×
Ad

AWS Global Outage : అమెజాన్ క్లౌడ్ సర్వర్ డౌన్.. స్నాప్‌చాట్, Canva, AWS, రోబ్లాక్స్ ఒకేసారి క్రాష్.. యూజర్ల ఫిర్యాదులు.. ఏ సైట్లు, యాప్స్ ఎఫెక్ట్ అయ్యాయంటే?

AWS Global Outage : అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భారీగా అంతరాయం.. యూఎస్‌లో వేలాది మంది వినియోగదారులు తీవ్ర అంతరాయాలను ఎదుర్కొన్నారు.

AWS Global Outage

AWS Global Outage : అమెజాన్ క్లౌడ్ సర్వీసుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఈ క్లౌడ్ ఆధారిత సర్వీసులన్నీ ఒక్కసారిగా స్తంభించిపోయాయి. అమెజాన్ క్లౌడ్ డివిజన్ AWS, రాబిన్‌హుడ్, స్నాప్‌చాట్, పెర్ప్లెక్సిటీ ఏఐ వంటి అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు సోమవారం (అక్టోబర్ 20)న తీవ్ర అంతరాయాలను ఎదుర్కొన్నాయని అవుట్‌టేజ్-ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ పేర్కొంది.

ఈ సర్వర్ సమస్య అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) నుంచి (AWS Global Outage) తలెత్తినట్టు కనిపిస్తోంది. ఇంటర్నెట్ బ్యాకెండ్ రీసోర్సెస్‌పై ఎక్కువ ప్రభావాన్ని చూపిందని రాయిటర్స్ నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీల యాప్స్, సైట్లకు కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి. ఫోర్ట్‌నైట్, స్నాప్‌చాట్‌తో సహా అనేక పాపులర్ వెబ్‌సైట్‌లు, యాప్‌ల సేవలకు అంతరాయం ఏర్పడింది.

ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. అందులో స్నాప్‌చాట్, రోబ్లాక్స్, కాన్వా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), డ్యుయోలింగో, పెర్ప్లెక్సిటీ వంటి కొన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం #SnapchatDown సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

వేలాది మంది వినియోగదారులు డౌన్ డిటెక్టర్‌లో ఫిర్యాదులను నివేదించారు. మొదట ఈ తీవ్ర అంతరాయాన్ని స్నాప్‌చాట్ సర్వర్ సమస్యగా భావించారు. కానీ, త్వరలోనే సమస్య చాలా తీవ్రమైంది. ఈ అంతరాయం కేవలం ఒకే యాప్ సమస్య కాదని, మొత్తం డిజిటల్ రీసోర్సెస్ లో తలెత్తిన సాంకేతిక సమస్యగా గుర్తించారు.

ఏయే సేవలు ఎఫెక్ట్ అయ్యాయంటే? :
డౌన్ డిటెక్టర్ ప్రకారం.. ఇప్పటివరకు 13,500 కన్నా ఎక్కువ మంది స్నాప్‌చాట్ యూజర్లు తీవ్ర సమస్యలను నివేదించారు. వీరిలో 91శాతం మంది లాగిన్ అవ్వలేకపోయారు. 6శాతం మంది మీడియాను అప్‌లోడ్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. దాదాపు 3శాతం మంది ఫీడ్‌ లోడింగ్ ఇష్యూను నివేదించారు.

రోబ్లాక్స్‌లో దాదాపు 3,000 రిపోర్టులు దాఖలు అయ్యాయి. ఇందులో 62శాతం సర్వర్ కనెక్షన్ ఫెయిల్యూర్ సంబంధించినవే. 26శాతం గేమ్‌ప్లే లోపాలకు సంబంధించినవి. కాన్వా ఫిర్యాదులు కూడా 500 నుంచి 190కి తగ్గాయి. కానీ, చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ ప్లాట్‌ఫారమ్‌లో సరిగా యాక్సస్ చేయలేకపోతున్నామని వాపోతున్నారు.

