Apple iPhone 18 Pro Max : కొత్త ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, ధర, డిజైన్, కెమెరా ఫీచర్లు లీక్.. ఇంకా ఏం ఉండొచ్చంటే?

Apple iPhone 18 Pro Max : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ వివరాలు లీక్ అయ్యాయి. లాంచ్ డేట్, ధర, కెమెరా ఫీచర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి..

Apple iPhone 18 Pro Max

Apple iPhone 18 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ రాబోతుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లాంచ్ తర్వాత మరో కొత్త ఐఫోన్ ఫ్లాగ్ షిప్ మోడల్ లాంచ్ కానుంది. ఆపిల్ 2026 ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఫీచర్లు, లాంచ్ తేదీ, ధర వివరాలు ముందుగానే లీక్ అయ్యాయి. డిజైన్ ట్వీక్‌ నుంచి పవర్‌ఫుల్ కొత్త హార్డ్‌వేర్ వరకు ముందస్తు లీక్‌లను పరిశీలిస్తే.. ఆపిల్ ఐఫోన్ లైనప్ కోసం మరో కొత్త సిరీస్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోందని సూచిస్తున్నాయి.

ఇందులో ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్, ఐఫోన్ ఎయిర్ 2, ఫస్ట్ ఐఫోన్ ఫోల్డ్ కూడా ఉండవచ్చు. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ (Apple iPhone 18 Pro Max) లాంచ్‌కు ఇంకా ఏడాది సమయం ఉంది. అంతకన్నా ముందుగానే ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఫీచర్లు, లాంచ్ తేదీకి సంబంధించి అనేక వివరాలు రివీల్ అయ్యాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..

ఐఫోన్ 18 ప్రో మాక్స్ డిజైన్ (అంచనా) :

వీబో లీక్‌ల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మోడళ్లు దీర్ఘచతురస్రాకార కెమెరా హౌసింగ్‌తో రానున్నాయి. కెమెరా ప్లేస్‌మెంట్ ఐఫోన్ 17 ప్రో సిరీస్ మాదిరిగానే ఉంటుందని అంచనా. కానీ, బ్యాక్ ప్యానెల్ మైక్రో ట్రాన్స్ పరెంట్ ఎండ్ కలిగి ఉండవచ్చు.

Read Also : Amazon Sale Offers : గెట్ రెడీ.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

ఫైనల్ డిజైన్ ఇంకా రెడీ కాలేదు. హీట్ మేనేజ్ కోసం డివైజ్ స్టెయిన్‌లెస్ స్టీల్ స్టీమ్ రూం కలిగి ఉంటుందని అంచనా. డిస్‌ప్లేల విషయానికొస్తే.. సైజులు అలాగే ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 18 ప్రో కోసం 6.3 అంగుళాలు, ప్రో మాక్స్ కోసం 6.9 అంగుళాలు ఉంటాయి.

ఐఫోన్ 18 ప్రో మాక్స్ కెమెరా అప్‌గ్రేడ్స్ :
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ 48MP మెయిన్ సెన్సార్‌కు వేరియబుల్ ఎపర్చర్ టెక్నాలజీని తీసుకువస్తున్నట్లు సమాచారం. శాంసంగ్ గెలాక్సీ అల్ట్రా వంటి కొన్ని హై-ఎండ్ ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో కనిపిస్తుంది. వినియోగదారులు లెన్స్‌ అడ్జెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఫొటోగ్రాఫర్‌లు, వీడియోగ్రాఫర్‌లకు ఫీల్డ్ డెప్త్, లో-లైటింగ్ షాట్‌లపై మరింత కంట్రోల్ అందిస్తుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ కెమెరాలతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ :
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ A20 ప్రో చిప్‌పై రన్ అవుతుంది. అడ్వాన్స్ 2nm ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. స్పీడ్, మెరుగైన సామర్థ్యం, ఆన్-డివైస్ ఏఐ ఫీచర్లకు సపోర్టు అందిస్తుంది. అదే నిజమైతే.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ ఇటీవలి ఏళ్లలో ఆపిల్ అందించిన అతిపెద్ద అప్‌గ్రేడ్‌లలో ఒకటి కావచ్చు.

భారత్‌లో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ లాంచ్, ధర అంచనా :
ఆపిల్ కంపెనీ ఎప్పటిలాగే సెప్టెంబర్ లాంచ్ సంప్రదాయాన్ని కొనసాగించనుంది. ఐఫోన్ 18 సిరీస్ 2026 సెప్టెంబర్ రెండో వారంలో లాంచ్ కానుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర భారత మార్కెట్లో రూ. 1,59,900గా ఉంది. ప్రస్తుత నివేదికల ప్రకారం.. ఆపిల్ వచ్చే ఏడాది మళ్లీ ధరను పెంచదు. ఐఫోన్ 18 ప్రో మాక్స్ దాదాపు అదే ధర వద్ద లాంచ్ అయ్యే అవకాశం ఉంది.