Foldable iPhone : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ వస్తోందోచ్.. మీరు ఊహించిన ధర కన్నా తక్కువే..!

Foldable iPhone : ఆపిల్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ రాబోతుంది.. ఈ మడతబెట్టే ఐఫోన్ ధర వివరాలు లీక్ అయ్యాయి.. ఎంతంటే?

Foldable iPhone

Foldable iPhone : ఆపిల్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. త్వరలో ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ రాబోతుంది. ప్రస్తుతం ఐఫోన్ మడతబెట్టే ఫోన్‌పై వర్క్ చేస్తున్నట్టు సమాచారం. రాబోయే ఫోల్డబుల్ ఐఫోన్ ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు, డిజైన్‌తో వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఈ ఫోల్డబుల్ ఐఫోన్ ధర కూడా భారీగా ఉండే అవకాశం ఉంది.

MacRumors లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. ఈ మడతబెట్టే ఐఫోన్ అమెరికా మార్కెట్లో 1,800 డాలర్ల నుంచి 2వేల డాలర్ల మధ్య ధర ఉండొచ్చు. ఈ ధర ట్యాగ్‌తో అత్యంత ఖరీదైన ఐఫోన్‌గా నిలువనుంది. ఇతర పోటీదారుల ఫోల్డబుల్‌ ఫోన్లతో పోలిస్తే.. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ Z Fold 7తో 1,999.99 డాలర్లకు దగ్గరగా ఉంటుంది.

మడతబెట్టే ఐఫోన్ ధర (అంచనా) :
భారత మార్కెట్లో కొత్త ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ ధర సుమారుగా రూ.1,54,900 నుంచి రూ.1,72,000 వరకు ఉండొచ్చు. కానీ, దిగుమతి సుంకాలు, పన్నుల తర్వాత ఫైనల్ ధర పెరగవచ్చు. దాదాపు రూ.1,90,000 నుంచి రూ.2లక్షల వరకు ఉండవచ్చు. అయితే, కేవలం ముందస్తు లీక్‌లు మాత్రమే. కచ్చితమైన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read Also : SIP Returns : SIPలో నెలకు రూ. 6వేలు పెట్టబడి పెడితే.. రిటైర్ అయ్యాక నెలకు రూ. లక్ష చేతికి వస్తుంది.. ఎలాగంటే?

ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర దాదాపు రూ.1.5 లక్షలు కావచ్చు. ఆపిల్ సన్నని, క్లీన్ డిజైన్‌తో రానున్నట్టు కనిపిస్తోంది. నివేదికల ప్రకారం.. ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ ఓపెన్ చేస్తే 4.8mm వెడల్పు ఉంటుంది. అదనంగా, ఈ ఐఫోన్ ప్రీమియం డిజైన్, క్రీజ్‌లెస్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా.

అయితే, గతంలో ఆపిల్ 4.5mm మందంతో సన్నని ఫోల్డబుల్‌ రాబోతుందని ఓ నివేదిక వెల్లడించింది. ఇటీవలే ప్రవేశపెట్టిన శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 కేవలం 4.2mm స్లిమ్ మాత్రమే కలిగి ఉంది. ఫోల్డబుల్ ఐఫోన్ 7.8-అంగుళాల లోపలి డిస్‌ప్లే, 5.5-అంగుళాల ఎక్స్‌ట్రనల్ స్క్రీన్‌ కలిగి ఉంటుందని నివేదికలు పేర్కొన్నారయి.

కెమెరా విషయానికి వస్తే.. ఈ మడతబెట్టే ఐఫోన్ సింగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ ఐఫోన్ 2026లో జూన్ తర్వాత లాంచ్ అవుతుందని అంచనా. ప్రస్తుతానికి ఆపిల్ దీనిపై ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు.