Best Phones in India : ఈ ఫిబ్రవరిలో రూ. 35వేల లోపు ధరలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు!

Best Phones in India : కొత్త ఫోన్ కొంటున్నారా? ఫిబ్రవరిలో రూ. 35వేల లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో కూడిన టాప్ 4 స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Best Phones in India 2024 : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాసెసర్‌లు, అద్భుతమైన కెమెరాలు, దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీలతో మరింత ఆకర్షణీయమైన ఖరీదైన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ల కోసం వినియోగదారులు ఆసక్తిగా వెతుకున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు మీ బడ్జెట్‌కు తగిన అద్భుతమైన విలువను అందిస్తాయి.

Read Also : Best Phones in India 2024 : ఈ ఫిబ్రవరిలో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

ఈ ఫిబ్రవరిలో మీరు భారత మార్కెట్లో రూ. 35వేల లోపు ధరలో కొనుగోలు చేయగల స్మార్ట్‌ఫోన్ జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఈ జాబితాలో ఐక్యూ నియో 7 ప్రో 5జీ ఫోన్ నుంచి మరో మూడు ఇతర పవర్‌హౌస్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 4 స్మార్ట్‌ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.

ఐక్యూ నియో 7 ప్రో 5జీ :
ఈ జాబితాలో టాప్ ప్లేసులో ఐక్యూ నియో 7 ప్రో 5జీ ఫోన్ నిలిచింది. అత్యంత సరసమైన స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్ 1 చిప్‌తో పంచ్‌ను కలిగి ఉంది. గేమింగ్, మూవీల కోసం 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. భారీ 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఎక్కువ సమయం ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది. అయితే, 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా ఇన్‌స్టాగ్రామ్ వంటి ఆకర్షణీయమైన స్నాప్‌లను క్యాప్చర్ చేయగలదు. ఐక్యూ నియో 7 ప్రో 5జీ ఫోన్ భారీ ధర ట్యాగ్ లేకుండా ప్రీమియం ఫోన్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు.

iQOO Neo 7 Pro 5G

రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5జీ :
ఈ జాబితాలోని మరో ఫోన్ రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5జీ మోడల్.. ప్రీమియం మెటల్, గ్లాస్ బిల్డ్ ఆప్షన్లను కలిగి ఉంది. 120హెచ్‌జెడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, తక్కువ-కాంతి పరిస్థితుల్లో 200ఎంపీ కెమెరాతో ఈ ఫోన్ గత వెర్షన్ల కన్నా ముఖ్యమైన అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్‌లోని 5,000ఎంఎహెచ్ బ్యాటరీ టాప్-అప్‌ల కోసం 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో సపోర్టు అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో అందించడం లేదు. కొత్త హైపర్‌ఓఎస్‌కి అప్‌డేట్స్ అందిస్తుంది. మొత్తంమీద, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ దాదాపు అన్ని విధాలుగా నోట్ 12 ప్రో ప్లస్ మోడల్‌ను అధిగమిస్తూ ఆకట్టుకునే ప్యాకేజీతో అందుబాటులో ఉంది.

Redmi Note 13 Pro+ 5G

పోకో F5 5జీ :
ఈ పోకో ఎఫ్5 5జీ ఫోన్ అనేది కొనుగోలుదారులను మరింతగా ఆకర్షించేలా ఉంది. రెడ్‌మి 13 ప్రో ప్లస్ వంటి అద్భుతమైన 12-బిట్ 120హెచ్‌జెడ్ అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. మరెన్నో కలర్‌ఫుల్ ఆప్షన్లను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 2 ప్రాసెసర్, గేమింగ్ లేదా మల్టీ టాస్కింగ్ అయినా స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 మాదిరిగా ఏదైనా పనిని సులభంగా పరిష్కరించగలదు.

Poco F5 5G

67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో దీర్ఘకాలం ఉండే 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అయితే ఓఐఎస్‌తో కూడిన షార్ప్ కెమెరా స్టేబుల్, అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఆకట్టుకునే డిజైన్‌తో పోకో F5 మోడల్ పర్ఫార్మెన్స్ ఒకే ప్యాకేజీలో కనిపిస్తోంది.

వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ :
ఈ జాబితాలో వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ ఫోన్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ ఫ్లాట్ 120హెచ్‌జెడ్ అమోల్డ్ డిస్‌ప్లేతో మూవీలు, గేమ్‌ల కోసం సులభంగా ఉపయోగించవచ్చు. అంతేకాదు.. సైలంట్ నోటిఫికేషన్ స్లయిడర్, లేటెస్ట్ ఆక్సిజన్ఓఎస్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది.

OnePlus Nord 3 5G

వన్‌ప్లస్ నార్డ్ 3 సాఫ్ట్‌వేర్ ఫీచర్-లోడ్ అయి ఉంటుంది. వేగంగా ఆపరేటింగ్ చేసేందుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. గరిష్టంగా 16జీబీ వరకు ర్యామ్‌తో అనేక యాక్టివిటీలను పూర్తి చేయొచ్చు. అనేక యాప్‌లు, గేమ్‌లు వేగంగా పనిచేస్తాయి. బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్లలో వన్‌ప్లస్ నార్డ్ 3 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు.

Read Also : Best Phones in India : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ ఫిబ్రవరిలో రూ.25వేల లోపు ధరలో 4 కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

ట్రెండింగ్ వార్తలు