Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. ఈ శాంసంగ్ అల్ట్రా 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. అమెజాన్ దీపావళి సేల్ సందర్భంగా ధర ఎంత తగ్గిందంటే?

Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. ఈ శాంసంగ్ అల్ట్రా 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy S25 Ultra 5G

Updated On : October 19, 2025 / 8:15 PM IST

Samsung Galaxy S25 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? దీపావళి సీజన్‌లో అమెజాన్ అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే డీల్స్ అందిస్తోంది. ఇందులో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్లు కూడా ఉన్నాయి. శాంసంగ్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ S సిరీస్ ఫోన్ బ్యాంక్ ఆఫర్ లేకుండా రూ. లక్ష కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా రూ. 1,30,000కి లాంచ్ (Samsung Galaxy S25 Ultra 5G) అయింది. ప్రస్తుతం తగ్గింపు ధరకే లభిస్తోంది. అదిరిపోయే స్పెసిఫికేషన్‌లు, ఏఐ ఫీచర్లు, కెమెరా ఫీచర్లు ఉన్నాయి. S పెన్ సపోర్ట్, డిజైన్‌ కూడా అద్భుతంగా ఉంది. మీ పాత ఫోన్‌ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కొనేసుకోవచ్చు. అమెజాన్‌లో ఈ శాంసంగ్ అల్ట్రా 5జీ ఫోన్ ధర ఎంత తగ్గిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G అసలు లాంచ్ ధర కన్నా రూ. 99,200కు అందుబాటులో ఉంది. కస్టమర్లు HDFC బ్యాంక్ కార్డులతో రూ. 1,250 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ. 98వేల కన్నా తక్కువకు పొందవచ్చు. కొనుగోలుదారులు నెలకు రూ. 4,809 నుంచి ఈఎంఐ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read Also : Diwali 2025 Party Vibes : పండగే పండగ.. దీపావళి మ్యూజిక్ పార్టీ కోసం 5 బెస్ట్ బ్లూటూత్ స్పీకర్లు ఇవే.. ఏది కొంటారో కొనేసుకోండి.

ఆసక్తిగల కస్టమర్లు రూ. 58వేల వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. ఈ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కోసం పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరింత తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే, మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, బ్రాండ్, మోడల్ బట్టి ధర తగ్గింపు ఉంటుంది. కొనుగోలుదారులు అదనంగా చెల్లిస్తే ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఇతర యాడ్-ఆన్స్ కూడా ఎంచుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్పెషిఫికేషన్లు :
ఈ శాంసంగ్ ఫోన్ 6.9-అంగుళాల అమోల్డ్ 120Hz డిస్‌ప్లేను అందిస్తుంది. కచ్చితమైన కలర్లు, అదిరిపోయే బ్రైట్‌నెస్ లెవల్స్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ ద్వారా పవర్ అందిస్తుంది. 6GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది. 5,000mAh బ్యాటరీ ప్యాక్, 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 4 సెన్సార్లను అందిస్తుంది. 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్ కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.