Apple Vision Pro is set to release on February 2, repair cost is around Rs 2 lakh
Apple Vision Pro Sale : ఆపిల్ విజన్ ప్రో ఫిబ్రవరి 2న విక్రయానికి రెడీగా ఉంది. ఈ డివైజ్ రిలీజ్‌కు ముందు కొత్త మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్ రిపేరింగ్ ధరను కంపెనీ వెల్లడించింది. ఆపిల్ విజన్ ప్రో అమెరికాలో మార్కెట్‌లో 3,499 డాలర్ల ధరగా ఉంది. అదే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 2.91 లక్షలు ఉంటుంది. ఈ హెడ్‌సెట్ భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో ఆపిల్ ఇంకా ధృవీకరించలేదు.
ప్రపంచ టెక్ దిగ్గజం అధికారిక వెబ్‌సైట్‌లో షేర్ అయిన వివరాల ప్రకారం.. (Apple Vision Pro) కొనుగోలుదారులు హెడ్‌సెట్‌ను ఎట్టిపరిస్థితుల్లో కింద పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే.. వినియోగదారులు ఆపిల్‌కేర్‌ప్లస్ (AppleCare+) అందించే ప్రొటెక్షన్ కవరేజీ లేకపోతే మాత్రం.. రిపేరింగ్ ఖర్చులు భారీగా ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రత్యేకించి.. విజన్ ప్రో గ్లాస్‌కు పగుళ్లు వంటి ఏర్పడితే రిపేరింగ్ కోసం 799 డాలర్లు ఖర్చు అవుతాయని అంచనా.
Apple Vision Pro release on February 2
హెడ్‌సెట్ రిపేరింగ్ ఖర్చు రూ. 2 లక్షలు :
అంతేకాకుండా, హెడ్‌సెట్‌లోని ఇతర పార్టులకు ఏవైనా నష్టం జరిగితే మరింత ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. వీటిని రిపేర్ చేయడానికి 2,399 డాలర్లు (సుమారు రూ. 2 లక్షలు) ఖర్చు అవుతుంది. ఇప్పుడు, ఆపిల్‌కేర్‌ప్లస్ పాలసీని పరిశీలిస్తే.. కవరేజ్ ప్లాన్ కోసం రెండు సంవత్సరాలకు 499 డాలర్లు లేదా నెలవారీ 24.99 డాలర్లు చెల్లించాలి. రిపేరింగ్ అనేది పూర్తిగా ఉచితం కాదని గమనించాలి. దీనికి ఇంకా 299 డాలర్లు ఖర్చవుతుందని ఆపిల్ పేర్కొంది. ఆపిల్ కేర్ ప్లస్ ద్వారా గ్లాసు సమస్యలను పరిష్కరించడానికి మొత్తం 798 డాలర్లు ఛార్జ్ చేస్తుంది. అదే ప్లాన్ లేకుంటే కేవలం 1 డాలర్ మాత్రమే తక్కువగా ఉంటుంది.
విజన్ ప్రో గ్లాస్ మినహా ఏదైనా రిపేర్ ఖర్చు తక్కువే :
మీరు విజన్ ప్రోలో గ్లాస్ కాకుండా ఏదైనా పాడు చేస్తే.. (AppleCare+) సెంటర్ రిపేర్ సమయంలో తక్కువగా ఛార్జ్ చేస్తుంది. తద్వారా మీకు చాలా ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది. మీరు ఆపిల్ కేర్ ప్లస్ కోసం వెళ్లినా వెళ్లకపోయినా ఇది వాస్తవం. మీ విజన్ ప్రోని కిందపడకుండా మరింత జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ డివైజ్ ఒకసారి రిపేర్ వచ్చిందంటే.. ఫిక్సింగ్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది.
Apple Vision Pro repair cost
త్వరలో భారత్ మార్కెట్లో లాంచ్ :
భారత మార్కెట్లో ఆపిల్ విజన్ ప్రో హెడ్‌సెట్ అధికారిక లాంచ్ తేదీని ఆపిల్ ఇంకా వెల్లడించలేదు. అమెరికాలో అరంగేట్రం చేసిన తర్వాత ఆపిల్ యుకె, కెనడా, చైనాలో లాంచ్ చేసేందుకు పరిశీలిస్తున్నట్లు నివేదిక తెలిపింది. భారత మార్కెట్లో లాంచ్ తేదీ ప్రస్తుతం తెలియనప్పటికీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఆపిల్ ప్రయోగాత్మక ప్రొడక్టుగా పేరొందిన విజన్ ప్రో విస్తృత స్థాయిలో రిలీజ్ చేయడానికి నిర్దిష్ట ప్రాంతాల్లో పరీక్షిస్తోంది.