Boltt Smartphone Launch : బడ్జెట్ ఫోన్లకు కొత్త పోటీ.. ఫైర్ బోల్ట్ ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది.. ధర రూ.20 వేల లోపే..!
Boltt Smartphone Launch : ఈ ఫైర్-బోల్ట్ స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ అయింది. యూనిసోక్ T7250 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని అంచనా. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుందని అంచనా.
- Sreehari A
- Published on- August 4, 2026 / 07:37 PM IST
Boltt Smartphone Launch
- ఈ స్మార్ట్‌ఫోన్ యునిసోక్ టి7250 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది
- ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో రావొచ్చు
- ఈ స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ అనే బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో లిస్టింగ్
Boltt Smartphone Launch : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? భారత వేరబుల్స్ మార్కెట్‌లో భారీ వాటాతో దూసుకుపోతున్న ఫైర్-బోల్ట్ అతి త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. రాబోయే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్ల వివరాలు లీక్ అయ్యాయి.
గతంలో, బోల్ట్ స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యునిసోక్ టి7250 చిప్‌సెట్ ఉంటుందని, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుందని భావిస్తున్నారు.
ఈ నెల 25న లాంచ్‌కు రెడీ? :
ఫస్ట్ బోల్ట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యక్షమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 25న లాంచ్ (Boltt Smartphone Launch) కానుంది. బోల్ట్ స్మార్ట్‌ఫోన్ క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని మైక్రోసైట్ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ సైడ్ డిజైన్‌ను మైక్రోసైట్ రివీల్ చేసింది.
ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్ ఉంది. కింది బెజెల్ ఇతర వైపుల కన్నా కొద్దిగా మందంగా కనిపిస్తుంది. పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ ఈ స్మార్ట్‌ఫోన్ రైట్ సైడ్ ఉండొచ్చు. ఫ్లాట్-ఫ్రేమ్ డిజైన్‌తో వస్తుందని భావిస్తున్నారు.
రూ. 20వేల లోపు ధరలో వచ్చే ఛాన్స్ :
అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ ఫైర్-బోల్ట్ స్పెసిఫికేషన్లు, ధరను ఇంకా రివీల్ చేయలేదు. ఫైర్-బోల్ట్ ప్రారంభంలో రూ. 20వేల లోపు ధరలో స్మార్ట్‌ఫోన్‌లపై ఫోకస్ పెట్టవచ్చని గత నివేదికలు సూచించాయి.
ఒకవేళ ఇదే జరిగితే.. ఈ సెగ్మెంట్‌లో ఆ కంపెనీ లావా, ఒప్పో, వివో, శాంసంగ్ వంటి బ్రాండ్‌లతో నేరుగా పోటీపడుతుంది.
స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో ఏస్, ఇవో సిరీస్‌లు ఉండే ఛాన్స్ ఉంది. అందులో 4G, 5G మోడల్‌లు కూడా ఉంటాయని ఫైర్-బోల్ట్ గతంలోనే రివీల్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లోనే తయారుకానున్నాయి.
ఇటీవల, కంపెనీ ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ బోల్ట్ ఇవో 4జీ లాంచ్ చేయొచ్చునని కొన్ని నివేదికలు సూచించాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో కూడా లిస్టు అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రాసెసర్‌గా యునిసోక్ T7250 ఉండవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించే ఛాన్స్ ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్‌లో సింగిల్-కోర్ టెస్టింగ్‌లో 440 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టింగ్‌లో 1,470 పాయింట్లు సాధించింది. ఎంట్రీ-లెవల్ చిప్‌సెట్ యునిసోక్ T7250లో 1.82GHz వద్ద క్లాక్ అయింది. రెండు సీపీయూ కోర్లు, 1.61GHz వద్ద రన్ అయ్యే 6 ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నాయి. ఈ చిప్‌సెట్‌ను రియల్‌మి P4x, ఒప్పో A6c, పోకో C81 ప్రో, ఐటెల్ జెనో 200లలో కూడా వాడారు.
