Fire Boltt Apollo Smartwatch : రూ.3వేల లోపు ధరకే ఫైర్ బోల్ట్ అపోలో స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ చేసుకోవచ్చు.. ఇప్పుడే కొనేసుకోండి..!
Fire Boltt Apollo Smartwatch : ప్రముఖ వేరబుల్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ తమ ప్రొడక్టుల్లో మరో బ్లూటూత్-కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ని ప్రవేశపెట్టింది. వాయిస్ అసిస్టెంట్, 100 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లతో 1.43-అంగుళాల రౌండ్ ఆల్వేస్-ఆన్ AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది.

Fire-Boltt-Apollo-smartwatch
Fire Boltt Apollo Smartwatch : ప్రముఖ వేరబుల్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ (Fire Boltt) తమ ప్రొడక్టుల్లో మరో బ్లూటూత్-కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ని ప్రవేశపెట్టింది. వాయిస్ అసిస్టెంట్, 100 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లతో 1.43-అంగుళాల రౌండ్ ఆల్వేస్-ఆన్ AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. ఫైర్ బోల్ట్ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ అపోలో (Fire Boltt Apollo Smartwatch)ను ప్రకటించింది. బ్లూటూత్-రెడీ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ల కోసం కంపెనీ కొత్త లైనప్‌ను విస్తరిస్తోంది.
స్మార్ట్ ఫీచర్‌లతో పాత క్లాసిక్ రౌండ్-షేప్ డయల్‌ను కోరుకునే వినియోగదారులకు అందిస్తోంది. ఫైర్-బోల్ట్ సహ వ్యవస్థాపకులు ఆయుషి, అర్నవ్ కిషోర్ స్మార్ట్‌వాచ్ గురించి మాట్లాడుతూ… ‘ఫైర్-బోల్ట్ అపోలో స్మార్ట్‌వాచ్ లాభదాయకమైన ధర-పాయింట్‌లో లభిస్తుంది. అధునాతన ఫీచర్లతో యువతను ఆకట్టుకునేలా ఉంటుందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ఫైర్ బోల్ట్ అపోలో వాచ్ ధర ఎంతంటే? :
ఫైర్ బోల్ట్ అపోలో స్మార్ట్‌వాచ్ ధర రూ. 2,999 వద్ద అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, గ్రే, పింక్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

Fire-Boltt-Apollo-smartwatch
ఫైర్ బోల్ట్ అపోలో వాచ్ స్పెసిఫికేషన్లు ఇవే :
ఫైర్ బోల్ట్ అపోలో 466×466 పిక్సెల్స్ రిజల్యూషన్, 600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 1.43-అంగుళాల రౌండ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ 60 హెర్ట్జ్‌తో స్క్రోలింగ్, నావిగేషన్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.120 నిమిషాల ఛార్జ్ సమయంతో గరిష్టంగా 5 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తామని కంపెనీ పేర్కొంది. స్టాండ్‌బై, స్మార్ట్‌వాచ్ 480 గంటల రన్‌టైమ్‌ను అందించగలదు. ఫిట్‌నెస్ ట్రాక్ చేసేందుకు వాచ్ 100 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లతో ప్రీలోడ్ అయింది. SpO2 మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్‌తో హెల్త్ సూట్‌ను కూడా అందిస్తుంది. ఫైర్ బోల్ట్ అపోలో యూజర్లకు సెడెంటరీ రిమైండర్‌లను యాడ్ చేసేందకు అనుమతిస్తుంది.

Fire Boltt Apollo smartwatch launched with Bluetooth
ఫైర్ బోల్ట్ అపోలో IP67 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ వాయిస్ అసిస్టెన్స్, AI వాయిస్ అసిస్టెంట్‌కి కూడా సపోర్టు ఇస్తుంది. వినియోగదారులు మ్యూజిక్ ప్లే చేసేందుకు లేదా అలారం, వెదర్ అప్‌డేట్‌లు, రిమైండర్‌లు మొదలైన ఇతర ఫీచర్‌లను యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. క్లౌడ్ ఫేస్‌ల వైడ్ రేంజ్ కలిగి ఉంటుంది. మూడు విభిన్న UI స్టయిల్స్ కలిగి ఉంటుంది. ఫైర్ బోల్ట్ వాచ్ స్మార్ట్ కంట్రోల్స్‌తో వస్తుంది. స్మార్ట్‌వాచ్ వినియోగదారులు తమ వాచ్‌పై ఒక్క క్లిక్‌తో మ్యూజిక్, కెమెరాను కంట్రోల్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ స్మార్ట్ నోటిఫికేషన్ ఫీచర్‌తో పాటు, డివైజ్ స్మార్ట్‌వాచ్‌లోని అన్ని మొబైల్ ఫోన్ నోటిఫికేషన్‌లను పొందవచ్చు.
Read Also : Paytm UPI Lite Payments : పేటీఎంలో సరికొత్త ఫీచర్.. ఇకపై పిన్ లేకుండానే ఈజీగా పేమెంట్లు చేసుకోవచ్చు..!