Best Mobiles 2024 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో రూ. 30వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

Best Mobiles 2024 : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న రూ. 30వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Best Mobiles under Rs 30k in October 2024

Best Mobiles 2024 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం ఈ అక్టోబర్ నెలలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 30వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మోటోరోలా ఎడ్జ్ 50ప్రో 5జీ, పోకో ఎఫ్6 ఏఐ-ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయొచ్చు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో మిడ్‌రేంజ్ ఫోన్లలో కూడా కీలక ఫీచర్‌గా మారింది. కెమెరా క్వాలిటీని అప్‌‌గ్రేడ్ లేదా ప్రాసెసింగ్ పవర్‌ని ఆప్టిమైజ్ చేయవచ్చు. ఈ పండుగ సీజన్‌లో అద్భుతమైన కెమెరా, పర్ఫార్మెన్స్ పవర్‌ఫుల్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగిన ఫోన్ కోసం చూస్తుంటే ఇదే సరైన సమయం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న రూ. 30వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Read Also : iPhone 15 Discount : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.27వేలు తగ్గింపు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..!

మోటోరోలా ఎడ్జ్ 50ప్రో 5జీ :
మోటోరోలా ఎడ్జ్ 50ప్రో 5జీ ఫోన్ 2.63జీహెచ్‌జెడ్ సింగిల్ కోర్, 2.4జీహెచ్‌‌జెడ్ ట్రై-కోర్, 1.8జీహెచ్‌జెడ్ క్వాడ్-కోర్ కాన్ఫిగరేషన్‌ను కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఆధారితమైనది. దీనికి స్నాప్‌డ్రాగన్ 7జనరేషన్ 3 చిప్‌సెట్ సపోర్టు అందిస్తుంది. మల్టీ టాస్కింగ్, మెరుగైన పర్ఫార్మెన్స్ 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. 6.7-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ పీ-ఓఎల్ఈడీ డిస్‌ప్లే 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

ఫోటోగ్రఫీ పరంగా, బ్యాక్ సైడ్ 50ఎంపీ+ 13ఎంపీ+10ఎంపీ ట్రిపుల్-కెమెరా సెటప్‌ను అందిస్తుంది. అద్భుతమైన సెల్ఫీలకు 50ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 4500ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. టర్బో పవర్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. స్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్, ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది.

నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 3జీహెచ్‌జెడ్ డ్యూయల్ కోర్, 2జీహెచ్‌జెడ్ హెక్సా-కోర్ కాన్ఫిగరేషన్‌తో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమన్షిటీ 7350ప్రో చిప్‌సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. బ్యాక్‌సైడ్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50ఎంపీ+ 50ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్‌, సెల్ఫీలకు 50ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. ఈ ఫోన్ 5000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ 4 :
వన్‌ప్లస్ నార్డ్ 4 2.8జీహెచ్‌జెడ్ సింగిల్ కోర్, 2.6జీహెచ్‌జెడ్ క్వాడ్-కోర్ 1.9జీహెచ్‌జెడ్ ట్రై-కోర్ కాన్ఫిగరేషన్‌తో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. మల్టీ టాస్కింగ్, మృదువైన పర్ఫార్మెన్స్ కోసం 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. 6.74-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ బ్యాక్‌సైడ్ 50ఎంపీ+8ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. హై క్వాలిటీతో సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ పెద్ద 5500mAh బ్యాటరీతో వస్తుంది. వేగవంతమైన పవర్-అప్‌ల కోసం సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఛార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంటుంది.

రియల్‌మి జీటీ 6టీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 2.8GHz సింగిల్ కోర్, 2.6GHz క్వాడ్-కోర్, 1.9 GHz ట్రై-కోర్ కాన్ఫిగరేషన్‌తో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఆధారితమైనది. స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 చిప్‌సెట్ ద్వారా అందిస్తుంది. హై పర్ఫార్మెన్స్ వినియోగానికి 8జీబీ ర్యామ్ అందిస్తుంది. 6.78-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కెమెరా పరంగా బ్యాక్‌సైడ్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50ఎంపీ+ 8ఎంపీ డ్యూయల్-కెమెరా సెటప్, సెల్ఫీలకు 32ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

పోకో ఎఫ్6 :
పోకో ఎఫ్6 3 జీహెచ్‌జెడ్ సింగిల్ కోర్, 2.8GHz క్వాడ్-కోర్, 2జీహెచ్‌జెడ్ ట్రై-కోర్ కాన్ఫిగరేషన్‌తో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. 6.67-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ రింగ్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50ఎంపీ+ 8ఎంపీ డ్యూయల్-కెమెరా సెటప్‌ను అందిస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 20ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ టర్బో ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5000mAh బ్యాటరీతో రన్ అవుతుంది.

Read Also : Tecno Camon 30S Launch : అద్భుతమైన ఫీచర్లతో టెక్నో కెమన్‌ ఫోన్.. సూపర్ ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!