Apple September 9 Event : ఫ్యాన్స్ గెట్ రెడీ.. మెగా ఆపిల్ ఈవెంట్‌కు కౌంట్‌డౌన్.. లాంచ్ లిస్ట్‌లో ఈ 4 డివైజ్‌లు లేనట్టే!

Apple September 9 Event : సెప్టెంబర్ 9న జరగబోయే సర్ప్రైజ్ అండ్ షైన్ ఈవెంట్‌‌లో కొన్ని ఆపిల్ ప్రొడక్టులు లాంచ్ అయ్యే అవకాశం లేదు. ఇంతకీ ఆ 4 ప్రొడక్టులేంటో ఓసారి చూద్దాం..

Apple September 9 Event

  • సెప్టెంబర్ 9న ఆపిల్ సర్ప్రైజ్ అండ్ షైన్ ఈవెంట్‌
  • ఐఫోన్ 18, ఐఫోన్ ఎయిర్ 2 2027 సమ్మర్‌లో రావచ్చు.
  • కొత్త మ్యాక్‌లు, ఆపిల్ వాచ్ SE 4 కూడా ఉండకపోవచ్చు

Apple September 9 Event : ఆపిల్ లవర్స్‌కు పండగలాంటి వార్త.. సెప్టెంబర్ 9 ఈవెంట్ ఈరోజే.. మరికొద్దిగంటల్లో ఆపిల్ ఐఫోన్ సహా కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించనుంది. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఐఫోన్ అల్ట్రా, ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ గురించే టాక్ వినిపిస్తోంది.

క్యుపెర్టినోకు చెందిన ఈ టెక్ దిగ్గజం ‘సర్ప్రైజ్ అండ్ షైన్’ ఈవెంట్‌లో ఎయిర్‌పాడ్స్ 5, ఆపిల్ వాచ్ అల్ట్రా 5 వాచ్ సిరీస్ 12లను కూడా లాంచ్ చేయనున్నట్టు సమాచారం. అయితే, ఈ ఈవెంట్ మామూలు కన్నా చాలా డిఫరెంట్ ఉంటుందని రిపోర్టులు సూచిస్తున్నాయి. కొన్ని ఆపిల్ ప్రీమియం ప్రొడక్టులు ఉన్నప్పటికీ మరికొన్ని ఇప్పుడు లాంచ్ అయ్యే అవకాశం లేదంటున్నారు.. ఇంతకీ ఆవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

1. ఆపిల్ ఐఫోన్ 18
ఈ ఏడాది స్టాండర్డ్ ఆపిల్ ఐఫోన్ 18 లాంచ్ ఉండకపోవచ్చు. రిపోర్టుల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ లాంచ్ వ్యూహాన్ని మారుస్తోంది. దీని ప్రకారం.. రెగ్యులర్ మోడల్ సెప్టెంబరులో ప్రో వేరియంట్లతో పాటు కాకుండా 2027 ఏడాది సమ్మర్‌లో రానుంది.

ఐఫోన్ 18లో 2nm తయారీ ప్రాసెస్ ఆధారంగా పనిచేసే ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ A20 చిప్‌ను అమర్చనున్నట్లు సమాచారం. అలాగే, హై రిజల్యూషన్ 24MP ఫ్రంట్ కెమెరా చిన్న డైనమిక్ ఐలాండ్ కూడా ఉంటాయని నివేదికలు సూచించాయి.

2. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 2 :

సెప్టెంబర్ ఈవెంట్‌లో సెకండ్ జనరేషన్ ఐఫోన్ ఎయిర్ కూడా వచ్చే అవకాశం లేదు. ఆపిల్ గత ఏడాదిలో ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు ఫస్ట్ ఐఫోన్ ఎయిర్‌ లాంచ్ చేసింది. కానీ, ఆ తర్వాతి మోడల్ ఐఫోన్ 18తో పాటు 2027 మొదటి త్రైమాసికానికి వాయిదా పడిందని నివేదికలు సూచిస్తున్నాయి.

Read Also : New EPF Advance Rules : EPF అడ్వాన్స్ రూల్స్ మారాయి.. ఇక PF డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చంటే?

కొత్త మోడల్‌లో సెకండ్ బ్యాక్ కెమెరా మెరుగైన బ్యాటరీ లైఫ్ ఉండొచ్చు. A20 ప్రో చిప్‌తో కూడా వస్తుందని భావిస్తున్నారు. అయినప్పటికీ, ఆపిల్ ఈ వివరాలలో ఏది ఇంకా వెల్లడించలేదు.

3. ఆపిల్ వాచ్ SE 4 :
ఆపిల్ వాచ్ సిరీస్ 12 లేదా వాచ్ అల్ట్రా 4 చూసే ఛాన్స్ ఉన్నప్పటికీ ఈ ఏడాది ఆపిల్ సరసమైన వాచ్ ఎస్ఈ లైనప్‌ను లాంచ్ చేయకపోవచ్చు. ప్రస్తుత ఆపిల్ వాచ్ ఎస్ఈ 3 సెప్టెంబర్ 2025లో వచ్చింది. 2026 నాటికి నాల్గో జనరేషన్ మోడల్ వస్తుందనడానికి ఎలాంటి సూచనలు లేవని రిపోర్టులు చెబుతున్నాయి.

4. కొత్త మాక్స్ :
కొత్త మ్యాక్ హార్డ్‌వేర్ అనేది సెప్టెంబర్ కీనోట్‌లో చోటు దక్కించుకోలేదు. ఆపిల్ సంస్థ ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు సన్నని ఛాసిస్‌తో ఫ్యూచర్ హై-ఎండ్ రీడిజైన్‌తో సహా అప్‌డేట్ మోడళ్లపై వర్క్ చేస్తున్నట్టు సమాచారం.

కొత్త జనరేషన్ చిప్‌తో అప్‌డేట్ చేసిన 24-అంగుళాల ఐమ్యాక్ కూడా డెవలప్ స్టేజీలో ఉందని సమాచారం. అయితే, ఆపిల్ సాంప్రదాయకంగా మ్యాక్‌ల రిలీజ్ కోసం స్పెషల్ టైమ్ కేటాయిస్తుంది. ఈ ఏడాది చివరిలో ఉండొచ్చు. ఇప్పటికే ఆగస్టులోనే కొత్త మ్యాక్ మోడళ్లను ప్రకటించింది. సెప్టెంబర్ 9న మరో ప్రధాన మ్యాక్‌ను ఆవిష్కరించే ఛాన్స్ లేనట్టే..