Smart TV Price : కొత్త స్మార్ట్‌టీవీ కావాలా? 43 అంగుళాల బెస్ట్ స్మార్ట్‌టీవీలు ఇవే.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. ఇప్పుడు కొనడమే బెటర్!

Smart TV Price : కొత్త స్మార్ట్‌టీవీ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. షావోమీ స్మార్ట్ టీవీని కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Smart TV Price : కొత్త స్మార్ట్‌టీవీ కావాలా? 43 అంగుళాల బెస్ట్ స్మార్ట్‌టీవీలు ఇవే.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. ఇప్పుడు కొనడమే బెటర్!

Smart TV Price

Updated On : October 28, 2025 / 5:29 PM IST

Smart TV Price : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ కోసం కొత్త టీవీని కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. సినిమాలు, సిరీస్‌లు, వెబ్ షోలు చూసేవారు అయితే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. బడ్జెట్ పరంగా పరిశీలిస్తే.. అమెజాన్ సేల్ ద్వారా తక్కువ ధరకే కొత్త స్మార్ట్ టీవీని ఇంటికి తెచ్చుకోవచ్చు.

మీరు కూడా ఈ 43-అంగుళాల (Smart TV Price) స్మార్ట్ టీవీలను కొనాలని భావిస్తుంటే ఆఫర్లతో రూ. 12,999కి అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌టీవీని సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు.

విడబ్ల్యూ 43 అంగుళాల స్మార్ట్ టీవీ :
విడబ్ల్యూ (VW) ఫుల్ HD డిస్‌ప్లేతో బెస్ట్ స్మార్ట్ టీవీ. 3.8-స్టార్ యూజర్ రేటింగ్‌ కలిగి ఉంది. ఈ టీవీని వెంటనే కొనేసుకోవచ్చు. ఈ టీవీలో ఎల్ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీ, ఈజీ నావిగేషన్, OTT యాక్సెస్ ఉన్నాయి. ఎడ్జ్‌లెస్ డిజైన్, 20W సౌండ్ సపోర్ట్‌ కలిగి ఉంది. బెస్ట్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌టీవీని రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు.

Read Also : Safest Cars India : కొత్త కారు కొంటున్నారా? 5 స్టార్ రేటింగ్ టాప్ 5 సేఫెస్ట్ కార్లు ఇవే.. మీ ఫ్యామిలీకి ఫుల్ సేఫ్టీ.. ఏ కారు కొంటారో మీఇష్టం!

షావోమీ 43 అంగుళాల స్మార్ట్ టీవీ :
డాల్బీ ఆడియోతో కూడిన ఈ షావోమీ టీవీ బెస్ట్ ఆప్షన్ కావచ్చు. ఎందుకంటే 32GB స్టోరేజీని అందిస్తుంది. ఈ భారీ స్టోరేజీ మల్టీ అప్లికేషన్‌ ఇన్‌స్టాల్ చేయొచ్చు. ప్రత్యేక క్లిప్‌లు, వీడియోలతో కూడా వస్తుంది. అదనంగా, ఈ టీవీ USB, HDMIతో సహా 7 ఇన్‌పుట్స్ అందిస్తుంది. అలెక్సా మోడ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ప్రీమియం మెటల్ బెజెల్‌లెస్ డిజైన్‌లో వస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ ధర రూ. 21,999కు పొందవచ్చు.

శాంసంగ్ 43-అంగుళాల స్మార్ట్ టీవీ :
ఈ శాంసంగ్ స్మార్ట్‌టీవీ బెస్ట్ ఆప్షన్ కావచ్చు. ఎయిర్ స్లిమ్ డిజైన్‌తో పవర్‌ఫుల్ బ్రైట్‌నెస్, అప్‌స్కేలింగ్ మోడ్‌ అందిస్తుంది. లో క్వాలిటీ గల వీడియోల క్వాలిటీని కూడా పెంచుతుంది. వ్యూపరంగా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. 2024లో వచ్చిన ఈ స్మార్ట్‌టీవీకి కస్టమర్ కస్టమర్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. మీరు అమెజాన్ నుంచి రూ. 31,990కి నో-కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు.