Boult Audio launches Swing smartwatch with Bluetooth calling features, price set at Rs 1799
Boult Audio Swing Smartwatch : ప్రముఖ ఆడియో బ్రాండ్ బౌల్ట్ (Boult Audio Swing) మరో కొత్త స్మార్ట్‌వాచ్ ప్రవేశపెట్టింది. లేటెస్ట్ బడ్జెట్ బౌల్ట్ స్వింగ్ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌లతో వస్తుంది. ఈ వాచ్ అద్భుతమైన ఆఫర్‌లను అందించడమే కాకుండా భారీ డిస్‌ప్లేతో వస్తుంది. బౌల్ట్ స్మార్ట్‌వాచ్ 1.9-అంగుళాల చదరపు స్క్రీన్‌తో 1000 నిట్స్‌తో వస్తుంది. స్మార్ట్‌వాచ్‌లో పేమెంట్ QR కోడ్ స్కానర్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉన్నాయి. కొత్త లాంచ్ గురించి బౌల్ట్ ఆడియో వ్యవస్థాపకుడు సీఈఓ వరుణ్ గుప్తా మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఆడియో వేరబుల్స్ మార్కెట్లో బౌల్ట్ ఆడియో క్రమంగా అభివృద్ధి చెందుతోంది.
స్మార్ట్‌వాచ్ వేరబుల్ విభాగంలో తనదైన ముద్ర వేస్తోంది. మా ప్రొడక్టుల్లో పోర్ట్‌ఫోలియోకు మరో స్మార్ట్‌వాచ్ ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. వాచ్ యూజర్లకు లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుంది. అప్‌గ్రేడ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. హెల్త్ అప్‌డేట్స్ గురించి తెలుసుకునేందుకు స్మార్ట్‌వాచ్ వేరబుల్ విభాగంలో అత్యాధునిక సాంకేతికతను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు.
Boult Audio launches Swing smartwatch with Bluetooth calling features
బౌల్ట్ స్వింగ్ స్మార్ట్‌వాచ్ ధర ఎంతంటే? :
బౌల్ట్ స్వింగ్ స్మార్ట్‌వాచ్ ప్రత్యేక ధర రూ. 1799గా ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం ఫ్లిప్‌కార్ట్ (Flipkart), కంపెనీ అధికారిక వెబ్‌సైట్ (www.boultaudio.com)లో ఫిబ్రవరి 16 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ మోడల్ లేత గోధుమరంగు, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
బౌల్ట్ స్వింగ్ ఫీచర్లు :
బౌల్ట్ స్వింగ్ 1000 నిట్, భారీ 1.9-అంగుళాల చదరపు స్క్రీన్‌ను కలిగి ఉంది. స్క్రీన్ జింక్ అల్లాయ్ ఫ్రేమ్ కలిగి ఉంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌లతో వస్తుంది. మైక్రోఫోన్ స్పీకర్ కలిగి ఉంది. వినియోగదారులు కాల్‌లు చేయడంతో పాటు నోటిఫికేషన్‌లను పొందవచ్చు. బ్యాటరీ విషయానికొస్తే.. స్మార్ట్‌వాచ్ ఒకే ఛార్జ్‌పై ఏడు రోజుల వరకు ఉంటుంది. స్టాండ్‌బై టైమ్ 20 రోజుల వరకు ఉంటుంది. ఈ వాచ్ కేవలం రెండు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. అదనంగా, వాచ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. IP67 రేటింగ్‌తో రోజువారీ వినియోగానికి బెస్ట్ వాచ్ అని చెప్పవచ్చు.
Boult Audio launches Swing smartwatch with Bluetooth calling features
స్వింగ్ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకమైన ఫీచర్లలో ఒకటి పేమెంట్ QR కోడ్‌లను స్కానింగ్.. ఇది వినియోగదారులు తమ వాచ్ నుంచి నేరుగా లావాదేవీలు చేసుకోవచ్చు. స్వింగ్ స్మార్ట్‌వాచ్‌లో 24×7 హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్ మానిటరింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, స్టెప్ కౌంట్స్, డ్రింక్ వాటర్ రిమైండర్‌లు, సెడెంటరీ రిమైండర్‌లతో సహా హెల్త్ మానిటరింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కస్టమైజడ్ ఫీచర్‌లతో 150+ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను, అన్ని రకాల వర్కౌట్‌లకు సరిపోయేలా 100+ స్పోర్ట్స్ మోడ్‌లను కూడా అందిస్తుంది.