Apple iPhone 18 Pro : ఆపిల్ ఐఫోన్ 18ప్రో, ఐఫోన్ 18ప్రో మ్యాక్స్ వచ్చేశాయ్.. అదిరిపోయే ఫ్యూచర్లు.. ధర ఎంతంటే?
Apple Launched iPhone 18 Pro and Pro Max : టెక్ దిగ్గజం ఆపిల్ తన తొలి ఫోల్డబుల్ (మడత పెట్టే) ఫోన్ ఐఫోన్ డ్యూయోతోపాటు ఐఫోన్ 18ప్రో, ఐఫోన్ 18ప్రో మ్యాక్స్ ఫోన్లను లాంచ్ చేసింది.
- Harish Thanniru
- Updated on- September 10, 2026 / 10:32 AM IST
iPhone 18 Pro
Apple Launched iPhone 18 Pro and Pro Max : టెక్ దిగ్గజం ఆపిల్ తన తొలి ఫోల్డబుల్ (మడత పెట్టే) ఫోన్ ఐఫోన్ డ్యూయోతోపాటు ఐఫోన్ 18ప్రో, ఐఫోన్ 18ప్రో మ్యాక్స్ ఫోన్లను లాంచ్ చేసింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో జరిగిన ‘సర్‌ప్రైజ్ అండ్ షైన్’ కార్యక్రమంలో సంస్థ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ నూతన ఉత్పత్తుల వివరాలను వెల్లడించారు. ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లు భారత్‌లో 256జీబీ, 512 జీబీ, 1టీబీ, 2టీబీ స్టోరేజీల్లో లభ్యమవుతాయి. డీప్ బ్లాక్, సిల్వర్, గ్లేసియర్ బ్లూ, సరికొత్త బర్గుండీ రంగుల్లో రానున్నాయి.
Also Read : Apple Foldable iPhone : ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే? బాబోయ్ ఇందులో ఇన్ని ప్రత్యేకతలా..
ఐఓఎస్ 27 ఆపరేటింగ్ సిస్టమ్, ఏ 20 ప్రో ప్రాసెసర్ తో కూడిన ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ మోడళ్లను మరింత మెరుగైన బ్యాటరీ, హార్డ్వేర్ పనితీరు, 48 మెగా పికెల్స్ కెమెరా సామర్ధ్యాలతోపాటు అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది. ఈనెల 12 నుంచి బుకింగ్ ప్రారంభంకానుండగా. 18వ తేదీ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ.1.64 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి.
ఐఫోన్ 18ప్రో ధరలు ఇలా..
256 జీబీ రూ. 1,64,90
512 జీబీ రూ. 1,89,900
1 టీబీ రూ. 2,39,900
2 టీబీ రూ. 3,14,900
ఐఫోన్ 18ప్రో మ్యాక్స్ ధరలు ఇలా..
256 జీబీ రూ. 1,79,900
512 జీబీ రూ. 2,04,900
1 టీవీ రూ. 2,54,900
1 టీబీ రూ. 3,29, 900
ఐఫోన్ 18 ప్రో ఫీచర్లు ఇవే..
ఐఫోన్ 18ప్రో 6.3 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. అత్యాధునిక ఏఐ ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌లో ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి ఏఐ టూల్స్ ఉన్నాయి. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. ఇది ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 36 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తుంది. వైర్డ్ ఛార్జింగ్ ద్వారా కేవలం 15 నిమిషాల్లో 50శాతం ఛార్జింగ్ పూర్తి కాగా, వైర్‌లెస్ ఛార్జింగ్ ద్వారా 30 నిమిషాల్లో 50శాతం ఛార్జ్ అవుతుంది. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఇవి iOS 27తో పనిచేస్తాయి. బీటా వర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన సిరి AI వినియోగదారుల పర్సనల్ కాంటెక్స్ట్‌ను అర్థం చేసుకుంటూ, స్క్రీన్‌పై ఉన్న సమాచారాన్ని గుర్తించి యాప్‌లలో వేగంగా పనులు పూర్తి చేస్తుంది. దీంతో పాటు స్పాటియల్ రీఫ్రేమింగ్, ఎక్స్‌టెండ్, అప్‌గ్రేడెడ్ క్లీన్ అప్, ఇమేజ్ ప్లేగ్రౌండ్ ద్వారా కావలసిన చిత్రాలను క్రియేట్ చేసుకునే సౌకర్యం లభిస్తుంది. 48 ఎమ్‌పీ ఫ్యుజన్ మెయిన్‌కెమేరాలో ఆస్ట్రోఫొటోగ్రఫీ, నైట్ మోడ్ మరింత మెరుగ్గా ఉంటాయి. 4కే రిసొల్యూషన్, డాల్బీ విజన్ హెచ్‌డీఆర్‌లో టైమ్ లాప్స్‌తోపాటు ప్రొ కంట్రోల్స్, యాపిల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లున్నాయి.
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఫీచర్లు ఇవే..
6.9 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. ట్రిపుల్ 48-మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48-మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 48-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. 18 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఉంది. కొత్త A20 ప్రో చిప్ ఉంది. ఆరు – కోర్ CPU, ఏడు-కోర్ GPUతోపాటు కొత్త C2 మోడెమ్ ఉంది. iOS 27, మెరుగైన వేపర్ ఛాంబర్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తోపాటు.. ఒక ఛార్జింగుతో 30 గంటల వినియోగం, 45 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ వంటివి ఉన్నాయి.
