SIP Returns : SIPలో నెలకు రూ. 6వేలు పెట్టబడి పెడితే.. రిటైర్ అయ్యాక నెలకు రూ. లక్ష చేతికి వస్తుంది.. ఎలాగంటే?
SIP Calucaltor : రిటైర్మెంట్ కోసం ముందుగానే SIPలో పెట్టుబడి పెట్టండి.. నెలకు రూ. 6వేలు పెట్టుబడితో నెలకు రూ. లక్షకు పైగా సంపాదించుకోవచ్చు..

SIP Returns
SIP Returns : అందరూ సంపాదిస్తారు.. కానీ, కొందరు మాత్రమే సేవింగ్స్ ఎక్కువ చేస్తారు. అలాంటి వారి జీవితం రిటైర్మెంట్ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా (SIP Returns) హాయిగా బతికేయొచ్చు. పైగా ఎవరిపై ఆధారపడాల్సిన పని ఉండదు. దాచుకున్న డబ్బుతోనే మిగిలిన జీవితాన్ని కొనసాగించవచ్చు.
మీరు 50 ఏళ్లు లేదా 60 ఏళ్ల వయస్సు మధ్య ఉన్నప్పుడు సాధారణంగా రిటైర్మెంట్ అవ్వాల్సిన సమయం.మీరు ప్రైవేట్ ఉద్యోగి అయినా లేదా ప్రభుత్వ ఉద్యోగి అయినా రిటైర్మెంట్ అవుతారు. వయస్సులో ఉన్నప్పుడు సొంతంగా సంపాదించుకోగలరు. వయస్సు పైబడిన తర్వాత ఉద్యోగం చేయలేరు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం, ఇతర వ్యక్తిగత ఖర్చులు ఉంటాయి. అప్పుడు మీకంటూ ఎంతోకొంత దాచుకున్న డబ్బు ఉండాలి. లేదంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే.. రిటైర్మెంట్ ప్లాన్ తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెడితే మీ భవిష్యత్తు కోసం అంత మొత్తంలో భారీగా డబ్బులను కూడబెట్టుకోవచ్చు.
రిటైర్మెంట్ కోసం డబ్బు ఆదా చేసుకోవాలంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఒక అద్భుతమైన మార్గం. మీరు 25 ఏళ్ల పాటు SIPలో ప్రతి నెలా రూ. 6వేలు పెట్టుబడి పెడితే.. రిటైర్మెంట్ తర్వాత వచ్చే 25 ఏళ్లలో నెలకు రూ లక్ష ఆదాయం పొందవచ్చు. ఆ సమయంలో ఇదే డబ్బు మీ రోజువారీ ఖర్చులు, ఇతర అత్యవసరాలకు కూడా ఉపయోగపడుతుంది.
ముందుగా SIP.. ఆ తరువాతే SWPలోకి.. :
రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఆదాయం కోసం ముందుగా భారీ మొత్తంలో డబ్బు కూడబెట్టుకోవాలి. మీరు ఈ ఫండ్ SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలి. మీరు 30 ఏళ్ల వయస్సులో SIPని ప్రారంభిస్తే.. 55 ఏళ్ల వయస్సు వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఆ తర్వాత డబ్బును SWP (Systematic Withdrawal Plan)కి షిఫ్ట్ చేయొచ్చు. తద్వారా రిటైర్మెంట్ తర్వాత స్థిర నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. మీ అవసరాలకు తగట్టుగా SIP, SWPలో ఎన్ని ఏళ్లు అనేది కూడా మార్చుకోవచ్చు.
SIP నుంచి ఎంత రాబడి వస్తుందంటే? :
ఆర్థిక నిపుణుల ప్రకారం.. SIP రాబడి ఫండ్ టైప్, మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా SIP ప్రతి ఏడాదిలో 6 శాతం నుంచి 18 శాతం మధ్య రాబడిని ఇస్తుంది. మీరు మంచి ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకుంటే.. 12 శాతం నుంచి 18 శాతం రాబడి లభిస్తుంది. మిడ్‌క్యాప్ ఫండ్‌లు 14 శాతం నుంచి 17 శాతం రాబడిని అందిస్తాయి. అయితే, డెట్ ఫండ్‌లు చాలా సేఫ్. 6 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీని అందిస్తాయి. అయితే, సగటున, మ్యూచువల్ ఫండ్ SIP ప్లాన్లు దీర్ఘకాలంలో దాదాపు 12 శాతం రాబడిని అందిస్తాయి.
25 ఏళ్లలో రూ. కోటి సంపాదన ఎలా? :
ఉదాహరణకు.. మీరు 30 ఏళ్ల వయస్సులో SIPలో ప్రతి నెలా రూ. 6వేలు పెట్టుబడి పెడితే.. 25 ఏళ్ల తర్వాత మీకు 55 ఏళ్లు నిండుతాయి. ఆ సమయంలో మీ దగ్గర రూ. కోటి రూపాయలకు పైగా ఉంటాయి. ఈ మొత్తంలో రూ. 18 లక్షలు కేవలం మీ సొంత పెట్టుబడి మాత్రమే.. మిగిలిన మొత్తం అంటే రూ. 84 లక్షల కన్నా ఎక్కువ సంపాదించే రాబడి లేదా వడ్డీనే ఉంటుంది. సగటు రాబడి సంవత్సరానికి 12 శాతం ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది.
రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా రూ. లక్ష రాబడి? :
మీకు 55 ఏళ్లు నిండగానే రూ. కోటి రూపాయలను SWPలోకి మార్చుకోవచ్చు. మీ డబ్బు మొత్తాన్ని ప్రతి నెలా స్థిర మొత్తాన్ని అందిస్తుంది. అందుకే ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలి. ప్రతి సంవత్సరం 12 శాతం రాబడిని అందిస్తే.. ప్రతి నెలా లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు. రాబోయే 25 ఏళ్లు ఇలానే కొనసాగుతుంది. ఈ 25 ఏళ్లలో మీకు మొత్తం రూ. 3 కోట్లు చేతికి అందుతాయి. ఆ తర్వాత కూడా మీ SIP ఫండ్‌లో దాదాపు రూ. 13.8 లక్షలు మిగిలే ఉంటాయి.