Fake iPhone
Fake iPhone : కొత్త ఆపిల్ ఐఫోన్ కొన్నారా? లేదా కొంటున్నారా? అయితే ఇది మీకోసమే.. మీరు కొనుగోలు చేసింది నిజంగా ఐఫోన్ అవునా కాదా? డౌట్‌గా ఉందా? ఇప్పుడే చెక్ చేసుకోండి. ప్రస్తుతం మార్కెట్లో పండగ సీజన్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ సమయంలో ఫేక్ ఐఫోన్లు ఎక్కువగా విక్రయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటీవలి ఏళ్లలో ఫేక్ ఐఫోన్‌ల మార్కెట్ విస్తరించింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో పండుగ సేల్స్ వంటి ప్రధాన షాపింగ్ సమయంలో ఫేక్ ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.
ఇటీవలి రిపోర్టులను పరిశీలిస్తే.. ఫేక్ ఐఫోన్ మార్కెట్ ఇప్పుడు మిలియన్ల డాలర్ల విలువైనదని సూచిస్తున్నాయి. మీరు కొత్త ఐఫోన్ కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడే చెక్ చేయడం బెటర్. ముఖ్యంగా ఈ సేల్ సమయంలో ఐఫోన్ అథెంటికేషన్ వెరిఫికేషన్ చేయడం ఎంతైనా మంచిది. మీరు కొనుగోలు చేసిన ఐఫోన్ నిజంగా ఐఫోన్ అవునో కాదో తెలుసుకునేందుకు నాలుగు ఈజీ మెథడ్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..
1. IMEI, సీరియల్ నంబర్‌ను వెరిఫై చేయండి :
ప్రతి స్మార్ట్‌ఫోన్, ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్, డివైజ్ వెరిఫికేషన్‌కు అవసరమైన ప్రత్యేకమైన IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) నంబర్‌ను కలిగి ఉంటుంది.
IMEI చెక్ చేయండి : ఐఫోన్ బాక్స్‌లోని స్టిక్కర్‌ను చెక్ చేయండి లేదా ఫోన్ కీప్యాడ్‌లో $*#06\#$ డయల్ చేయండి.
నంబర్ మ్యాచింగ్ కోసం చెక్ చేయండి: ఐఫోన్‌లో కనిపించే IMEI బాక్సులోని నంబర్‌తో సరిపోలకపోతే కొనుగోలు చేసిన ఐఫోన్ దాదాపు ఫేక్ కావచ్చు.
2. ఆపరేటింగ్ సిస్టమ్ (OS) కన్ఫార్మ్ చేయండి :
ఒరిజినల్ ఐఫోన్‌లు ఆపిల్ యాజమాన్య iOS ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా రన్ అవుతాయి. ఫేక్ ఫోన్లు తరచుగా iOS మాదిరిగా కనిపించేలా రూపొందించిన ఆండ్రాయిడ్ మాడిఫైడ్ వెర్షన్‌ను రన్ చేస్తాయి.
ఆపరేటింగ్ సిస్టమ్ (OS) చెక్ చేయండి :
మీ ఐఫోన్ Settings ఆప్షన్‌కు వెళ్లండి.
ఫేక్ ఐడెంటిటీ : iOS యూజర్ ఇంటర్‌ఫేస్ ఆండ్రాయిడ్ ఇతర మొబైల్ $\text{OS}$s కన్నా భిన్నంగా ఉంటుంది. అన్‌నౌన్ సాఫ్ట్‌వేర్ కనిపిస్తే లేదా ఆండ్రాయిడ్ మాదిరి ఇంటర్‌ఫేస్ కలిగి ఉంటే వెంటనే అనుమానించాలి. మీరు కొనుగోలు చేసిన ఫోన్‌లో iOS రన్ కాకపోతే అది ఫేక్ ఐఫోన్ అని గుర్తించాలి.
ఆపిల్ అధికారిక కవరేజ్ చెకర్ ద్వారా అథెంటికేషన్ చెకింగ్ చేయొచ్చు.
వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి : ఆపిల్ అధికారిక (https://checkcoverage.apple.com/?locale=en_IN) చెక్ కవరేజ్ పేజీకి వెళ్లండి.
వివరాలను ఎంటర్ చేయండి : ఈ ఐఫోన్ సీరియల్ నంబర్ (బాక్స్‌లో లేదా Settings > General> About) అవసరమైన వెరిఫికేషన్ కోడ్ (CAPTCHA)ను ఇన్‌పుట్ చేయండి.
వెరిఫై : సీరియల్ నంబర్ వ్యాలిడిటీ లేకపోయినా మీ డివైజ్ మ్యాచ్ కాని సమాచారాన్ని చూపిస్తే (ఉదాహరణకు.. మరో మోడల్ లేదా కొనుగోలు తేదీ), ఫోన్ ఫేక్ అయి ఉండవచ్చు.
4. ఎక్స్‌ట్రనల్ డిజైన్, స్ట్రక్చర్ పరిశీలించండి :
సాధారణంగా ఈ పద్ధతి కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఐఫోన్ లుక్ భిన్నంగా ఉండటం, డిజైన్ లాంగ్వేజీ, ప్రీమియం నిర్మాణ క్వాలిటీని కలిగి ఉంటాయి. చాలావరకు ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే మీరు కొనుగోలు చేసిన ఐఫోన్ ఒరిజినల్ అవునో కాదో జాగ్రత్తగా పరిశీలించండి.
మెటీరియల్స్ : ఫోన్ ఫ్రేమ్ చౌకగా ప్లాస్టిక్‌గా అనిపిస్తుందా?
లోగోలు, టెక్స్ట్: ఆపిల్ లోగో లేదా బ్యాక్ సైడ్ టెక్స్ట్ మార్కింగ్‌లు కొద్దిగా అస్పష్టంగా ఉన్నాయా లేదా తప్పుగా ఉన్నాయా చెక్ చేయండి.
బటన్లు : ఫోన్ బటన్లు సరిగా రెస్పాండ్ కాకపోతే కూడా అనుమానాల్సిందే.