Black Friday Sale 2025
Black Friday Sale 2025 : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ఆపిల్ ఐఫోన్ 16 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. మీరు కూడా ఐఫోన్ 16 కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ఐఫోన్ 17 ధరలు భారీగా పెరగనున్నాయి. తక్కువ ధరకే కొత్త ఐఫోన్ కోరుకునే వారందరికీ ఐఫోన్ 16 బెస్ట్ ఆప్షన్. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా ఐఫోన్ 16పై ఊహించని (Black Friday Sale 2025) డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఏకంగా రూ. 22వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఇలా పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 బ్లాక్ ఫ్రైడే డీల్ :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 8GB ర్యామ్ వేరియంట్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.58,999కు లభిస్తుంది. అసలు ధర రూ.79,900 నుంచి తగ్గింపు పొందింది. అంతేకాకుండా, మీరు ఎంచుకున్న బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, రోజ్, టీల్, వైట్ అల్ట్రామెరైన్ అనే 5 విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 హై-గ్రేడ్ పర్ఫార్మెన్స్ కోసం ఆపిల్ 5-కోర్ GPU గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో ఆపిల్ A18 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ఐఫోన్ మోడల్ స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే అందిస్తుంది.
ప్యానెల్ MOHS లెవల్ 4 సిరామిక్ షీల్డ్ గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 16లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP ప్రైమరీ షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్-యాంగిల్ షూటర్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ స్నాపర్ కలిగి ఉంది. 3561mAh బ్యాటరీతో పాటు 25W వైర్‌లెస్ మాగ్‌సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రన్ అవుతుంది. ఈ ఐఫోన్ ఇతర ఫీచర్లలో ఫేస్ ఐడీ, గైరో, ప్రాక్సిమిటీ, బేరోమీటర్, ఎమర్జెన్సీ SOS వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.