Best phones in India under Rs 50K in November 2023
Best Phones in India 2023 : కొత్త ఫోన్ తీసుకోవాలని ప్రతిఒక్కరికి ఉంటుంది. అందులోనూ ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్న ఫోన్లనే ఎక్కువగా కొనేందుకు ఇష్టపడుతుంటారు. సాధారణంగా, ఫ్యాన్సీ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు చాలా ఖరీదైనవి. అలాంటప్పుడు, మీరు బ్యాంక్ ఆఫర్లతో పనిలేకుండా ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు కలిగిన ఫోన్లను మీ బడ్జెట్ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్-కిల్లర్ ఫోన్ల ధర సాధారణంగా రూ. 50వేల నుంచి ఉంటుంది. కానీ, దాదాపు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే హై-ఎండ్ పంచ్‌ను కలిగి ఉంటాయి.
అద్భుతమైన ఫొటోలు, ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందించే టాప్ ఫ్లాగ్‌షిప్-కిల్లర్ ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి. మీరు గేమర్ అయినా, ఫోటోగ్రాఫర్ అయినా లేదా రోజువారీ ఉపయోగానికి ఫోన్ అవసరం అయినాసరే.. ఈ నవంబర్‌లో మీరు భారత మార్కెట్లో రూ. 50వేల లోపు పొందగలిగే అత్యుత్తమ ఫోన్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో వన్‌ప్లస్ 11ఆర్ నుంచి నథింగ్ ఫోన్ (2), గూగుల్ పిక్సెల్ 7 వంటి మరో మూడు డివైజ్‌లు ఉన్నాయి.
1. వన్‌ప్లస్ 11ఆర్ :
ఇటీవలే, అమెజాన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ 11ఆర్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది. రూ. 39,999తో మొదలై సోలార్ రెడ్ ఎడిషన్ రూ. 45,999 వరకు ఉంటుంది. కానీ, దాదాపు రూ. 40వేల వద్ద కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆకర్షణీయమైన అమోల్డ్ ప్యానెల్ కర్వ్ మోడల్‌తో వచ్చింది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
Best phones in India OnePlus 11R
హుడ్ కింద, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్ ఉంది. 5,000ఎంఎహెచ్, బ్యాటరీ 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ఛార్జర్ బాక్స్‌లో అందించడం లేదు. సాధారణ వన్‌ప్లస్ 11ఆర్ ఫోన్ 16జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్‌లో అగ్రస్థానంలో ఉండగా, వన్‌ప్లస్ 11ఆర్ సోలార్ రెడ్ 18జీబీ, 512జీబీ స్టోరేజీని అందిస్తుంది. మొత్తంమీద, ఈ ఫోన్ మీరు ప్రస్తుతం రూ. 50వేల లోపు కొనగల బెస్ట్ ఆప్షన్లలోఒకటిగా చెప్పవచ్చు.
2. నథింగ్ ఫోన్ 2 :
నథింగ్ ఫోన్ (2) అనేది నథింగ్ ఫోన్ (1) కొత్త అప్‌గ్రేడ్ వెర్షన్. చూసేందుకు ఒకేలా కనిపిస్తుంది. కానీ, కొత్తగా అద్భుతమైన ఫీచర్‌లతో వచ్చింది. ఈ ఫోన్ ఫీచర్లలో గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఒకటి. మీరు వాల్యూమ్, నోటిఫికేషన్‌లు, టైమర్‌ల వంటి వాటిని కంట్రోల్ చేయొచ్చు. నథింగ్ ఫోన్ బ్యాక్ సైడ్ లైట్ల సెట్ కూడా ఉంది. లోపలి భాగంలో, నథింగ్ ఫోన్ (2) కూడా స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ ద్వారా పవర్ అందిస్తుంది. అంటే.. చాలా వేగంగా రెస్పాండ్ అవుతుంది. ఇందులో సాఫ్ట్‌వేర్, నథింగ్ OS 2.0 కూడా చాలా బాగుంది.
Best phones in India Nothing Phone (2)
కొత్త ఫీచర్లు ఉన్నప్పటికీ, క్లీన్ సెటప్‌ను అందిస్తుంది. ప్రైవమరీ కెమెరా అద్భుతంగా ఉంది. 50ఎంపీ ఐఎమ్‌ఎక్స్890 సెన్సార్‌తో వివరణాత్మక కలర్ ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. మొత్తంమీద, నథింగ్ ఫోన్ (2) బెస్ట్ ఫోన్. ఈ ఫోన్ వేగవంతమైనది మాత్రమే కాదు.. చక్కని డిజైన్‌ను కలిగి ఉంది. అద్భుతమైన ఫోటోలను తీయగలదు. ఈ ఫోన్ ధర కూడా పడిపోయింది. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నథింగ్ ఫోన్ రూ. 39,999 ప్రారంభ ధరకు విక్రయిస్తోంది.
3. గూగుల్ పిక్సెల్ 7 :
గూగుల్ పిక్సెల్ 7 అసలు ధర రూ. 50వేలు ఉండగా.. ప్రస్తుతం, ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 42,999కి విక్రయిస్తోంది. అద్భుతమైన స్ర్కీన్, ఆకర్షణీయమైన డిజైన్, మంచి పనితీరు, అద్భుతమైన కెమెరాను అందించనుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. వాటర్ రెసెస్టిన్స్ కలిగి ఉంటుంది. డివైజ్ లోపల పవర్‌ఫుల్ టెన్సర్ జీ2 చిప్‌ని కలిగి ఉంది.
Best phones in India Google Pixel 7
సాధారణ వినియోగంతో బ్యాటరీ ఒక రోజంతా వస్తుంది. బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదు. కానీ, మీరు మీ పాత ఛార్జర్‌ని ఉపయోగించవచ్చు. లేదంటే కొత్తది విడిగా కొనుగోలు చేయవచ్చు. పిక్సెల్ 7 ఫోన్ యూజర్ ఫ్రెండ్లీ, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉంది. మీరు సరసమైన ధర, స్క్రీన్, కెమెరా, డిజైన్ కలిగిన ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం పిక్సెల్ 7 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.