iPhone Ultra Price Leak : ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ అదుర్స్.. భారత్‌లో ఐఫోన్ అల్ట్రా ధర రూ.2.5 లక్షలపైనే!
iPhone Ultra Price Leak : ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా ధరపై సంచలన లీక్.. అమెరికాలో 2,299 డాలర్ల నుంచి ఉంటుందని సమాచారం. భారత మార్కెట్లో 256GB మోడల్ రూ.2.82 లక్షలు, 1TB వేరియంట్ రూ.3.4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.
iPhone Ultra price leak
- అమెరికాలో 256GB ఐఫోన్ అల్ట్రా ధర 2,299గా ఉండొచ్చు
- 512GB, 1TB వేరియంట్ల ధరలు 2,499 నుంచి 2,799 డాలర్లు
- 30 శాతం భారత ప్రీమియం 256GB మోడల్ ధర రూ. 2.82 లక్షలు
- 1TB వేరియంట్ ధర రూ. 3.4 లక్షలు ఉండొచ్చు
- ఆపిల్‌కు ఫస్ట్ ఫోల్డబుల్ రూ. 2 లక్షలకు పైగా ఉండే ఛాన్స్
iPhone Ultra Price Leak : ఆపిల్ ఫ్యాన్స్ బిగ్ అలర్ట్.. ఫోల్డబుల్ ఐఫోన్ అతి త్వరలో ఎంట్రీ ఇవ్వనుంది. ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ రాబోతుందనే వార్తలు ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ ఫోన్‌ను ఐఫోన్ అల్ట్రా పేరుతో ఆపిల్ తీసుకురావచ్చని, ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటు సెప్టెంబర్ 9న లాంచ్ చేయొచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే, ఇప్పటివరకు ఆపిల్ మాత్రం ఫోన్ పేరు, డిజైన్, ధర వంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ :
లీకైన ధరల డేటా ప్రకారం.. అమెరికాలో 256GB ఐఫోన్ అల్ట్రా ధర 2,299 డాలర్లుగా ఉండొచ్చట. 512GB మోడల్ 2,499 డాలర్లు, 1TB వేరియంట్ 2,799 డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా. అదే భారత మార్కెట్లో టాక్సులు, దిగుమతి సుంకాలు, ఆపిల్ ధరల వ్యూహం కలిపి చూస్తే ధర మరింత పెరగనుంది.
Read Also : Apple Event 2026 : ఐఫోన్ 18 ప్రో ధరలు లీక్.. భారత్‌లో రూ.1.44 లక్షలా? దుబాయ్, అమెరికాలో ధర ఎంత ఉండొచ్చంటే?
సుమారుగా 30 శాతం భారత్ ప్రీమియం అనుకుంటే.. 256GB మోడల్ దాదాపు రూ.2.82 లక్షలు ఉండొచ్చు. 512GB సుమారు రూ.3.06 లక్షలు, 1TB వేరియంట్ ఏకంగా రూ.3.4 లక్షలు చేరొచ్చని అంచనా. అయితే, ఇవి అధికారిక భారత ధరలు మాత్రం కావు. లీకైన అమెరికా ధరల ఆధారంగా చేసిన అంచనాలు మాత్రమే..
శాంసంగ్‌కు ఆపిల్ నుంచి గట్టి పోటీ? :
ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ ఇప్పటికే భారీ ధరలతో దూసుకుపోతోంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా భారత మార్కెట్లో రూ.1,99,999 నుంచి ఉంటుందని సమాచారం. 1TB మోడల్ రూ.2,59,999 వరకు ఉంటుంది. అందుకే ఆపిల్ నిజంగానే ఐఫోన్ అల్ట్రాను తీసుకొస్తే, రూ.2 లక్షలకుపైగా ప్రీమియం సెగ్మెంట్లో కొత్త పోటీ ఉండే ఛాన్స్ ఉంది.
చివరగా ట్విస్ట్ ఏంటంటే? :
ఇంత భారీ ధర ఉన్నప్పటికీ ఆపిల్ బ్రాండ్ వాల్యూ, ఫోల్డబుల్ డిజైన్, కెమెరా టెక్నాలజీ కోసం ఫ్యాన్స్ ఎంతవరకు ఖర్చు చేస్తారన్నదే చూడాలి..
