iPhone 16 Prices
iPhone 16 Prices : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయింది. ఐఫోన్ 17 సిరీస్ వచ్చిన వెంటనే భారత మార్కెట్లో ఐఫోన్ 16 సిరీస్ ధరలను భారీగా తగ్గించింది. ఐఫోన్ 16 బేస్ మోడల్ ఇప్పుడు అమెజాన్ లో రూ.69,999, ఫ్లిప్ కార్ట్ లో రూ.74,900 నుంచి అందుబాటులో ఉంది.
ఫ్లిప్ కార్ట్ లో కూడా ఐఫోన్ 16 ప్రో రూ.1.12 లక్షలకు అందుబాటులో ఉంది. అయితే, రాబోయే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (iPhone 16 Prices) సమయంలో ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ.1 లక్ష కన్నా తక్కువ ధరకే లభిస్తుంది.
బ్యాంకు ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు :
ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ ప్లేయర్‌లలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్, ఇతర ఆన్ లైన్ మార్కెట్లలో కూడా ఐఫోన్ 16 కొనుగోలుకు అందుబాటులో ఉంది. అమెజాన్ ఇండియా స్టోర్‌లో, ఐఫోన్ 16 మోడల్ 128GB వేరియంట్ ధర రూ. 79,900 నుంచి ప్రస్తుతం రూ. 69,999కి తగ్గింది.
ఈ ఐఫోన్ కొనుగోలుపై ఫ్లాట్ రూ. 10వేలు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డీల్స్‌తో పాటు ధర ఇంకా తగ్గవచ్చు. ఇదే మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.74,900 కు లభిస్తుంది. అదనపు బ్యాంక్ క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో కొనుగోలు చేయొచ్చు.
Read Also : Apple Event 2025: అదిరిపోయే ఫీచర్స్ తో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్.. ధర ఎంతంటే..
ప్రీమియం యూజర్లకు భారీ తగ్గింపులు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో (128GB) రూ.1,12,900కి లభిస్తుంది. రూ.1,19,900 నుంచి రూ.7వేలు తగ్గింపు పొందింది. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ ద్వారా అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ :
రాబోయే సేల్ లో ఈ ఐఫోన్ ధర రూ. లక్ష లోపు ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర లక్ష కన్నా తక్కువగా ఉండవచ్చని ఫ్లిప్‌కార్ట్ టీజర్ సూచిస్తున్నాయి. అదే నిజమైతే.. ఈ ఐఫోన్ మోడల్ అతి తక్కువ ధర రావడం ఇదే మొదటిసారి అవుతుంది.
ఎక్కడ కొంటే బెటర్? :
మీ బడ్జెట్ ధరలో ఐఫోన్ 16 కొనుగోలు చేయాలంటే అమెజాన్ తగ్గింపు ధరకే అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ డీల్స్ ద్వారా బెస్ట్ ఆఫర్ పొందవచ్చు. మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అద్భుతమైన డీల్స్ పొందవచ్చు.