Paytm UPI Lite Payments : పేటీఎంలో సరికొత్త ఫీచర్.. ఇకపై పిన్ లేకుండానే ఈజీగా పేమెంట్లు చేసుకోవచ్చు..!

Paytm UPI Lite Payments : ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం (Paytm) యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం యాప్‌లో అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పేటీఎం యూజర్లు పేమెంట్ చేసిన ప్రతిసారీ PINని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.

Paytm UPI Lite Payments : పేటీఎంలో సరికొత్త ఫీచర్.. ఇకపై పిన్ లేకుండానే ఈజీగా పేమెంట్లు చేసుకోవచ్చు..!

Paytm's-UPI-Lite-will-now-l

Paytm UPI Lite Payments : ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం (Paytm) యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం యాప్‌లో (UPI Lite) అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పేటీఎం యూజర్లు పేమెంట్ చేసిన ప్రతిసారీ PINని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. చిన్నమొత్తంలో విలువైన లావాదేవీలను పిన్ అవసరం లేకుండానే చేసుకోవచ్చు. (UPI) అంటే.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్, రియల్ టైమ్ బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీలను అనుమతించే డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్.. ప్రస్తుత సెటప్ యూజర్ల పేమెంట్లు చేసేందుకు ముందు వారి UPI పేమెంట్లను ఎంటర్ చేసేందుకు అనుమతిస్తుంది.

వినియోగదారులు పేమెంట్ చేయడానికి ముందు వారి వ్యాలెట్ డబ్బును యాడ్ చేసే అవకాశం ఉంది. కొత్త ఫీచర్‌పై NPCI, COO ప్రవీణా రాయ్ మాట్లాడుతూ.. ‘Paytm పేమెంట్స్ బ్యాంక్‌లో UPI LITE యాప్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. UPI LITE యూజర్లు సురక్షితమైన తక్కువ మొత్తంలో లావాదేవీలను అందిస్తుంది’ అని తెలిపారు.

UPI పేమెంట్ల ద్వారా 50 శాతం కన్నా ఎక్కువ లావాదేవీలతో రూ. 200 కన్నా తక్కువగా ఉంటుంది. (UPI LITE) తక్కువ విలువ కలిగిన లావాదేవీలను చేసేందుకు అందిస్తుంది. UPI లైట్ యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. పేటీఎం వినియోగదారులు Paytm ద్వారా కేవలం ఒక క్లిక్‌తో రూ. 200 వరకు వేగంగా లావాదేవీలు చేయవచ్చు. UPI లైట్ వ్యాలెట్ ద్వారా రోజుకు రెండుసార్లు రూ. 2,000 వరకు యాడ్ చేయొచ్చు.

Paytm's-UPI-Lite-will-now

Paytm UPI Lite Payments

Read Also : iPhone 14 Discount Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇంకా తక్కువ ధరకు పొందాలంటే?

దీని ద్వారా రోజువారీ వినియోగాన్ని రూ. 4000 వరకు పెంచవచ్చునని పేటీఎం ప్రకటనలో తెలిపింది. UPI లైట్‌ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించింది. సెప్టెంబర్ 2022లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రారంభించింది. మల్టీ బ్యాంక్ లావాదేవీలకు అంతరాయం కలగకుండా చిన్న మొత్తంలో లావాదేవీలను చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ మరింత మంది డిజిటల్ పేమెంట్లను చేసేందుకు సాయపడుతుందని భావిస్తున్నారు.

UPI లైట్‌ ఫీచర్ ద్వారా వినియోగదారులు పెద్ద సంఖ్యలో చిన్న మొత్తంలో UPI పేమెంట్లను సూపర్‌ఫాస్ట్‌గా నిర్వహించవచ్చు. ఈ లావాదేవీలు కేవలం Paytm బ్యాలెన్స్, హిస్టరీ సెక్షన్‌లో మాత్రమే కనిపిస్తాయి. బ్యాంక్ పాస్‌బుక్‌లో కాదని గమనించాలి. UPI లైట్ అనేది ప్రతిసారీ PINని ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా చిన్నమొత్తంలో డిజిటల్ లావాదేవీలు చేసేందుకు వీలువుతుంది. ఈ సరికొత్త ఫీచర్ భారత్ అంతటా ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు చేసే యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

Read Also : iQOO Neo 7 Launch : 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, భారీ బ్యాటరీతో ఐక్యూ నియో 7 ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?