ఐఫోన్ 30 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది.
6/6
ఐఫోన్ 16 కన్నా అద్భుతమైన అప్‌గ్రేడ్ పొందవచ్చు. ఈ ఐఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో లేటెస్ట్ iOS26 అప్‌డేట్‌తో రన్ అవుతుంది. 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP మెయిన్, 48MP అల్ట్రావైడ్ సెన్సార్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ఐఫోన్ 18MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.