PM-Kisan 20th Installment : రైతులకు బిగ్ అప్‌డేట్.. ఈ నెల 18నే పీఎం కిసాన్ 20వ విడత విడుదల? రూ. 2వేలు పడతాయో లేదో చెక్ చేయండి..!

PM-Kisan 20th Installment : పీఎం కిసాన్ 20వ విడత ఈ నెల 18న విడుదల అయ్యే అవకాశం ఉంది. రూ. 2వేలు పడాలంటే రైతులు కొన్ని పనులను పూర్తి చేయాలి..

PM-Kisan 20th Installment : రైతులకు బిగ్ అప్‌డేట్.. ఈ నెల 18నే పీఎం కిసాన్ 20వ విడత విడుదల? రూ. 2వేలు పడతాయో లేదో చెక్ చేయండి..!

PM Kisan Yojana

Updated On : July 17, 2025 / 7:26 PM IST

PM-Kisan 20th Installment : దేశంలోని కోట్లాది మంది రైతులకు బిగ్ అప్‌డేట్.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత విడుదలపై ఉత్కంఠ నెలకొంది. పీఎం కిసాన్ (PM-Kisan 20th Installment) లబ్ధిదారు రైతులు ఎప్పుడు రూ. 2వేలు విడుదల అవుతాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పీఎం మోదీ 20వ విడత రూ. 2వేలు ఈ నెలలోనే విడుదల చేస్తారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వాయిదా ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదల అవుతుందని సంగతి తెలిసిందే. చివరి 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదల అయింది. ఆ తర్వాత ఈ మొత్తం జూన్‌లో రావాల్సి ఉంది. కానీ, ఈసారి ఆలస్యం అయింది.

ప్రధానమంత్రి కిసాన్ యోజన 20వ విడత జూలై 18న విడుదల అయ్యే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నివేదికల ప్రకారం.. జూలై 18న మోతీహరిలో జరిగే బహిరంగ సభలో పీఎం నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 9.8 కోట్లకు పైగా రైతుల బ్యాంకు అకౌంట్లలో 20వ విడత రూ. 2వేలు నేరుగా పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈలోగా లబ్ధిదారు రైతులు కొన్ని పనులను పూర్తి చేసి ఉండాలి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

భూమి రికార్డులను ఎలా అప్ డేట్ చేయాలి? :

  • పీఎం కిసాన్ యోజన బెనిఫిట్స్ పొందడానికి మీ భూమి రికార్డులను అప్‌డేట్ చేసుకోండి.
  • ముందుగా, పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in)కి వెళ్లండి.
  • హోమ్‌పేజీలో ‘Farmer Corner’ కింద ‘State Transfer Request’ పై క్లిక్ చేయండి.
  • మీ ‘Registration Number’ లేదా ‘Aadhaar Number’ నమోదు చేయండి.
  • క్యాచ్ కోడ్‌ను ఎంటర్ చేసి ‘Get OTP’పై క్లిక్ చేయండి.
  • OTP ఎంటర్ చేయండి.
  • మీ పేరు మీద ‘అగ్రికల్చర్ ల్యాండ్ ప్రూఫ్ ‘ (భూమి రికార్డులు) అప్‌లోడ్ చేయండి.
  • ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయండి.

PM Kisan పథకం బెనిఫిట్స్ ఎలా పొందాలి? :

  • మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ చేయాలి.
  • బ్యాంకు అకౌంటుతో ఆధార్ సీడింగ్ స్టేటస్ చెక్ చేయండి.
  • ఆధార్‌తో లింక్ బ్యాంక్ అకౌంటులో DBT (Direct Benefit Transfer)ను యాక్టివ్‌గా ఉంచండి.
  • మీ e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయండి.
  • పీఎం కిసాన్ పోర్టల్‌లోని ‘Know Your Status’ మాడ్యూల్ కింద ఆధార్ సీడింగ్ స్టేటస్ చెక్ చేయండి.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేయాలి? :

  • మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు.
  • PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in) ఓపెన్ చేయండి.
  • ఇండియా మ్యాప్ ‘Payment Success’ ట్యాబ్‌ ఉంటుంది.
    “Dashboard” ఎల్లో ట్యాబ్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
  • గ్రామ డాష్‌బోర్డ్ ట్యాబ్‌లో పూర్తి వివరాలను ఎంటర్ చేయండి.
  • రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, గ్రామ పంచాయతీని ఎంచుకోండి.
  • ‘Get Report’ బటన్‌పై క్లిక్ చేయండి.
  • లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేయండి.