Apple iPhone Duo : ఐఫోన్ డ్యూయో కోసం రూ.5 లక్షలా? అదే డబ్బుతో ఏం కొనొచ్చు? కారు, బంగారం.. ఫారిన్ ట్రిప్ కూడా!
Apple iPhone Duo : రూ.5 లక్షల వరకు ధర పలికే ఐఫోన్ డ్యూయో కొనే బదులుగా అదే మొత్తంతో కారు, బైక్, బంగారం, విదేశీ ట్రిప్‌తో పాటు ఇంకా ఏం చేయవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- September 11, 2026 / 03:33 PM IST
Apple iPhone Duo
- ఐఫోన్ డ్యూయో కోసం రూ.5 లక్షలు ఖర్చా? ఈ లిస్ట్ చూస్తే షాక్ అవుతారు
- ఫోన్ కొనాలా.. ఫ్యూచర్ ఇన్వెస్ట్ చేయాలా? రూ.5 లక్షలతో ఇవన్నీ చేయొచ్చు
- ఐఫోన్ డ్యూయో ధరతో ఇంకా ఏం కొనొచ్చు? లెక్క చూస్తే మీరే ఆశ్చర్యపోతారు
Apple iPhone Duo : ఐఫోన్ క్రేజే వేరు.. సామాన్యుల నుంచి బిలియనర్ల వరకు అందరూ ఇష్టపడే ఫోన్ ఇదే.. డబ్బులున్నోళ్లే ఈ ఐఫోన్ కొనగలరు.. సామాన్యులకు కలనే.. అంటుంటారు.. అయితే, ఐఫోన్ ధర ఎంతంటుంది.. మహా అయితే రూ. లక్షో లక్షన్నర ఉంటుంది.. కానీ, ఏకంగా రూ. 5 లక్షలంటే ఎవరైనా కొంటారా? చాలామంది ఇదే ఆలోచిస్తారు..
ఐఫోన్ కోసం రూ.5 లక్షలు పోసి కొనాలా? నిజంగా అంత ఖర్చు అవసరమా? అంటే.. టెక్నాలజీ అంటే ఇష్టపడేవారికి కొత్తగా వచ్చిన ఫోల్డబుల్ ఐఫోన్ డ్యూయో ఆకర్షణీయంగానే కనిపించొచ్చు. కానీ, దాని టాప్ వేరియంట్ కోసం దాదాపు రూ.4.5 లక్షలు ఖర్చు చేయాలంటే ఒక్కసారి ఆలోచించాల్సిందే.
ఎందుకంటే అదే డబ్బుతో మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో వస్తువులను కొనొచ్చు. ఆ ఖర్చుతోనే దేశ విదేశాలను చుట్టేసి రావొచ్చు.. ఐఫోన్ కోసం పెట్టే ఈ డబ్బులను ఇంకా ఏమేమి చేయొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ మార్కెట్లోకి దించింది. సర్ప్రైజ్ అండ్ షైన్ ఈవెంట్‌లో ఐఫోన్ డ్యూయోను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో ఈ ఫోల్డబుల్ ధర చాలా ఖరీదు.. తెలియని వారి కోసం ఈ ఐఫోన్ బేస్ వేరియంట్ భారత మార్కెట్లో రూ. 2,99,900 ధరకు లభిస్తుంది. 2TB స్టోరేజ్‌తో హై-ఎండ్ వేరియంట్ రూ. 4,49,900 ధరకు లభిస్తుంది.
ఐఫోన్ ధరకు ఏకంగా కారు :
దాదాపు రూ.4.77 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో టాటా టియాగో వంటి కారు కొనేసుకోవచ్చు.. అంటే చేతిలో పెట్టుకునే ఫోన్ ధరతో ఏకంగా ఇంటికి ఓ కారు తెచ్చుకోవచ్చు అనమాట.
బైక్‌తో పాటు మ్యాక్‌బుక్ కూడా :
మీరు బైక్ ప్రియులైతే పెర్ఫార్మెన్స్ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ 450 బైక్‌ను ఎంచుకోవచ్చు. అదే డబ్బుతో భారత మార్కెట్లో రూ. 2,99,000కు లభించే KTM 390 డ్యూక్ వంటి బైక్‌ను కొనొచ్చు.. ఇంకా మీకు రూ. 2,00,000 మిగులుతాయి..
Read Also : Apple Foldable Phone : వార్నీ.. రూ.3 లక్షలు పెట్టి ఐఫోన్ కొంటారా? ఫోల్డబుల్‌తో ఆపిల్ అసలు గేమ్ ఇదే!
దాంతో మీరు మీ బైక్‌ను హై ఎండ్ మోడిఫై చేయించుకోవచ్చు. అది కాకుండా భారత మార్కెట్లో రూ. 3,08,000కు లభించే రాయల్ ఎన్‌ఫీల్డ్ 450ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఒక టాప్-టైర్ మ్యాక్‌బుక్‌ను కూడా కొనొచ్చు.. అప్పటికీ మీ దగ్గర ఇంకా డబ్బు మిగులుతుంది.
బంగారంలో పెట్టుబడి :
రూ.4.5 నుంచి రూ. 5 లక్షల బడ్జెట్‌తో సుమారు 35 గ్రాముల 22 క్యారెట్ల బంగారం కొనేసుకోవచ్చు. ఈ ఐఫోన్ వాల్యూ కాలక్రమంలో తగ్గుతుంది. కానీ, బంగారం మాత్రం పెట్టుబడి కోణంలో ఇంకా పెరుగుతూనే ఉంటుంది.
ఇద్దరూ కలిసి విదేశీ టూర్ :
అదే డబ్బుతో ఇద్దరు కలిసి దుబాయ్, థాయ్‌లాండ్ వంటి దేశాలకు సరదగా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. విమాన టికెట్లు, హోటల్, ఫుడ్, షాపింగ్ కలిపి బడ్జెట్‌ను తెలివిగా ప్లాన్ చేస్తే మంచి వెకేషన్ కు వెళ్లిరావొచ్చు..
ఇంకా ఏం చేయొచ్చు? :
మీ ఇంటి కోసం ఫర్నిచర్ కొనడం, హోమ్ థియేటర్ ఏర్పాటు చేయడం, ప్రొఫెషనల్ కెమెరా-లెన్స్ కిట్ తీసుకోవడం, ఉన్న అప్పులో కొంత తీర్చడం, ఎమర్జెన్సీ ఫండ్ కోసం కూడా కొంత దాచుకోవచ్చు.
మొత్తానికి.. రూ.5 లక్షల ఐఫోన్ మీకు టెక్నాలజీ మరింతగా దగ్గర చేస్తుంది అంతే.. కానీ, అదే డబ్బుతో కారు, బంగారం, ప్రయాణం లేదా పెట్టుబడిగా మారితే మీ జీవితానికి మరింత విలువను అందిస్తుంది. ఇందులో మీరు ఎంచుకునే ఆప్షన్ మీ అవసరం, ఆసక్తి, బడ్జెట్‌పైనే ఉంటుంది.
