Safest Cars India : కొత్త కారు కొంటున్నారా? 5 స్టార్ రేటింగ్ టాప్ 5 సేఫెస్ట్ కార్లు ఇవే.. మీ ఫ్యామిలీకి ఫుల్ సేఫ్టీ.. ఏ కారు కొంటారో మీఇష్టం!
Safest Cars India : భారతీయ రోడ్లపై అత్యంత సురక్షితమైన కార్లలో టాప్ 5 సేఫెస్ట్ కార్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో ఏ కారు కొంటారంటే?
Safest Cars India
Safest Cars India : కొత్త కారు కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. భారతీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడు డిజైన్, మైలేజీపై మాత్రమే కాకుండా సేఫ్టీ ప్రమాణాలపై కూడా దృష్టి సారిస్తోంది. గత కొన్ని ఏళ్లుగా ప్రభుత్వం ఆటోమొబైల్ కంపెనీలు వాహన భద్రతలో భారీ పురోగతిని సాధించాయి. ఈ దిశగా గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (గ్లోబల్ NCAP) 2014లో #SaferCarsForIndia క్యాంపెయిన్ ప్రారంభించింది.
భారతీయ వినియోగదారులలో సురక్షితమైన (Safest Cars India) వాహనాల గురించి అవగాహన పెంచడం, కంపెనీలు అధిక భద్రతా ప్రమాణాలను అవలంబించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మీరు కూడా సురక్షితమైన ప్రయాణం కోసం సేఫ్టీ కార్లను కొనేందుకు చూస్తుంటే ఇది మీకోసమే.. 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ కార్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
టాటా సఫారీ, హారియర్ :
టాటా మోటార్స్ నుంచి 2 ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ, సఫారీ, హారియర్ మోడల్స్ ఇప్పటివరకు భారత మార్కెట్లో అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీలుగా నిలిచాయి. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో రెండు మోడళ్లు 5-స్టార్ రేటింగ్‌లను పొందాయి. ఈ 2 వాహనాలు సింగిల్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు.
అడ్వాన్స్ సేఫ్టీ లక్షణాలతో అడల్ట్ చిల్డ్రన్ సేఫ్టీకి ప్రత్యేకంగా నిలిచాయి. సఫారీ, హారియర్ అడల్ట్ ప్రయాణీకుల ప్రొటెక్షన్‌లో 34కి 33.05 పాయింట్లు, చిల్డ్రన్ ప్యాసెంజర్ ప్రొటెక్షన్‌కు 49కి 45 స్కోర్లు సాధించాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, బ్రేక్ డిస్క్ వైపింగ్, రోల్‌ఓవర్ మిటిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
నిస్సాన్ మాగ్నైట్ :
నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్ మోడల్ సేఫ్టీ పరంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు మోడల్ 2-స్టార్ రేటింగ్ మాత్రమే పొందగా అప్‌డేట్ వెర్షన్ ఇప్పుడు 5-స్టార్ రేటింగ్ సాధించింది. అడల్ట్ ప్యాసెంజర్ ప్రొటెక్షన్ కోసం 34లో 32.31, చిల్డ్రన్ ప్యాసెంజర్ ప్రొటెక్షన్ కోసం 49లో 33.64 పాయింట్లు పొందింది. నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఈఎస్‌సీ వంటి ఫీచర్లతో ప్రామాణికంగా వస్తుంది. అత్యంత సురక్షితమైన SUVలలో నిస్సాన్ మాగ్నైట్ ఒకటిగా నిలిచింది.
టాటా నెక్సన్ :
గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి 5-స్టార్ రేటింగ్ పొందిన భారత మార్కెట్లో మొట్టమొదటి కారు టాటా నెక్సాన్. 2018 నుంచి ఈ మోడల్ స్థిరంగా టాప్ సేఫ్టీ రేటింగ్‌లలో ఒకటిగా నిలిచింది. లేటెస్ట్ వెర్షన్ అడల్ట్ ప్యాసెంజర్ ప్రొటెక్షన్కోసం 32.22 పాయింట్లు, చిల్డ్రన్ ప్యాసెంజర్ ప్రొటెక్షన్ కోసం 44.92 పాయింట్లను సాధించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, బ్రేక్ డిస్క్ వైపింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారతీయ రోడ్లపై సబ్-4-మీటర్ SUV మోడళ్లలో ఒకటిగా చెప్పొచ్చు.
మారుతి సుజుకి డిజైర్ :
మారుతి సుజుకి కొత్త జనరేషన్ డిజైర్ సెడాన్ కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. అడల్ట్ ప్యాసెంజర్ సేఫ్టీ కోసం 31.24 పాయింట్లు, చిల్డ్రన్ ప్యాసెంజర్ సేఫ్టీలో 39.20 పాయింట్లను సాధించింది. 5 స్టార్ రేటింగ్ పొందిన మారుతి మొదటి కారు. డిజైర్‌లో 6 ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పెడిస్ట్రెయిన్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టస్ :
స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్‌లు రెండూ సింగిల్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నాయి. ఈ రెండూ గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ రేటింగ్ పొందాయి. అడల్ట్ ప్యాసెంజర్ సేఫ్టీలో 29.71 పాయింట్లు, పిల్లల ప్రయాణీకుల భద్రతలో 42 పాయింట్లు సాధించాయి. ఈ రెండు కార్లలో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఆటో హిల్ హోల్డ్ ప్రయాణీకులందరికి 3-పాయింట్ సీట్ బెల్టులు వంటి ఫీచర్లు ఉన్నాయి.
