Apple iPhone 17 Pro Max : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డీల్.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అతి తక్కువకే.. ధర జస్ట్..
Apple iPhone 17 Pro Max : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- August 8, 2026 / 03:32 PM IST
Apple iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ లవర్స్ మీకోసమే.. ఐఫోన్ 17 భారీగా తగ్గిందోచ్.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 17 భారీ తగ్గింపుతో లభిస్తోంది.
సరికొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇది మీకోసమే.. ఐఫోన్ 17లో 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, 18MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఐఫోన్ 17పై ఆఫర్లు, డిస్కౌంట్లు, ధరలకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఐఫోన్ 17 ధర, ఆఫర్లు :
ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 81,900 ధరకు లిస్టు అయింది. ఈ ఐఫోన్ సెప్టెంబర్ 2026లో రూ. 82,900 ధరకు లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై రూ. 4వేలు తగ్గింపు పొందవచ్చు. తద్వారా ధర రూ. 67,850కే లభిస్తుంది.
ఈ ఐఫోన్ ప్రారంభ ధర కన్నా రూ. 5వేలు తక్కువకే లభిస్తోంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 60,800 వరకు తగ్గించవచ్చు. అయితే, ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 17 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 17లో 2622x1206 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్, 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ ఐఫోన్ ఆపిల్ A19 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం iOS26తో వస్తుంది. ఐఫోన్ 17లో కనెక్టివిటీ ఆప్షన్లలో NFC, GPS, 5G, Wi-Fi 7, eSIM సపోర్ట్, బ్లూటూత్ 6, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 17 బ్యాక్ సైడ్ ఎఫ్/1.78 అపర్చర్‌తో 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/1.9 అపర్చర్‌తో 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. కొలతల పరంగా, ఐఫోన్ 17 మోడల్ 71.5 మిమీ వెడల్పు, 149.6 మిమీ ఎత్తు, 7.95 మిమీ లోతు, 177 గ్రాముల బరువు ఉంటుంది.
