Airtel vs Jio vs BSNL
Airtel vs Jio vs BSNL : విదేశాలకు వెళ్తున్నారా? మీకోసం అద్భుతమైన రోమింగ్ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. మీ నెట్‌వర్క్ ఏదైనా సరే.. అన్నింటిని (Airtel vs Jio vs BSNL) యాక్సస్ చేయొచ్చు.. మీరు ఎయిర్‌టెల్, జియో, బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ అయితే ఈ రీఛార్జ్ ప్యాక్స్ మీకోసమే.. ఈ మూడు టెలికోలు అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లను అందిస్తున్నాయి.
భారతీయులు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు వారి ఫోన్ నంబర్‌లను యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. అంతర్జాతీయ రోమింగ్ రీఛార్జ్ ద్వారా ప్రయాణికులు కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాల్సిన పనిలేదు. మీరు వాడే సిమ్ ద్వారానే ఇంట్లో ఉన్న ప్రియమైనవారితో టచ్‌లో ఉండవచ్చు. హైస్పీడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. ఎయిర్‌టెల్, జియో, బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 2వేల కన్నా తక్కువ ధరకే వివిధ రోమింగ్ ప్లాన్లను అందిస్తున్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..
ఎయిర్‌టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ డేటా, కాలింగ్, SMS బెనిఫిట్స్ అందించే అనేక రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. రూ. 1,098 ప్లాన్ 10 రోజుల వ్యాలిడిటీతో 3GB డేటా, 200 నిమిషాల కాలింగ్, 20 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. 2GB డేటా, 150 నిమిషాల లోకల్, ఇండియా కాలింగ్, 5 రోజుల వ్యాలిడిటీ 20 SMSలతో రూ.798 ప్లాన్ కూడా ఉంది.
యూఎస్, యూరప్, గల్ఫ్, ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తుంది. తరచుగా విదేశాలకు వెళ్లేవారికి రూ.2,997 ధరకు వార్షిక ప్యాక్ కూడా ఉంది. 2GB డేటా, 100 నిమిషాల వాయిస్ కాలింగ్ 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
జియో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్ :
జియో అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ రూ.499 నుంచి ప్రారంభమవుతుంది. రోజుకు 250MB డేటా, 100 నిమిషాల కాల్స్ లభిస్తాయి. డేటా లిమిట్ కోసం చూస్తున్న వారికి రూ.1,499 రీఛార్జ్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. 100 నిమిషాల వాయిస్ కాల్స్, 2GB హై-స్పీడ్ డేటా, 100 SMS బెనిఫిట్స్ 14 రోజుల పాటు పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్ అనేక దేశాలలో అందుబాటులో లేదు. కానీ, ఇప్పటికీ అనేక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుంది. ప్రస్తుతం విదేశాలకు వెళ్లేవారి కోసం రూ.1,799 అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌ను అందిస్తుంది. ప్రస్తుతం 18 దేశాలలో 1GB డేటా ప్యాక్, 10 నిమిషాల టాక్‌టైమ్, 5 SMS బెనిఫిట్స్‌తో 7 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.