×
Ad

Apple October Event 2025 : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. అక్టోబర్ ఈవెంట్ 2025 డేట్ తెలిసిందోచ్.. రాబోయే ఆపిల్ డివైజ్‌ల ఫుల్ లిస్ట్ మీకోసం..!

Apple October Event 2025 : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ అక్టోబర్ ఈవెంట్ 2025లో సరికొత్త ప్రొడక్టులను ప్రకటించే అవకాశం ఉంది. ఏయే డివైజ్‌లు ఉండనున్నాయంటే?

Apple October Event 2025

Apple October Event 2025 : ఆపిల్ లవర్స్ కోసం మరో కొత్త ఈవెంట్ రాబోతుంది. సెప్టెంబర్ 2025 అవే డ్రాపింగ్ ఈవెంట్ సందర్భంగా ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయింది. ఇప్పుడు అందరి దృష్టి కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం అక్టోబర్ ఈవెంట్‌పైనే పడింది. అందిన సమాచారం ప్రకారం.. ఈ నెల చివరిలో ఆపిల్ అక్టోబర్ ఈవెంట్ జరగనుంది.

ఈ ఆపిల్ ఈవెంట్ ఐప్యాడ్ లైనప్, స్మార్ట్ హోమ్ (Apple October Event 2025) ఎకోసిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. కొన్ని వారాలుగా అనేక లీక్‌లు, నివేదికలను పరిశీలిస్తే.. ఆపిల్ M5 పవర్డ్ ఐప్యాడ్ ప్రో, సెకండ్ జనరేషన్ ఎయిర్‌ట్యాగ్‌లు, అప్‌గ్రేడ్ విజన్ ప్రో హెడ్‌సెట్‌తో సహా కొత్త లాంచ్ డేట్ వివరాలను సూచించాయి. లాంచ్ తేదీ, డివైజ్ లైనప్, లభ్యత వివరాలతో సహా ఆపిల్ అక్టోబర్ ఈవెంట్ 2025 నుంచ ఏయే ప్రొడక్టులు లాంచ్ కానున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐప్యాడ్ ప్రో, విజన్ ప్రో, ఎయిర్‌ట్యాగ్ 2 ప్రొడక్టులు మరెన్నో :

మ్యాక్ రూమర్స్ ప్రకారం.. ఈ నెలలో ఆపిల్ అనేక కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో ఐప్యాడ్ ప్రో కూడా చాలా స్పెషల్. ఈ టాబ్లెట్ స్పీడ్ పర్ఫార్మెన్స్ కోసం ఆపిల్ కొత్త M5 చిప్‌ను కలిగి ఉంటుంది. అలాగే రెండు ఫ్రంట్ కెమెరాలతో వస్తుందని భావిస్తున్నారు.

Read Also : Vivo V50 5G : వివో లవర్స్ డోంట్ మిస్.. ఈ వివో V50 5G అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

ఈ ఆపిల్ డివైజ్ పోర్ట్రెయిట్ లేదా ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో పట్టుకున్నా అద్భుతమైన వీడియో కాల్స్ చేసుకోవచ్చు. M4 లేదా M5 చిప్ రీడిజైన్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. రీడిజైన్ హెడ్ స్ట్రాప్, స్పేస్ బ్లాక్ ఫినిషింగ్, విజన్ ప్రో హెడ్‌సెట్ కూడా అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది.

ఆపిల్ టీవీ తర్వాతి స్థానంలో నిలిచింది. పవర్‌ఫుల్ A17 ప్రో చిప్‌ కూడా ఉంటుంది. ఆపిల్ N1 చిప్‌ కలిగి ఉంది. Wi-Fi 7కి సపోర్టు అందిస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో వచ్చే ఏడాది మెయిన్ సిరి రీడిజైన్ కూడా అందించనుంది. ఫ్యూచర్ ఆపిల్ టీవీ కోసం ఇంటర్నల్ ఫేస్‌టైమ్ కెమెరా పుకార్లు ఉన్నప్పటికీ, ఈ ఏడాదిలో వస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు.

హోమ్‌పాడ్ మినీ కూడా స్మార్ట్‌గా చాలా స్పీడ్ ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో S9 చిప్ డివైజ్ ఫాస్ట్ యాక్సస్ అందిస్తుంది. Wi-Fi 7 సపోర్టు, మెరుగైన సౌండ్ క్వాలిటీ, సెకండ్ జనరేషన్ అల్ట్రా వైడ్‌బ్యాండ్ చిప్, రెడ్ వంటి లేటెస్ట్ కలర్ ఆప్షన్లతో వస్తుంది. ఎయిర్‌ట్యాగ్ 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ట్రాకింగ్ రేంజ్, మెరుగైన ట్యాంపర్ ప్రొటెక్షన్, కొత్త లోయర్-బ్యాటరీ అలర్ట్స్ అందించగలదు.

ఆపిల్ అక్టోబర్ ఈవెంట్ 2025 తేదీ (అంచనా) :
గతంలో ఆపిల్ సాధారణంగా అక్టోబర్ ఈవెంట్‌లను నెల మధ్యలోనే నిర్వహించేది. అయితే, ఇటీవలి ఏళ్లలో టెక్ దిగ్గజం ప్రొడక్టు ప్రకటనల కోసం అక్టోబర్ చివరి నాటికి మార్చేసింది. ఈసారి కూడా ఇదే పద్ధతి కొనసాగితే 2025 అక్టోబర్ ఈవెంట్ అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 30 మధ్య జరిగే అవకాశం ఉంది. కొత్త ప్రొడక్టుల కోసం ముందస్తు ఆర్డర్‌లు వచ్చే వారం లేదా నవంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.