Apple Foldable iPhone : ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే? బాబోయ్ ఇందులో ఇన్ని ప్రత్యేకతలా..
Apple Launches First Foldable iPhone : టెక్ దిగ్గజం ఆపిల్ ఎట్టకేలకు తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
- Harish Thanniru
- Updated on- September 10, 2026 / 08:52 AM IST
Apple Foldable iPhone
Apple Launches First Foldable iPhone : టెక్ దిగ్గజం ఆపిల్ ఎట్టకేలకు తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అమెరికాలోని కుపర్టినోలో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో ఐఫోన్ డ్యూయోతోపాటు ఐఫోన్ 18ప్రో, ఐఫోన్ 18 ప్రోమ్యాక్స్, కొత్త యాపిల్ వాచ్ సిరీస్ 12, యాపిల్ వాచ్ ఆల్ట్రా 4, ఎయిర్‌పాడ్స్ 5లను కంపెనీ ఆవిష్కరించింది. ఆపిల్ సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ప్రధాన ఐఫోన్ లాంచ్ ఈవెంట్ కావడం విశేషం.
ఆపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ (మడతపెట్టగల) స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఐఫోన్ డ్యూయో (iPhone Duo) పేరుతో వచ్చిన ఈ ఫోన్ 7.6 అంగుళాల డిస్‌ప్లే, 5.4 అంగుళాల ఔట్‌సైడ్ స్క్రీన్, కొత్తగా డిజైన్ చేసిన ఐవోఎస్ 27 తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర 1,999 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది.
టైటానియం బాడీతో రూపొందించిన ఈ ఫోన్‌లో రెండు యాప్‌లను పక్కపక్కనే ఉపయోగించుకునేలా ఐఓఎస్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఫోల్డబుల్ డిజైన్ కారణంగా ఫేస్ ఐడీకి బదులుగా పవర్ బటన్‌లోనే టచ్ ఐడీను అందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఫోన్ మడతపెట్టి ఉన్నా లేదా పూర్తిగా తెరిచి ఉన్నా సెకన్ల వ్యవధిలో అన్‌లాక్ చేయడానికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఈ ఫోన్, ఎటువంటి ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ లేకుండా పూర్తిగా eSIMకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ప్రీ–ఆర్డర్లు అక్టోబర్ 18 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 23 నుంచి అందుబాటులో ఉంటుంది.
this iphone duo unfolding animation is perfect pic.twitter.com/WXoxK1gevz
— Kevin Grajeda (@k_grajeda) September 9, 2026
భారతదేశంలో ఐఫోన్ డ్యూయో ధర
భారతదేశంలో ఐఫోన్ డ్యూయో బేస్ మోడల్ ధర రూ. 299,900గా ఉంది . ఇది 256GB, 512GB, 1TB మరియు 2TB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. స్టార్ వైట్, నైట్ స్కై అనే రెండు రంగులలో అందుబాటులో ఉంటుంది. 256GB ధర రూ. 2,99,900 అదేవిధంగా 512 జీబీ ధర రూ. 3,24,900, అదేవిధంగా 1TB ధర రూ. 3,74,900.. ఇక 2TB ధర రూ. 4,49,900 గా ఉంటుంది. ఐఫోన్ డ్యూయో కోసం ప్రీ-ఆర్డర్లు భారతదేశంలో అక్టోబర్ 16న సాయంత్రం 5:30 గంటలకు (IST) ప్రారంభమవుతాయి. ఈ ఫోల్డబుల్ అక్టోబర్ 23 నుండి అమ్మకానికి వస్తుంది.
This is how you do a foldable, Samsung 👇 pic.twitter.com/XJZawPWymi
— Apple Hub (@theapplehub) September 9, 2026
