Apple iPhone 17 Pro
Apple iPhone 17 Pro : ఆపిల్ లవర్స్ డోంట్ మిస్.. ఆపిల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐఫోన్ 17 ప్రో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఐఫోన్ మోడల్ లాంచ్ తర్వాత ఫస్ట్ టైమ్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. మీరు కొత్త ఐఫోన్ కోసం చూస్తుంటే ఈ ఐఫోన్ 17 ప్రో బెస్ట్ ఆప్షన్. భారత మార్కెట్లో రూ. 1,34,900కు లాంచ్ అయిన ఐఫోన్ మోడల్ ఇప్పుడు రూ. 1,32,490 ప్రారంభ ధరకు లభిస్తోంది.
అంటే.. రూ.2,410 ప్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇది కేవలం డీల్ ప్రారంభ ఆఫర మాత్రమే.. అదే మీరు HSBC, ICICI, Axis, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు అయితే అదనపు బ్యాంకు ఆఫర్లను పొందవచ్చు. ఈ మొత్తం డిస్కౌంట్లతో ఐఫోన్ 17 ప్రో అత్యంత ఆకర్షణీయమైన డీల్ అని చెప్పొచ్చు.
పర్ఫార్మెన్స్, డిజైన్ :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో ప్రీమియం సింగిల్ పీస్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. కొత్త A19 ప్రో చిప్ కూడా స్టేబుల్ టాప్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అంతేకాదు.. స్టీమ్ చాంబర్ కూలింగ్ ఫీచర్ కూడా ఉంది. ఆపిల్ లేటెస్ట్ 3-నానోమీటర్ A19 ప్రో ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఐఫోన్, గేమింగ్, మల్టీ టాస్కింగ్, కంటెంట్ క్రియేటర్లకు టాప్ రేంజ్ ఫ్లాగ్‌షిప్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
6.3-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. కాంపాక్ట్ ఫోన్ ఇష్టపడే యూజర్లకు బెస్ట్ ఫోన్. ఈ ఐఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో ప్రమోషన్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. స్మూత్ స్క్రోలింగ్, మెరుగైన వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. గేమర్లకు బెస్ట్ ఆప్షన్.
కెమెరా ఫీచర్లు :
ఫొటోగ్రఫీ పరంగా ఐఫోన్ 17 ప్రోలో 48MP ట్రిపుల్ ‘ప్రో ఫ్యూజన్’ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఆపిల్ కెమెరా సిస్టమ్ అప్‌గ్రేడ్ చేసినా స్టాండర్డ్ ఐఫోన్ 17లో టెలిఫోటో లెన్స్ లేదు.
స్టాండర్డ్ ఐఫోన్ 17, 256GB బేస్ వేరియంట్ రూ. 82,900 ధరకు లిస్ట్ అయింది. ఈ ప్లాట్‌ఫామ్ రూ. 1,658 విలువైన 2శాతం కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 8వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు.
క్రోమా వెబ్‌సైట్ ప్రకారం.. కస్టమర్‌లు తమ పాత ఫోన్‌కు రూ. 23,500 వరకు ఎక్స్చేంజ్ వాల్యూ పొందవచ్చు. రూ. 4,974 విలువైన 10శాతం నియోకాయిన్స్ (NeuCoins)తో కలిపితే ఐఫోన్ 17 ధర రూ. 44,768 వరకు తగ్గుతుంది. అయితే, ఈ సేల్ లిమిటెడ్ టైమ్ అందుబాటులో ఉంది. కచ్చితమైన సేల్ ఎండ్ డేట్ వెల్లడించలేదు.
హై-ఎండ్ పర్ఫార్మెన్స్, ప్రీమియం డిజైన్, బ్యాటరీ లైఫ్, అప్‌గ్రేడ్ డిస్‌ప్లేతో ఐఫోన్ 17 ప్రో అదిరిపోయే ఫ్లాగ్‌షిప్ ఆప్షన్ అందిస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ పోటీదారులతో పోలిస్తే A19 చిప్‌సెట్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.