Best Phones in India under Rs 50k in December 2023_ iQOO 11 5G and 3 more
Best Phones in India : 2023 ఏడాది త్వరలో ముగియనుంది. కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేసేవారికి ఇదే సరైన సమయం.. ఈ డిసెంబర్‌లో అనేక ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు ఖరీదైనవి అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రతి ఒక్కరూ ఈ ఫోన్లను కొనుగోలు చేయలేరు. అదృష్టవశాత్తూ, ఫ్లాగ్‌షిప్-కిల్లర్ ఫోన్లు కూడా ఇదే ధరలో ఫీచర్‌లను అందిస్తున్నాయి.
ఈ ఫోన్‌లు సాధారణంగా రూ. 50వేల లోపు ఉంటాయి. గేమింగ్, ఫోటోగ్రఫీ, రోజువారీ వినియోగానికి చాలా బాగున్నాయి మీరు బ్యాంక్ ఆఫర్లపై ఆధారపడకుండా హై క్వాలిటీ ఫోన్ల కోసం చూస్తున్నట్లయితే.. ఫ్లాగ్‌షిప్-కిల్లర్ ఫోన్ బెస్ట్ ఆప్షన్. ఈ డిసెంబర్‌లో మీరు భారత మార్కెట్లో రూ. 50వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ ఫోన్‌లను మీకు అందిస్తున్నాం. ఈ జాబితాలో ఐక్యూ 11 5జీ సహా మరో మూడు డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి.
1. ఐక్యూ 11 5జీ :
ఈ ఐక్యూ 11 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 పవర్డ్ ఫీచర్లతో రూ. 50వేల లోపు అత్యుత్తమ ఫోన్‌ల జాబితాలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 49,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఐక్యూ 11 5జీ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. మొత్తంగా, ఈ 5జీ ఫోన్ పవర్‌హౌస్‌తో ఆకర్షణీయమైన ఫీచర్‌లను కలిగి ఉంది.
iQOO 11 5G
హై-స్పీడ్ ఎక్స్‌పీరియన్స్ అవసరమయ్యే గేమర్ అయినా లేదా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయాలనుకునే ఫోటోగ్రాఫర్ అయినా ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. వేగవంతమైన ప్రాసెసర్, 144హెచ్‌జెడ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఆకట్టుకునే కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. అదనంగా, రాబోయే సంవత్సరాల్లో సాధారణ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో పాటు, ఫోన్ లేటెస్టుగా మరింత సురక్షితంగా ఉంటుందని చెప్పవచ్చు.
మీరు ఇలాంటి ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఐక్యూ 11 5జీ కొనుగోలు చేయొచ్చు.ఇటీవలే ఈ వన్‌ప్లస్ 11ఆర్ ఫోన్ అమెజాన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా భారీ తగ్గింపును పొందింది. ఈ ఫోన్ అసలు ధర రూ. 45,999 నుంచి రూ. 39,999కి తగ్గింది. వన్‌ప్లస్ 11ఆర్ కొనుగోలు చేసేవారికి మరో అద్భుతమైన ఫోన్. కర్వడ్ అమోల్డ్ ప్యానెల్ మృదువైన 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
OnePlus 11R 5G
అయితే, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్ కూడా ఉంది. దాంతో వేగవంతమైన 100డబ్ల్యూ ఛార్జింగ్‌తో కూడిన 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, అదనంగా ఛార్జర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 18జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ను అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వన్‌ప్లస్ 11ఆర్ అనేది రూ. 50వేల లోపు విభాగంలో అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
3. నథింగ్ ఫోన్ (2) :
నథింగ్ ఫోన్ (2), నథింగ్ ఫోన్ (1)కి అప్‌గ్రేడ్ వెర్షన్. ఇప్పుడు తగ్గింపుతో ధరతో అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ (1) మాదిరిగానే ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సరికొత్త గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. వెనుకవైపు ప్రత్యేకమైన లైట్లు నోటిఫికేషన్‌లు, వాల్యూమ్, టైమర్‌ల వంటి వివిధ ఫంక్షన్‌లను కంట్రోల్ చేసేందుకు అనుమతిస్తుంది.
Nothing Phone (2)
ఈ ఫోన్ లోపల పవర్‌ఫుల్ స్పాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్ మృదువైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అయితే, నథింగ్ ఓఎస్ 2.0 క్లీన్, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది. 50ఎంపీ ఐఎమ్ఎక్స్890 సెన్సార్ ప్రాథమిక బ్యాక్ కెమెరాకు శక్తినిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుత ప్రారంభ ధర రూ. 39,999 వద్ద, నథింగ్ ఫోన్ (2) మార్కెట్లో అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. స్పీడ్, డిజైన్, అత్యుత్తమ ఫోటో క్వాలిటీని అందిస్తోంది.
4. పిక్సెల్ 7 :
నథింగ్ ఫోన్ (2) మాదిరిగానే.. గూగుల్ పిక్సెల్ 7 ధర కూడా భారీగా తగ్గింది. ఎందుకంటే.. ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్ వెర్షన్ ఫ్లిప్‌కార్ట్‌లో ధర కేవలం రూ. 40,999కి అమ్ముడవుతోంది. ఈ డీల్‌తో అద్భుతమైన స్క్రీన్, డిజైన్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, అత్యుత్తమ కెమెరాతో వస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, నీటి నిరోధకత కూడా అందిస్తుంది.
Pixel 7
అయితే, శక్తివంతమైన టెన్సర్ జీ2 చిప్ మృదువైన అనుభవాన్ని అందిస్తుంది. మితమైన వినియోగంతో బ్యాటరీ రోజంతా వస్తుంది. ఈ ఫోన్ బాక్సులో ఛార్జర్ అందించడం లేదు. ప్రస్తుత ఛార్జర్ లేదా ప్రత్యేక కొనుగోలుతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు. పిక్సెల్ 7 యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో ప్రత్యేకంగా వినియోగదారులను ఆకట్టుకుంటుంది.