Post Office Schemes : సీనియర్ సిటిజన్లకు పండగే.. ఈ ప్రభుత్వ పథకంలో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతినెలా రూ.20,500 సంపాదించుకోవచ్చు..!
Post Office Schemes : సీనియర్ సిటిజన్ల కోసం పోస్టాఫీసులో సూపర్ స్కీమ్ ఉంది. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ప్రతినెలా బాగా సంపాదించుకోవచ్చు..

Post Office Schemes
Post Office Schemes : సీనియర్ సిటిజన్లకు అద్భుతమైన పథకం.. రిటైర్మెంట్ తర్వాత ఒకరిపై ఆధారపడకుండా ఎలాంటి డబ్బు కొరత లేకుండా జీవించవచ్చు. అంటే.. ఆరు పదుల (Post Office Schemes) వయస్సులో కూడా ఇంట్లో కూర్చొనే సంపాదించుకోవచ్చు.. మీరు చేయాల్సిందిల్లా.. పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టడమే.. నెలవారీ జీతం లేకపోయినా పెన్షన్ అందకపోయినా నెలవారీగా రూ.20,500 డబ్బును అందుకోవచ్చు.
ఇంతకీ ఆ పథకం ఏంటో తెలుసా? పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) స్కీమ్.. ఈ ప్రభుత్వ మద్దతుగల పథకం ఎంతో సురక్షితమైన పెట్టుబడి. పైగా మీకు గ్యారెంటీతో కూడిన నెలవారీ వడ్డీని అందిస్తుంది. ఈ పథకంలో చేరాలంటే అర్హతలేంటి? ఎంతమొత్తంలో పెట్టబడి పెట్టాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సీనియర్ సిటిజన్ల కోసం పథకం :
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అనేది 60 ఏళ్లు పైబడిన వారికి అద్భుతమైన పథకం. ఈ పథకంలో పెట్టుబడి పెడితే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) కన్నా ఎక్కువ వడ్డీని పొందవచ్చు. మీ డబ్బు కూడా వంద శాతం సురక్షితం.
మీరు 5 ఏళ్ల పాటు ఒకేసారి డిపాజిట్ చేయాలి. ప్రతి 3 నెలలకు గారెంటీ వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం, SCSS పథకంలో ఏడాదికి 8.2శాతం వడ్డీ రేటును అందిస్తుంది. మీరు ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత వడ్డీ రేట్లు తరువాత తగ్గినప్పటికీ, ఈ రేటు పూర్తి 5 ఏళ్లకు అలానే ఉంటుంది.
ఎంత సంపాదించవచ్చు? :
ఈ పోస్టాఫీసు పథకంలో మీరు (Post Office Schemes) రూ. 1,000 నుంచి రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పూర్తిగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే.. ఏడాదికి రూ.2,46,000 సంపాదిస్తారు. ప్రతి నెల రూ. 20,500 5 ఏళ్లలో మీకు మొత్తం రూ. 12,30,000 వడ్డీ లభిస్తుంది. 5 ఏళ్ల తర్వాత రూ. 42 లక్షల 30వేలు అందుకుంటారు. మీ పెట్టుబడి మొత్తం వడ్డీతో కలిపి లక్షల్లో సంపాదించుకోవచ్చు.
ఎవరు ఇన్వెస్ట్ చేయాలి? :
60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. VRS కింద లేదా డెఫెన్స్ నుంచి రిటైర్మెంట్ ( Post Office Schemes) అయిన వ్యక్తులు కూడా కొంత వయస్సు సడలింపుతో పెట్టుబడి పెట్టవచ్చు.
టాక్స్ బెనిఫిట్స్ :
సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. కానీ, వడ్డీపై పన్ను విధిస్తారు. ఒక ఏడాదిలో రూ. లక్ష కన్నా ఎక్కువ వడ్డీని సంపాదిస్తే.. TDS కట్ అవుతుంది. అవసరమైతే 5 ఏళ్ల తర్వాత మీ అకౌంట్ ఇంకా పొడిగించుకోవచ్చు.