Apple iPhone 17e Launch
Apple iPhone 17e Launch : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో ఆపిల్ ఐఫోన్ 17e మోడల్ రానుంది. ఇప్పటికే మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ (Apple iPhone 17e Launch) కాగా అందులో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, సన్నని ఐఫోన్ ఎయిర్ ఉన్నాయి. అయితే, ఇప్పుడు అదే సిరీస్‌లో 17e ఫోన్ కూడా రాబోతుంది.
ఇటీవలే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సేల్స్ చార్టులలో ఐఫోన్ 17 సిరీస్ (Apple iPhone 17e Launch) టాప్ ప్లేసులో నిలిచింది. ప్రస్తుతం లీక్‌లు, ఊహాగానాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో వచ్చిన ఐఫోన్ 16eకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఐఫోన్ 17e రానుంది. ఆపిల్ 2026 లైనప్‌లో సరసమైన ధరలో ఐఫోన్ 17e లాంచ్ కావొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..
ఐఫోన్ 17e డిజైన్, డిస్‌ప్లే :
ఆపిల్ ఐఫోన్ 17e మోడల్ డిజైన్‌లో భారీ మార్పులు ఉండకపోవచ్చు. ఐఫోన్ 17e ఐఫోన్ 16e మాదిరిగానే డిజైన్ అందించే అవకాశం ఉంది. కొన్ని మైక్రో అప్‌గ్రేడ్స్‌తో రావొచ్చు. 6.1-అంగుళాల ప్రోమోషన్ OLED ప్యానెల్ సూచిస్తున్నాయి. అయితే, ఆపిల్ ప్రో మోడళ్లకు హై రిఫ్రెష్ రేటును రిజర్వ్ చేయవచ్చు. అయినప్పటికీ, ఇదే డిస్‌ప్లే ఐఫోన్ 17eకి కూడా మారవచ్చు.
ఐఫోన్ 17e కెమెరా అప్‌గ్రేడ్‌లు :
రిపోర్టుల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 17e మోడల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 48MP బ్యాక్ కెమెరా కలిగి ఉంది. సాధారణ ఫొటోగ్రాఫర్‌లకు ఫ్రంట్ సైడ్ 18MP సెల్ఫీ షూటర్ ఉండొచ్చు. ఐఫోన్ 17 సిరీస్‌లోని ఇతర మోడళ్లతో పరిశీలిస్తే సెంటర్ స్టేజ్ సపోర్టుతో మెరుగైన వీడియో కాల్ క్వాలిటీని అందిస్తుంది.
ఆపిల్ ఐఫోన్ 17e మోడల్ A19 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. బేస్ కాన్ఫిగరేషన్‌లో 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుందని తెలుస్తోంది. బ్యాటరీ పరంగా పరిశీలిస్తే.. ఆపిల్ సామర్థ్యాన్ని 4500mAhకు పెంచే అవకాశం ఉందని పుకార్లు చెబుతున్నాయి. ఐఫోన్ 16e మోడల్ 4005mAh సెల్ కన్నా అప్‌గ్రేడ్ అందిస్తుంది.
భారత్, యూఎస్ఏ, దుబాయ్‌లలో ఐఫోన్ 17e ధర (అంచనా) :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16e ధర రూ. 59,900కు లాంచ్ అయింది. ఆపిల్ ఐఫోన్ 17e కూడా అదే స్థాయిలో ఉండొచ్చు. అంతర్జాతీయంగా లీక్‌లను పరిశీలిస్తే.. యూఎస్ఏలో ప్రారంభ ధర 549 డాలర్లు, దుబాయ్‌లో AED 2,299 సూచిస్తున్నాయి.
లాంచ్ విండో విషయానికొస్తే.. ఆపిల్ “e” మోడళ్లకు ఫిబ్రవరి టైమ్‌లైన్‌కే కట్టుబడి ఉంటుంది. అదే అనుసరించి ఐఫోన్ 17e మోడల్ కూడా గత వెర్షన్ల మాదిరిగానే 2026 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.