Asus ROG Phone 7 Allegedly Bags NBTC Certification Ahead of April 13 Launch
Asus ROG Phone 7 Launch : కొత్త స్మార్ట్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లోకి ఏప్రిల్ 13న కొత్త Asus ROG ఫోన్ 7 లాంచ్‌కు రెడీగా ఉంది. అధికారిక లాంచ్‌కు ముందు.. రాబోయే ROG సిరీస్ స్మార్ట్‌ఫోన్ థాయిలాండ్ నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్, టెలికమ్యూనికేషన్స్ కమిషన్ (NBTC) నుంచి ధృవీకరణను పొందింది. ఈ లిస్టింగ్ ఫోన్ ఏ కీలక స్పెసిఫికేషన్‌లను సూచించలేదు. కానీ, 5G కనెక్టివిటీతో రానుందని సూచిస్తుంది. (Asus ROG) ఫోన్ 7 Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC పవర్ అందిస్తుందని భావిస్తున్నారు. గత ఏడాది జూలైలో లాంచ్ అయిన ROG ఫోన్ 6కి ఈ కొత్త మోడల్ అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు.
టిప్‌స్టర్ ముకుల్ శర్మ ప్రకారం.. NBTC వెబ్‌సైట్‌లో Asus ROG ఫోన్ 7 లిస్టుకు సంబంధించి స్క్రీన్‌షాట్‌లను ట్వీట్ చేశారు. ఈ లిస్టులో మోడల్ నంబర్ Asus_AI2205_Cని సూచిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు GSM, WCDMA LTE, NR నెట్‌వర్క్‌లకు సపోర్టు అందిస్తుందని లిస్టు చూపిస్తుంది. రాబోయే హ్యాండ్‌సెట్‌లో 5G కనెక్టివిటీని సూచిస్తుంది. NBTC లిస్టు కూడా ఈ ఫోన్ తైవాన్‌లో తయారైందని సూచిస్తుంది.
Asus ROG Phone 7 Launch Allegedly Bags NBTC Certification Ahead of April 13 Launch ( Photo : Asus)
ఇప్పటికే కొత్త Asus ROG ఫోన్ 7 గ్లోబల్ మార్కెట్‌లలో ఏప్రిల్ 13న ఉదయం 5:30 గంటలకు IST సంస్థ YouTube ఛానెల్ ద్వారా లాంచ్ కానుంది. వర్చువల్ ఈవెంట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందించనుంది. ఈ గ్లోబల్ లాంచ్‌తో పాటు భారత మార్కెట్లో లాంచ్ కూడా జరుగుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అభిమానులు లాంచ్‌కు ముందు Asus ROG ఫోన్ 7 స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసింది. కనిష్ట రిఫ్రెష్ రేట్ 165Hzతో 6.8-అంగుళాల Full-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండనుంది.
గతంలో Asus ROG ఫోన్ 7 భారతీయ వేరియంట్ మోడల్ నంబర్ ASUS_AI2205_Cతో గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లో కనిపించింది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 2 SoC ద్వారా రానుందని లిస్టింగ్ సూచించింది. కంపెనీ ROG UI కస్టమ్ స్కిన్‌తో Android 13లో రన్ అవుతుంది. 16GB RAM, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజీని కలిగి ఉండనుంది. Qualcomm ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ద్వారా పనిచేస్తుంది. గత ఏడాది జూలైలో సింగిల్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 71,999 ధరతో మార్కెట్లోకి వచ్చింది.
Read Also : Best Smartwatches Offer : అమెజాన్‌లో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లపై బెస్ట్ డీల్స్.. ఏ మోడల్ ధర ఎంతంటే?