×
Ad

Best Upcoming Phones : గెట్ రెడీ.. అక్టోబర్‌లో లాంచ్ అయ్యే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. వన్‌ప్లస్ 15 నుంచి ఐక్యూ 15 వరకు.. ఫుల్ లిస్ట్ ఇదిగో..!

Best Upcoming Phones : వచ్చే అక్టోబర్ నెలలో అనేక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. వన్‌ప్లస్, వివో, ఒప్పో ఐక్యూ వరకు ఫోన్లకు సంబంధించి ఫుల్ డిటెయిల్స్ మీకోసం..

1/5
Best Upcoming Phones : అసలే పండగ సీజన్.. అందులోనూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లతో కొనుగోలుదారులను ఊరిస్తున్నాయి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. వచ్చే అక్టోబర్ నెలలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ నెలలోనే మల్టీ బ్రాండ్లు తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. లీక్‌లు, కొన్ని నివేదికల ప్రకారం.. అక్టోబర్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను లాంచ్ చేసే ప్రముఖ బ్రాండ్లలో ఒప్పో, వివో, ఐక్యూ, వన్‌ప్లస్ ఉన్నాయి. వచ్చే నెలలో రాబోయే స్మార్ట్ ఫోన్లకు సంబంధించి అన్ని వివరాలను ఇప్పుడు వివరంగా చూద్దాం..
2/5
అక్టోబర్‌లో రాబోయే బెస్ట్ ఫోన్లు : వన్‌ప్లస్ 15 : లీక్‌ల ప్రకారం.. వచ్చే నెలలో చైనాలో వన్‌ప్లస్ 15 లాంచ్ కానుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ మొత్తం మూడు 50MP సెన్సార్‌లతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కూడా కలిగి ఉండవచ్చు. 165Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 6.78-అంగుళాల LTPO OLED డిస్‌ప్లే కలిగి ఉండొచ్చు. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీతో పాటు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుంది.
3/5
వివో X300 ప్రో : వివో X30 ప్రో లైనప్‌లో ఇతర ఫోన్‌లతో పాటు అక్టోబర్ 13, 2025న భారత మార్కెట్‌కు చేరుకోనుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మీడియాటెక్ డైమన్షిటీ 9500 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ వివో ఫోన్ 200MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉండవచ్చు.
4/5
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా : ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ఫోన్ అక్టోబర్ 16న లాంచ్ కానుంది. ఈ ఒప్పో ఫోన్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మీడియాటెక్ డైమన్షిటీ 9500 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 200MP టెలిఫోటో షూటర్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కూడా కలిగి ఉంటుంది. ఈ ఒప్పో ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. పైన కలర్ఓఎస్ 16 స్కిన్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది చివరి నాటికి ఈ ఒప్పో ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
5/5
ఐక్యూ 15 : ఐక్యూ 15 ఫోన్ ఆర్‌జీబీ స్ట్రిప్స్, ఇతర ఫీచర్లతో గేమింగ్-ఫోకస్డ్ డిజైన్‌ తీసుకురానుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 6.8-అంగుళాల LTPO 2K అమోల్డ్ డిస్‌ప్లేను తీసుకురావచ్చు. ఇంకా, ఈ ఐక్యూ 15 ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుందని చెబుతున్నారు. ఈ ఐక్యూ ఫోన్ 7000mAh బ్యాటరీతో రావొచ్చు. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉండవచ్చు.