iPhone 17 Pro Max : అదిరిపోయే ఫీచర్లతో ఐఫోన్ 17ప్రో మాక్స్ వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంత..? బుకింగ్స్ ఎప్పటినుంచి.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే..?

iPhone 17 Pro Max : ప్రపంచ వ్యాప్తంగా టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన యాపిల్ అతిపెద్ద ఈవెంట్ ముగిసింది.

iPhone 17 Pro Max

iPhone 17 Pro Max : ప్రపంచ వ్యాప్తంగా టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన యాపిల్ అతిపెద్ద ఈవెంట్ ముగిసింది. యాపిల్ పార్కులో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10.30 గంటలకు ఈ ఈవెంట్ జరగ్గా.. ఇందులో సరికొత్త ఐ ఫోన్లను విడుదల చేసింది. ఐఫోన్ 17 సిరీస్‌ ఫోన్లను యాపిల్ సంస్థ ఆవిష్కరించింది. ఇందులో మొత్తం నాలుగు మోడల్స్ ఉన్నాయి. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17ప్రో, ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్ (ఫ్లాగ్ షిప్‌ఫోన్)లను పరిచయం చేసింది. అంతేకాదు.. న్యూ జెనరేషన్ ఎయిర్ పాడ్స్ ప్రో3, స్మార్ట్ వాచ్ సిరీస్ SE3, 11 వాచ్ లను కూడా యాపిల్ సంస్థ పరిచయం చేసింది.

Also Read: Apple Airpods Pro 3: యాపిల్ ఈవెంట్.. అదిరిపోయే ఫీచర్లతో యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో 3.. ధర ఎంతంటే..

గత సంవత్సరం ఐఫోన్ 16 ప్రోమాక్స్ కంటే పలు అప్‌గ్రేడ్‌లతో ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ను యాపిల్ సంస్థ విడుదల చేసింది. కెమెరా సెటప్, శక్తివంతమైన చిప్‌సెట్, అనేక కలర్స్, పెద్ద బ్యాటరీ వరకు ఇలా.. ఐఫోన్ 17ప్రో మాక్స్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

 

యాపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ప్రత్యేకతలు, ఫీచర్లు ఇవే..

♦ ఐఫోన్ 17 ప్రోమాక్స్‌ను బిగ్‌ డిస్‌ప్లేతో తీసుకొచ్చారు. 6.9 అగుళాల సూపర్‌ రెటీనా XDR ప్రో మోషన్ OLED డిస్‌ప్లేతో విడుదల అయింది.
♦ ఐఫోన్ 17 ప్రో మాక్స్ 256GB, 512GB, 1TB (టెరాబైట్) స్టోరేజ్‌తో మరియు మొదటిసారిగా 2TB స్టోరేజ్ వేరియంట్లలోనూ లాంచ్ చేయబడింది.
♦ గత ఫోన్లలో కంటే అతిపెద్ద బ్యాటరీ కెపాసిటీ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఆపిల్ ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ కలిగిన ఐఫోన్‌గా నిలుస్తోంది. అలాగే వీటిలో 50శాతం ఛార్జింగ్ కేవలం 20 నిమిషాల్లో పూర్తవుతుంది.
♦ అల్యూమినియం బాడీతో ఈ పోన్లను కంపెనీ తీసుకొచ్చింది.
♦ ఈ ఫోన్లలో A19 ప్రో చిప్‌సెట్ మరియు వేపర్ చాంబర్ కూలింగ్ కూడా ఉన్నాయి. ఇందులోని కొత్త థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫోన్ వేడెక్కకుండా రక్షణ కల్పిస్తుంది.
♦ ఇందులో అమర్చిన A19 ప్రో అనేది ఆపిల్ సంస్థకు చెందిన అత్యంత సామర్థ్యం గల ఐఫోన్ చిప్. ఆపిల్ రూపొందించిన వేపర్ చాంబర్‌తో జత చేసినప్పుడు A19 ప్రో ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్ మనుపటి మోడల్ ఫోన్ల కంటే 40శాతం వరకు మెరుగైన, స్థిరమైన పనితీరుకు వీలు కల్పిస్తుంది.
♦ ఐఫోన్ 17ప్రోమాక్స్ ఫోన్‌కు అత్యుత్తమ కెమెరా వ్యవస్థను ముందు, వెనుక భాగంలో హై-రిజల్యూషన్ సెన్సార్లతో అమర్చారు.
♦ ఈ ఫోన్ వెనుక వైపు మూడు కెమెరాలు (మెయిన్, ఆల్ట్రావైడ్, టెలిఫొటో) 48 ఎంపీ (మెగా పిక్సెల్)తో తొలిసారి అందుబాటులోకి వచ్చాయి.
♦ ముదు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 24 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.
♦ ఐఫోన్ 17 ప్రో మాక్స్ కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
♦ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫ్రీ -ఆర్డర్ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాలు ప్రారంభమవుతాయి.
♦ భారతదేశంలో ఆపిల్ ఐఫోన్ 17ప్రో మాక్స్ ఫోన్ ధర రూ.1,49,900 నుంచి ప్రారంభమవుతుంది.

భారతదేశంలో కొత్త ఐఫోన్ మోడల్ ధర ఎంత?

ఐఫోన్ 17: రూ. 82,900 నుండి ప్రారంభమవుతుంది.
ఐఫోన్ 17 ఎయిర్: రూ. 1,19,900 నుండి ప్రారంభమవుతుంది.
ఐఫోన్ 17 ప్రో: రూ.1,34,900 నుండి ప్రారంభమవుతుంది.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్: రూ. 1,49,900 నుండి ప్రారంభమవుతుంది.