Read Also : Diwali 2025 Gift Guide : దీపావళి 2025 గిఫ్ట్ గైడ్.. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం రూ. 6వేల లోపు ధరలో టెక్ గాడ్జెట్లు.. ఏది గిఫ్ట్ ఇస్తారో మీఇష్టం..!

మరోవైపు.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) దాదాపు 1,500 రిపోర్టులను అందుకుంది. ఈ వినియోగదారులలో 81శాతం మంది యూఎస్ ఈస్ట్-1 ప్రాంతంలో ఉన్నారు. ఈ ప్రాంతంలోనే అనేక ప్రపంచ దేశాలకు సర్వీసులను అందిస్తోంది. ఏడబ్య్లూఎస్ క్లౌడ్ ప్రాంతాలలో అసాధారణంగా హై డిలే, ఎర్రర్ ఉన్నట్టుగా గుర్తించింది.

ఒకేసారి స్తంభించిన డజన్ల కొద్ది సైట్లు :
ప్రపంచంవ్యాప్తంగా వినియోగదారులు ఎక్కువగా వాడే యాప్‌లలో స్నాప్‌చాట్, కాన్వా, రోబ్లాక్స్ లేదా ఏదైనా గేమింగ్ ప్లాట్‌ఫామ్ అన్నీ ఒకే బ్యాకెండ్ సర్వర్లపై రన్ అవుతాయి. అందులో క్లౌడ్ సర్వర్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక ప్రాంతంలోని AWS సర్వీసు నిలిచిపోగానే ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ ప్లాట్‌ఫామ్‌లను ప్రభావితమయ్యాయి.

టెక్ ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారు? :
స్నాప్‌చాట్, కాన్వా వంటి సర్వీసుల CDN (కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్‌లు) ఆసియా-పసిఫిక్ క్లౌడ్ మార్గాలకు ఇంటిగ్రేట్ చేయడంతో భారత్‌లో వేలాది మంది వినియోగదారులు కూడా ప్రభావితమయ్యారు. ఆసక్తికరంగా, పెర్ప్లెక్సిటీ ఏఐ, డ్యుయోలింగో వంటి సర్వీసులు కూడా ప్రభావితమయ్యాయి. అయినప్పటికీ రెండూ AWS ద్వారా నేరుగా సర్వీసులను అందించడం లేదు. సర్వర్ నెట్‌వర్క్ ఫెయిల్యూర్ కారణంగా ఇతర కంపెనీల ఏపీఐ కనెక్టివిటీ, లాగిన్ సిస్టమ్‌లకు అంతరాయం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.

AWS ఏం చెప్పిందంటే? :
“US-EAST-1 ప్రాంతంలో మల్టీ AWS సేవలకు పెరిగిన ఎర్రర్ రేట్లు, సర్వర్ డిలే ఉన్నట్టుగా గుర్తించాం” అని AWS స్టేటస్ పేజీలో తెలిపింది. “ప్రస్తుతం పర్‌ప్లెక్సిటీ తగ్గింది. ప్రధాన కారణం AWS సర్వర్ ఇష్యూ. ఈ ఇష్యూ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని పెర్‌ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ వేదికగా పోస్ట్‌లో తెలిపారు.

AWS అంతరాయంతో ఎఫెక్ట్ అయిన సైట్‌లు, యాప్‌ల పూర్తి జాబితా :

  • Amazon.com
  • Prime Video
  • Alexa
  • Robinhood
  • Snapchat
  • Perplexity AI
  • Venmo
  • Canvas by Instructure
  • Crunchyroll
  • Roblox
  • Whatnot
  • Rainbow Six Siege
  • Coinbase
  • Canva
  • Duolingo
  • Goodreads
  • Ring
  • The New York Times
  • Life360
  • Fortnite
  • Apple TV
  • Verizon
  • Chime
  • McDonald’s App
  • CollegeBoard
  • Wordle
  • PUBG Battlegrounds