Youtube Bilibili App : యూట్యూబ్‌కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది.. సూపర్ ఫీచర్లు.. ఫస్ట్ వీడియోతోనే క్రియేటర్లకు డబ్బులు!

Youtube Bilibili App : యూట్యూబ్‌కు పోటీగా చైనాకు చెందిన Bilibili గ్లోబల్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కు నెలకు 376 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు. కొత్త యాప్‌తో యూజర్లు, క్రియేటర్లకు ఏంటి బెనిఫిట్? ఎదురయ్యే సమస్యలేంటి?

Youtube Bilibili App

  • యూట్యూబ్‌కు కొత్త పోటీ వచ్చిందా?
  • ప్రపంచ మార్కెట్‌లోకి చైనా బిలిబిలి
  • ఈ చైనా యాప్ ఏం చేయబోతోంది?
  • యూట్యూబ్ లాగా క్రియేటర్లకు లాభమా?

Youtube Bilibili App : యూట్యూబ్‌.. ప్రపంచంలో తిరుగులేదు.. ఇప్పటివరకు వీడియో స్ట్రీమింగ్ ప్రపంచంలో గట్టి పోటీ ఎదురుకాలేదు. కానీ, ఇప్పుడు పోటీగా చైనా నుంచి ఓ కొత్త యాప్ వచ్చేసింది. చైనాలో ఇప్పటికే భారీగా పాపులర్ అయిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ బిలిబిలి (Bilibili) అంతర్జాతీయ మార్కెట్‌పై ఫోకస్ పెట్టింది.

నెలకు సుమారు 376 మిలియన్ల యాక్టివ్ యూజర్లతో ఈ ప్లాట్‌ఫామ్ లేటెస్టుగా గ్లోబల్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అతి త్వరలో iOS యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.

యూట్యూబ్‌తో పోటీ ఎలా? :

యూట్యూబ్‌కు ఈ చైనా బిలిబిలికి పోటీ ఎలా ఉండబోతుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం.. యూట్యూబ్‌లాగే బిలిబిలిలో కూడా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.

ముఖ్యంగా జెన్-జెడ్, యువత, క్రియేటర్లను ఆకర్షించడంపై కంపెనీ ఫోకస్ పెట్టింది. అంతర్జాతీయ కంటెంట్‌ను పెంచడం, లోకల్ ఆడియోన్స్ అనుగుణంగా కంటెంట్‌ను అందించడం, సైన్‌అప్ ప్రాసెస్ ఈజీ చేయడం వంటి మార్పులతో గ్లోబల్ మార్కెట్‌లోకి వస్తోంది.

Read Also : ChatGPT Brain Study : ChatGPT వాడితే నిజంగా బుర్ర పాడవుతుందా? షాకింగ్ స్టడీ ఏం చెబుతోందంటే…

ఫస్ట్ కంటెంట్‌తోనే మానిటైజేషన్ :
క్రియేటర్ల విషయంలో బిలిబిలి మరింత ఆసక్తికరమైన ఆఫర్‌ ముందుకు తెస్తోంది. ఫస్ట్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసిన దగ్గర నుంచే సంపాదించే అవకాశం కల్పిస్తామని కంపెనీ చెబుతోంది. యూట్యూబ్‌లో ఉన్నట్లుగా మానిటైజేషన్‌కు నిర్దిష్ట అర్హతలు ఇందులో లేవు. కొత్త క్రియేటర్లకు ప్రత్యేక ఆకర్షణగా మారొచ్చు. అంతర్జాతీయ క్రియేటర్లను కూడా ప్లాట్‌ఫామ్‌లోకి రప్పించేందుకు కంపెనీ తెగ ట్రై చేస్తోంది.

అయితే అసలు సవాలు ఇక్కడే.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యూజర్ బేస్, క్రియేటర్ ఎకానమీగా పేరొందిన యూట్యూబ్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. యూట్యూబ్ నుంచి బిలిబిలికి తీవ్రమైన పోటీ ఉంటుంది. అదనంగా కంటెంట్ కంట్రోలింగ్ డేటా స్టోరేజీ, వివిధ దేశాల నిబంధనలు బిలిబిలికి పెద్ద సవాళ్లుగా మారే ఛాన్స్ ఉంది.

అయితే, పోటీ పెరిగితే యూజర్లకు మాత్రం లాభమే. మరిన్ని ప్లాట్‌ఫామ్‌లు, కొత్త కంటెంట్ ఛాన్స్, క్రియేటర్లకు అదనపు సంపాదన మార్గాలు అందుబాటులోకి రావచ్చు. మరి బిలిబిలి నిజంగా యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా? లేక మరో వీడియో యాప్‌గానే మిగిలిపోతుందా? లేదో చూడాలి.

బిలిబిలిలో ప్రత్యేకత ఏంటి? :
ఈ చైనీస్ యాప్ యూట్యూబ్ మాదిరిగానే క్రియేటర్లకు డబ్బులు ఇస్తుంది. క్రియేటర్లు తమ ఫస్ట్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసిన వెంటనే డబ్బు సంపాదించవచ్చు. యూట్యూబ్‌లా ఇందులో మానిటైజేషన్ కోసం ఎలాంటి అర్హతలు అక్కర్లేదు.

ఈ కంపెనీ మిస్టర్ బీస్ట్ వంటి అంతర్జాతీయ క్రియేటర్లను కూడా ప్లాట్‌ఫామ్‌కు ఆకర్షించింది. అంతర్జాతీయ వెర్షన్ కోసం కంపెనీ యాప్‌లో సైన్ అప్ ఈజీ చేసింది. మరింత మంది క్రియేటర్లు యాప్‌ వాడేలా ఎలాంటి ఐడెంటిటీ వెరిఫికేషన్ లేదంటోంది.